twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ: పెళ్లి చేసుకోవాలనిపించేంతగా!

    By Rajababu
    |

    Recommended Video

    Srinivasa Kalyanam Movie Review శ్రీనివాస కల్యాణం సినిమా రివ్యూ

    Rating:
    3.0/5
    Star Cast: నితిన్, రాశీ ఖన్నా, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, జయసుధ
    Director: సతీష్ వెగ్నేశ

    బొమ్మరిల్లు, శతమానం భవతి లాంటి కుటుంబ కథా చిత్రాలను రూపొందించడంలో నిర్మాత దిల్ రాజుది ప్రత్యేకమైన శైలి. అందుకే ఆయన సక్సెస్ గ్రాఫ్ దూసుకెళ్తుంది. సినిమాపై దిల్ రాజుకు ఉండే ప్రేమ, అభిరుచి కారణంగా గతేడాది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. తాజాగా ఆయన బ్యానర్లో వచ్చిన చిత్రం శ్రీనివాస కల్యాణం. సతీష్ వెగేశ్న దర్శకత్వం వహించగా నితిన్, రాశీఖన్నా జంటగా నటించారు. పెళ్లి కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో జయసుధ, ప్రకాశ్ రాజ్, నరేష్, సితార మూలస్తంభాల కనిపించారు. ఆగస్టు 9న రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    శ్రీనివాస కల్యాణం కథ

    శ్రీనివాస కల్యాణం కథ

    సంప్రదాయమైన ఉమ్మడి కుటుంబానికి (జయసుధ, నరేష్, రాజేంద్రప్రసాద్) శ్రీనివాస రాజు (నితిన్) చండీగడ్‌లో ‌ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడే పార్ట్‌టైం జాబ్ చేసే శ్రీదేవి అలియాస్ శ్రీతో ప్రేమలో పడుతాడు. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ మాగ్నెట్ అయిన ఆర్‌కే (ప్రకాశ్ రాజ్) కూతురైన శ్రీ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా కాకుండా ఛండీగడ్‌లో సాధారణ జీవితం గడుపుతుంది. ఈ క్రమంలో రాజు, శ్రీ ప్రేమలో పడుతారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొంటారు. కానీ పెళ్లికి ఒప్పుకునే ముందు రాజుకు ఆర్‌కే ఓ కండిషన్ పెడుతాడు. అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో ఆ కండిషన్ కారణంగా పెళ్లి పీటల మీద నుంచి బయటకు వస్తాడు.

    కల్యాణంలో ట్విస్టులు

    కల్యాణంలో ట్విస్టులు

    శ్రీనివాస రాజు పెళ్లి పీటల మీద నుంచి ఎందుకు లేచి రావాల్సి వచ్చింది. ఎలాంటి సమస్య శ్రీనివాసరాజును వేధించింది? ఆర్‌కే పెట్టిన కండిషన్ ఏమిటి? పెళ్లి పీటల మీద నుంచి లేచి రావడంతో రాజుపై కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏమిటి? తనను కాదని శ్రీని పెళ్లి చేసుకొన్నందుకు మరదలు (నందిత శ్వేత) ఎలాంటి ఆవేదనకు గురైంది? చివరికి శ్రీనివాసరాజు కళ్యాణం ప్రశాంతంగా జరుగడానికి శ్రీ అడిగిన అప్పు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే శ్రీనివాస కల్యాణం సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    రాజు బాల్యంలో జయసుధ ఆధ్వర్యంలో రాజేంద్రప్రసాద్, ఆమని పెళ్లి తంతుతో శ్రీనివాస కల్యాణం సినిమా ఆరంభమవుతుంది. అప్పుడే పెళ్లి అంటే పండుగ అనే భావన, సంప్రదాయలపై రాజుకు గౌరవం పెరుగుతుంది. నేటితరం యువకుడిగా కనిపించే రాజు సంప్రదాయలను పాటించడం చూసి రాశీ ఖన్నాకు ఇష్టం ఏర్పడుతుంది. అలా ప్రేమ ఎపిసోడ్‌ను సాగదీయకుండా నేరుగా పెళ్లి అంశాన్ని ఎత్తుకోవడంతో సినిమా చకచకగా పరుగులు పెడుతుంది. నిశ్చితార్థం నుంచి అనేక కార్యక్రమాలు చాలా ఎమోషనల్‌గా సాగుతూ ఎలాంటి ట్విస్టుల లేకుండా ఫీల్‌గుడ్‌తో తొలిభాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్ ఎనాలిసిస్

    ఇక రెండో భాగంలో పెళ్లంటే పండుగ కాదు.. ఓ ఈవెంట్ అని భావించే ఆర్‌కే ఆలోచన తీరును మార్చే విధానం ప్రేక్షకుడిని సినిమాకు దగ్గరచేస్తుంది. పెళ్లి పనులు, గ్రామాల్లో ప్రజల మధ్య అనుబంధాలు, అప్యాయతలు, సఖ్యత తెరపైన కనిపిస్తాయి. ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ ద్వారా సినిమాను డ్రైవ్ చేయడంతో సన్నివేశానికి, సన్నివేశానికి మధ్య బలం పెరుగుతుంది. క్లైమాక్స్‌లో నితిన్, ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు శ్రీనివాస కల్యాణం చిత్రాన్ని మరోస్థాయికి చేర్చుతుంది. పెళ్లంటే ఓ పండుగ అని ప్రేక్షకుడిని మెప్పిస్తూ సినిమా ముగుస్తుంది.

    డైరెక్టర్ సతీష్ వెగేశ్న ప్రతిభ

    డైరెక్టర్ సతీష్ వెగేశ్న ప్రతిభ

    ప్రతీ ఫ్యామిలీ అడియెన్స్‌కు నచ్చేవిధంగా ఎత్తుకొన్న పాయింట్‌ దర్శకుడు సతీష్ వెగ్నేశ విస్తరించిన తీరు అభినందనీయం. దానికి నేటితరం పోకడలపై సునిశిత విమర్శ చేస్తూనే కుటుంబ విలువలను బలంగా చెప్పడం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు కావని అంతర్లీనంగా కథలో జొప్పించిన తీరు ఆయన మానసిక ఆలోచన విధానానికి అద్దం పట్టింది. ఇది అద్భుతమైన సినిమా అని చెప్పుకోవడాన్ని పక్కన పడితే కలిసి ఉంటే కలదు సుఖం అని సినిమా ద్వారా చెప్పించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అన్ని అంశాలను రంగరించి సతీష్ చేసిన శ్రీనివాస కల్యాణం అన్నివర్గాలను ఆకట్టుకొనేలా ఉంది.

    పరిణతితో కూడిన నటుడిగా నితిన్

    పరిణతితో కూడిన నటుడిగా నితిన్

    శ్రీనివాస రాజుగా నితిన్ మరోసారి పరిణతితో కూడిన నటనను ప్రదర్శించాడు. లవర్ బాయ్‌గా, ఓ ఫ్రెండ్‌గా, కుటుంబ విలువలు తెలిసిన యువకుడిగా, ప్రియురాలి మనసు ఎరిగిన ప్రేమికుడిగా చాలా రకాల షేడ్స్‌ను బాగా మేనేజ్ చేశాడు. ఫ్రెండ్ సూసైడ్ చేసుకొన్న సమయంలో నితిన్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటుంది. ప్రకాశ్ రాజ్‌తో పోటిపడే ప్రతీ సీన్‌లో ప్రేక్షకుల హృదయాలను దోచుకొంటాడు. చివర్లో క్లైమాక్స్‌లో ఓ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోగా కాకుండా అనుభవం ఉన్న నటుడు అతనిలో కనిపించాడు.

    రాశీఖన్నా పెర్ఫార్మెన్స్

    రాశీఖన్నా పెర్ఫార్మెన్స్

    రాశీఖన్నా మరోసారి తన టాలెంట్‌తో మెరిసింది. డైల్సాగ్ తక్కువగా ఉన్నప్పటికి తన ఎమోషన్స్‌, హావభావాలతో ఆకట్టుకొంటుంది. గ్లామర్‌తో ప్రేక్షకులను మైమరిపిస్తుంది. మేకప్‌పై ప్రదానంగా హెయిర్ స్టయిల్‌పై మరికొంత దృష్టి పెట్టాల్సి ఉండాల్సింది. రొమాంటిక్ సన్నివేశాల్లో మంచి ఈజ్ కనిపించింది. పాటలు తక్కువే కాబట్టి డ్యాన్సులకు అంతగా స్కోప్ లేకపోయింది. తొలిప్రేమ తర్వాత మరో మంచి పాత్రలో ప్రతిభను ప్రదర్శించింది.

    నందిత శ్వేత యాక్టింగ్

    నందిత శ్వేత యాక్టింగ్

    ఇక నితిన్‌కు మరదలిగా నటించిన నందిత శ్వేత తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తన పాత్రపై సానుభూతి పెరిగేలా నటించింది. బలమైన, బరువైన పాత్రలో నందిత శ్వేత ఒదిగిపోయారు. సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రతో ప్రేక్షకులకు చేరువయ్యారు.

    ప్రకాశ్ రాజ్, జయసుధ నటన

    ప్రకాశ్ రాజ్, జయసుధ నటన

    శ్రీనివాస కల్యాణం చిత్రానికి ప్రకాశ్ రాజ్, జయసుధ మరోసారి వెన్నుముకగా నిలిచారు. భావోద్వేగమైన నటనతో మళ్లీ తమ పాత్రలతో మెరిశారు. వీరికి తోడు సితార, రాజేంద్ర ప్రసాద్, నరేష్ తమ పాత్రలతో అదనపు బలంగా మారారు. ఎమోషన్ ఉన్న ప్రతీ ఫ్రేమ్‌లో ఈ నలుగురే కనిపిస్తారు. మనకు నిత్యం కనిపించే రొటీన్ పాత్రలే అయినప్పటి భావోద్వేగంతో సినిమాను మరోస్థాయికి చేర్చడంలో వీరి కృషి విశేషమని చెప్పవచ్చు.

     మిక్కి జే మేయర్ మ్యూజిక్

    మిక్కి జే మేయర్ మ్యూజిక్

    మిక్కి జే మేయర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ చాలా డెప్త్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్లకు మరింత బలం చేకూరింది. శ్రీనివాస కల్యాణం థీమ్ సాంగ్ బాగుంది. మూడ్‌ను కంటిన్యూ చేసేలా ఉంది.

     సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ శ్రీనివాస కల్యాణానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్. కోనసీమ అందాలను అద్భుతంగా తెరకెక్కించారు. పెళ్లీ వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో మూడ్‌ను ఎలివేట్ చేయడంలో సఫలమయ్యారు.

    ఎడిటింగ్ విభాగం పనితీరు

    ఎడిటింగ్ విభాగం పనితీరు

    మధు ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. ఒక్క సీన్ కూడా వేస్ట్‌గా లేకుండాను సినిమాను ఓ ఫ్లోలో నడిపించడంలో మధు ఎడిటింగ్ ప్రతిభ తోడ్పాటునందించింది. ఆంజనేయులు ఆర్ట్ విభాగం పనితీరు కూడా చక్కగా ఉంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    దిల్ రాజు నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకటేశ్వర సినీ క్రియేషన్ బ్యానర్ ప్రతిష్ఠకు తగినట్టు ఉన్నాయి. నటీనటుల ఎంపిక వారి నిర్మాణ అభిరుచికి తగినట్టుగా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    శ్రీనివాస కల్యాణం పెళ్లి కాని వారు పెళ్లి చేసుకోవాలనిపించేంతగా.. పెళ్లైన వారు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించేంతగా ఉంటుంది. ప్రతీ ప్రేక్షకుడి మదిలో ఈ చిత్రం ఓ పెళ్లి క్యాసెట్‌లా ఉంటుంది. బీ, సీ, ఓవర్సీస్ ప్రేక్షకుల ఆదరణ బట్టి శ్రీనివాస కల్యాణం సక్సెస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    కథ, కథనాలు
    నితిన్, ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్
    రాజేంద్రప్రసాద్, జయసుధ, నరేష్ నటన
    రాశీ ఖన్నా గ్లామర్
    సినిమాటోగ్రఫీ
    ఎడిటింగ్
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్


    మైనస్ పాయింట్స్
    అమ్మమ్మ పాత్రకు జయసుధ
    ఫస్టాఫ్‌లో లవ్ స్టోరికి స్కోప్ లేకపోవడం

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: నితిన్, రాశీఖన్నా, నందిత శ్వేత, జయసుధ, సితార, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, నరేష్, గిరిబాబు, అన్నపూర్ణ తదితరులు
    దర్శకత్వం: సతీష్ వెగేశ్న
    నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
    సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
    ఎడిటింగ్ మధు
    సంగీతం: మిక్కి జే మేయర్
    రిలీజ్ డేట్: 2018-08-09

    English summary
    Raashi Khanna is an actress in the Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras Cafe and made her debut in Telugu with the successful Oohalu Gusagusalade. She has sparked in Toliprema with her perfomance. And Now Raashi Khanna doing a film with Nitin in Srinivasa Kalyanam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X