Sridevi Shoban Babu review శ్రీదేవి కనిపించలే.. శోభన్ బాబు మెప్పించలే
Rating: 1.5/5
నటీనటులు: సంతోష్ శోభన్, గౌరీ జీ శంకర్, నాగబాబు, రోహిణి తదితరులు
దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ దిమ్మల
నిర్మాతలు: విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల
మ్యూజిక్: కమ్రాన్
సినిమాటోగ్రఫి: సిద్దాంత్ రామస్వామి
ఎడిటర్: శశిధర్ రెడ్డి
రిలీజ్ డేట్: 2023-02-18
బిజినెస్ మ్యాన్ చంద్రశేఖర్ (నాగబాబు) కూతురు శ్రీదేవీ (గౌరీ జీ శంకర్) పాపులర్ ఫ్యాషన్ డిజైనర్. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ కోసం అరుకు ప్రాంతానికి వెళ్లాలని అనుకొంటుంది. అయితే తన కూతురు శ్రీదేవీ ప్లాన్ విన్న తండ్రి అందుకు నిరాకరిస్తాడు. అయితే తండ్రిని చివరకు ఒప్పించి అరకు చేరుకోగా అక్కడ శోభన్ బాబు (సంతోష్ శోభన్) పరిచయం అవుతాడు.
అరకు వెళ్తానంటే కూతురు శ్రీదేవిని తండ్రి ఎందుకు వద్దన్నాడు? అరకు ప్రాంతానికి నాగబాబుకు ఉన్న సంబంధమేమిటి? శోభన్ బాబుకు శ్రీదేవికి ఉన్న రిలేషన్ ఏమిటి? తండ్రికి ఎదురైన చేదు అనుభవానికి శ్రీదేవీ ఎలాంటి పరిష్కారం చూపించింది. శోభన్ బాబుతో శ్రీదేవీ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? శ్రీదేవీ తండ్రికి తన అత్తమ్మ కమల (రోహిణి)కు ఉన్న గొడవలకు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే శ్రీదేవీ శోభన్ బాబు సినిమా కథ.

శ్రీదేవీ శోభన్ బాబు సినిమా చాలా నాసిరకమైన కథ, పేలవమైన సీన్లు, స్క్రీన్ ప్లేతో తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. కథ నడుస్తున్న కొద్ది సినిమా ఎక్కడైన మంచి మలుపుతో ట్రాక్ ఎక్కుతుందనే వారికి కఠినమైన పరీక్షగా మారుతుంది. దర్శకుడు ఎంచుకొన్న పాయింట్, ఆయన అనుసరించిన ట్రీట్‌మెంట్ టెలివిజన్ సీరియల్‌ను పక్కన పెడిత షార్ట్ ఫిలిం రేంజ్‌లో కూడా లేకపోవడం ఈ సినిమాకు శాపంగా మారిందని చెప్పవచ్చు. షూటౌట్ ఎట్ ఆలేరు, సేనాపతి లాంటి సినిమాలతో నిర్మాత సుస్మిత కొణిదెల అభిరుచి ఉన్న నిర్మాత అనే ముద్ర వేసుకొన్నది. కానీ ఈ సినిమాను చూస్తే.. సరిగా చేయలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక సంతోష్ శోభన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో ప్రతిభావంతుడనే ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఎంచుకొంటున్న సినిమాలు చూస్తే.. రకరకాల అనుమానాలు, సందేహాలు వస్తుంటాయి. తన క్యాలిబర్, టాలెంట్‌కు ఏ మాత్రం సరిపడని పాత్రలతో నిరాశపరుస్తాడనే ఫీలింగ్ కలుగుతుంది. హీరో, హీరోయిన్ల పాత్రలు బలంగా లేకపోవడం, సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం వల్ల సంతోష్ శోభన్, గౌరీ తమనుతాము ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ లేకపోయింది. హీరో, హీరోయిన్ల చుట్టు ఉండే క్యారెక్టర్లు కూడా చాలా పేలవంగా ఉన్నాయి.

కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ పాయింట్స్, రొమాన్స్, కెమిస్ట్రీ అనే అంశాలు ఉంటే తప్పా.. సాంకేతిక నిపుణులు ఏదైనా చేయగలుగతారు. కాలం చెల్లిన పాతతరం కథ, కథనాల కారణంగా సాంకేతిక నిపుణులు ఏమీ చేయలేకపోయారనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సినిమా అంటే సెలబ్రేషన్, ఎమోషన్, జీవితం అనే ఫ్యామిలీ నుంచి వచ్చిన సుస్మిత నిర్మాతగా ఇలాంటి సినిమాలు చేయకుంటే బావుంటుందనేది ఓ చిన్న సలహా.
శ్రీదేవి శోభన్ బాబు అనే టైటిల్ చూడగానే ఏదో కొత్త పాయింట్‌తో వైవిధ్యంగా ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే అలాంటి ఫీలింగ్‌కు భిన్నంగా ఏ మాత్రం కొత్తదనం, ఆకట్టుకొలేని విధంగా ఉన్న సినిమా శ్రీదేవీ శోభన్ బాబు. అన్ని విభాగాల్లోను నిరాశపరిచే చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ఎంత దూరం ఉంటే.. అంత మంచిదని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











