రొటీన్ శ్రీ

సినిమా: శ్రీ
విడుదల తేదీ: 3-11-2005
నటీనటులు: మనోజ్, తమన్నా, గిరిబాబు, సుకన్య,
మోహన్‌బాబు, బ్రహ్మానందం, దేవరాజన్,
సునీల్, రాజేష్, జయప్రకాష్‌రెడ్డి తదితరులు
సంగీతం: సందీప్ చౌతా
కథ: సత్యానంద్
మాటలు: కోన వెంకట్
స్క్రీన్‌ప్లే: గోపీమోహన్
ఎడిటింగ్: గౌతంరాజు
నిర్మాత: ఎం లక్ష్మీ ప్రసన్న
దర్శకత్వం: దశరథ్
'సంతోషం' వంటి లైటర్‌వీన్ ఫీల్ ఫిల్మ్‌తో మంచి టేస్టున్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్న దశరథ్ రూటు మార్చి తాజాగా చేసిన యాక్షన్ చిత్రం 'శ్రీ'. 'ఒక్కడు' 'రౌడీగారి పెళ్ళాం' చిత్రాలను కలగలిపినట్టున్న ఈ ఫ్యాక్షన్ చిత్రం ఆద్యంతం ఫైట్స్‌తో నిండడంతో ఒక వర్గం వారికే నచ్చేటట్టు ఉంది.
కథ: శ్రీరాం (మనోజ్) తన తల్లి (సుకన్య)తో కలిసి భువనేశ్వర్‌లో ఉంటుంటాడు. ఇంజినీరింగ్ చదివి ఫ్యాక్టరీ పెట్టాలనుకునే ఇతని చుట్టూ ఎప్పుడూ ఒక పోరంబోకు ముఠా ఉంటుంది. ఒకరోజు వారంతా పూరీజగ న్నాధ్ రథోత్సవంలో పాల్గొన్న అమ్మాయిలకు సైటు కొడుతుండగా శ్రీని ఒకమ్మాయి ఆకర్షిస్తుంది. ఆమె పేరు సంధ్య (తమన్నా). ఆమెది ఆంధ్రాయేనని తెలుసుకుని వెంటపడి ప్రేమతో పాటలు పాడుకుంటాడు. ఆమెను కలవడానికి ఒక పెళ్ళికి వెళ్ళి తన ప్రేమను వెల్లడిస్తాడు. తర్వాత ఆమె కూడా తనను ప్రేమిస్తోందని తెలుస్తుంది. ఆమెను తల్లికి పరిచయం చేయాలనుకుంటాడు. ఈలోగా ఆమెను ఒక ఫ్యాక్షన్ గ్రూపు ఆంధ్రా నుంచి వచ్చి వెంబడిస్తోందని తెలిసి 'ఒక్కడు'లా చేజింగులు, ఫైట్స్‌తో చెలరేగుతాడు. ఈలోగా తనకీ ఒక ఫ్లాష్‌బ్యాక్ ఉందని తెలుసుకుంటాడు. తన తండ్రి (మోహన్‌బాబు) గతంలో 'రౌడీగారు పెళ్ళాం'లో లాగా రౌడీ నుంచి మారిన వ్యక్తని, అతడిని ఫ్యాక్షనిస్టులు చంపేశారని తెలుస్తుంది. హీరోహీరోయిన్లు ఇద్దరికీ ఫ్లాష్‌బ్యాక్‌లో ఫ్యాక్షన్ కనెక్షన్ ఉండడం, ఇద్దరికీ విలన్ ఒక్కడే (దేవరాజ్) కావడంతో అతని మీద యుద్ధం ప్రకటిస్తారు. తర్వాత ఏం జరిగిందన్నది తెర మీద చూడాల్సిందే.
ఇలాంటి మూస ప్రేమ, ప్రతీకారం మార్కు కథలు తెలుగు ప్రేక్షకులకు కొట్టినపిండే. వీటిని తవ్వి తీసి ప్రేక్షకుల స్మరణ శక్తిని, సహనశక్తిని పరీక్షించాలనుకోవడం సాహసమే. మాస్ మెచ్చే సినిమాలు తీయాలనే తాపత్రయంలో ఇలాంటి హింసతో కూడ్న సినిమాలు వస్తున్నాయి. ఇందులో మోహన్‌బాబు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను సెకండాఫ్‌లో చెప్పడం వల్ల స్క్రీన్‌టైం వృధా కావడం తప్ప కథకు కలిసొచ్చిందేమీ లేదు. అదే హీరోకి సొంత ఫ్లాష్‌బ్యాక్ ఉంటే బాగుండేది. హీరో గురించి ఒక కొత్త విషయం తెలిసి కథ పరుగెత్తేది. ఈ ఎపిసోడ్ లేకపోయిన్నా హీరోయిన్‌ను రక్షించడం కోసం మిగితా కథ అలాగే ఉండేది. దీనితో రెండో మలుపు మిస్ అయి ఎమోషన్ గ్రాఫ్ పడిపోయింది. ఇది స్క్రీన్‌ప్లే లోపమే. అలాగే 'ఒక్కడు' చిత్రంలో పరిచయం లేని ఓ ఆపదలో ఉన్న అమ్మాయి కోసం సాహసం చేయడం గొప్ప హీరోయిజం. ఇందులో తాను ప్రేమించిన అమ్మాయి కోసమే గాక తన తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకోవడం వల్ల వ్యక్తిగత వ్యవహారమైపోయింది. హీరో పరిచయం కోసం అన్నట్టు హీరోయిన్ ఫ్యామిలీ మొదట్లో భువనేశ్వర్ చేరుకోవడం సినీ విచిత్రం. హీరో ఫ్యాక్టరీ పెడతానని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా ఏమీ చేయడు. ఏది ఏమైనా సెకండాఫ్ స్పీడ్‌గా నడవడం, కెమెరా ప్రతిభ వల్ల బోర్ అన్పించదు. కోన వెంకట్ డైలాగ్స్ పెద్దగా పేలలేదు. దర్శకత్వ పరంగా చెప్పుకోదగినది ఏమీ లేదు. ఈ చిత్రంలో మనోజ్ నటనలో ఈజ్ కన్పించింది. మూడు పాటలు బాగున్నాయి. హింస ఎక్కువగా ఉన్న ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కావచ్చు.
గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.


Click it and Unblock the Notifications











