శ్రీకాంత్, సదాల 'అఆఇఈ' రివ్యూ

By Srikanya
Aa Aaa Ee Eee
Rating
-సూర్య ప్రకాష్ జోశ్యుల
బ్యానర్: కల్పనా ఆర్ట్స్
నటీనటులు: శ్రీకాంత్, మీరా జాస్మిన్, కృష్ణభగవాన్, తణికెళ్ళ, కవిత, బ్రహ్మానందం, అలీ, సునీల్, కొవే సరళ,
ఎమ్మెస్ నారాయణ, తెలంగాణా శకుంతల, రఘుబాబు, అపూర్వ, వెంకట్, ఉత్తేజ్ తదితరులు.
సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ
కెమెరా: విజయ్.సి.కుమార్
ఎడిటర్: గౌతం రాజు
కథ,మాటలు:గోళ్లపాటి నాగేశ్వరరావు
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
ని్ర్మాత: బొద్దం అశోక్ కుమార్
విడుదల తేది: 6,నవంబర్ 2009

ఇద్దరు భామల మధ్యన నలిగే ముద్దుల మొగుళ్ళ స్టోరీలు తెలుగు తెరకు కొత్తే కాదు. గతంలో శ్రీకాంత్ సైతం చేసి ఉన్నాడు. అయితే అఆఇఈ అంత ముతక కథను మాత్రం దాదాపు చేసి ఉండరనే చెప్పాలి. బావుంది అనిపించుకోవటానికి ఒక్క ఎలిమెంట్ కూడా లేకపోవటం మరో విచిత్రం అనిపిస్తుంది. అలాగే హాస్య చిత్రాల శ్రీనివాస రెడ్డి చిత్రం కావటంతో పోనీ కామిడీ అయినా వర్కవుట్ అవుతుంని భావిస్తాం. అదీ ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి ఇది సెంటిమెంట్ తో మనస్సులను కదిలించటం కన్నా జనాల్ని ధియోటర్ల నుంచి బయిటకు కదిలించేటట్లు తయారైంది.


కథలో చంద్రం (శ్రీకాంత్)ఓ అతి నిజాయితీపరుడైన టాక్సీ డ్రైవర్. అంతేగాక కళ్యాణి(మీరా జాస్మిన్ )కి అతి మంచి భర్త. అంతా సవ్యంగా నడుస్తుందనుకున్న సమయంలో కళ్యాణికి పెద్ద జబ్బు పేరుతో ట్విస్ట్ పడుతుంది.అందుకోసం పది లక్షలు అవసరమవుతుంది(ఆరోగ్య శ్రీ వంటివి అమలు కావా అని అడగొద్దు). చంద్రానికి ఏమీ చేయలేని స్ధితి. అప్పుడు దేముడు పంపించినట్లుగా అతినకో పదిలక్షలు ఉన్న సూటుకేసు దొరుకుతుంది. అంతేగాక ఆ సూటుకేసు తో పాటు ఓ శవం కూడా లభ్యమవుతుంది.అంతేగాక ఆ సూట్ కేసులో రమ్య(సదా) ఫొటో ఉంటుంది. ఇక ప్రెండ్, లాయిర్ (కృష్ణ భగవాన్) సూచన మేరకు ఆ పది లక్షలు తన అవసరానికి వాడుకుని,ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేయిస్తాడు. అంతేగాక ఆ శవం(సదాది అని బావిస్తున్నారు)తండ్రి బాద చూసి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్లి సెటిల్ అవుతాడు. మరో ప్రక్క భార్య ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇంతలో ఎవరూ ఊహించని విధంగా(పాత్రలు..మనం కాదు) సదా ఊడిపడుతుంది. అంతే ఇంటర్వెల్. ఆ తర్వాత ఏమైంది..సదా తిరిగివచ్చిందంటే..ఆ శవం ఎవరిది..అనే విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

ఈ మధ్య కాలంలో ఇంత భయంకరమైన పాసివ్ క్యారెక్టర్ ఏ హీరోనూ చేసి ఉండడు. హీరోకి ఒకటి తర్వాత మరొకటి వరసగా సమస్యలు వస్తూంటాయి. అయినా అతను స్ధితప్రజ్ఞుడు లా వాటిని భరిస్తూంటాడే కానీ ఎక్కడా ఎదరు తిరిగి ఓ సంఘటన సృష్టించడు. దాంతో కథ టీవీ సీరియల్ కన్నా అధ్వానంగా సాగి..సాగి విసిగిస్తుంది. ఇంటర్వెల్ అయిపోగానే..సదాని నువ్వు చనిపోయావు కదా ఎలా తిరిగి వచ్చావు అని ఆమె తల్లి తండ్రులు కానీ, భాదితుడైన హీరో గానీ అడగరు. అంతా అదేదో పిక్నిక్ కెళ్ళి వచ్చినట్లు గా ఫీలవుతుంటారు. అప్పుడే రివిల్ అయ్యి ఉంటే విలన్ ఎవరో తెలిసి కాస్త టెన్షన్ అన్నా ఎలివేట్ అయ్యేది. అందులోనూ పూర్వం కాలం సినినాల పద్దతిలో విలన్ ...ఎవరో కూర్చీలో వెనక్కి తిరిగి కూర్చున్నట్లు షాట్లు..చివరలో అతను ఎవరో రివిల్ చేయటం. ఇక కామిడీకొస్తే..బ్రహ్మానందం,కొవై సరళ జంట ఇంతగా ఫెయిల్యూర్ అవటం ఎప్పుడూ జరగలేదమో. శ్రీనివాస రెడ్డి స్క్రీన్ ప్లే సరిగా రాసుకుని ఉంటే కథలో లోపాలు బయిటపడి..కాస్త తలనొప్పి తగ్గేది. వీటికి తోడు బలవంతంగా అపూర్వ చేత ఎక్సపోజింగ్ చేయించారు. ఇక అలీ ది మతిమరుపు పాత్ర. ధియోటర్ బయిటకొచ్చినా ఆ పాత్రను మర్చిపోవటం కష్టమే. ఇక సినిమాకు ఏమన్నా ప్లస్ ఉందా అంటే పాటలు అనే చెప్పాలి. సునీల్ కామిడీ ట్రాక్..గతంలో శివనాగేశ్వరావు చిత్రంలో వచ్చిన బాబుమోహన్ కామిడీకి అనుకరణ. మిగతా టెక్నికల్ టీమ్ కూడా డల్ గానే పనిచేసారు.

కొద్దిగా నవ్వించినా సినిమాలు ఆడేస్తున్న ఈ రోజుల్లో ఆ మాత్రం కూడా పాస్ మార్కులు వేయించుకోకపోవటం దురదృష్టమే. మహిళలను ఏడ్పించి సొమ్ము చేసుకోవాలన్నట్లు ఉన్న ఈ సినిమా మగాళ్ళకు కూడా మరో విధంగా ఏడుపు తెప్పిస్తుంది. శ్రీకాంత్ వంద సినిమాలు పూర్తి చేసాడు కాబట్టి ఇప్పటికైనా కాస్త క్వాలిటీ గురించి ఆలోచిస్తే బావుంటుంది. ఏదైమైనా టెక్నికల్ గానూ అంతంతమాత్రంగానే ఉన్న ఈ సినిమాను టీవిల్లో చూడటం బెస్ట్. ఎందుకంటే రిమోట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి. ఆ ధైర్యం లేకపోతే కష్టమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X