»   » సర్వమంగళం స్టోరీరా ..('జయమ్ము నిశ్చయమ్మురా' రివ్యూ )

సర్వమంగళం స్టోరీరా ..('జయమ్ము నిశ్చయమ్మురా' రివ్యూ )

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

కమిడియన్... హీరోగా మారి రూపొందే చిత్రాలకు క్రేజ్ రావాలంటే ఏ రాజమౌళి లాంటి డైరక్టరో పూనుకోవాలా..అంటే అక్కర్లేదు అనిపిస్తుంది. కమిడయన్ శ్రీనివాస రెడ్డి హీరోగా వచ్చిన "జయమ్ము నిశ్చయమ్మురా" కు వచ్చిన క్రేజ్ చూస్తూంటే.

ఆత్మ విశ్వాసానికీ, అంథ విశ్వాసానికీ మ‌ధ్య జ‌రిగే పోరు గా చెప్పబడుతున్న ఈ సినిమాలో హీరో కి జాత‌కాల పిచ్చి. బాగా నెమ్మ‌ద‌స్తుడు. త‌న‌లో ఆత్మ‌విశ్వాసం ఎలా పెరిగింది, జాత‌కాల పిచ్చి ఎలా పోయింద‌న్న పాయింట్ ని అంత‌ర్లీనంగా చెప్పే ప్ర‌య‌త్నం చేసారు.


చిరంజీవి-పవన్ కళ్యాణ్ దత్తన్న కూతురు పెళ్లి వేడుకలో (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)


అసలు ఈ చిత్రం కథేంటి..అతని అంధ విశ్వాసాలు ..అతని ఆత్మ విశ్వానికి ఎలా అడ్డు పడ్డాలో పరిశీలిద్దాం. కేవలం ట్రైలర్, సాంగ్ తో ఈ మధ్యకాలంలో ఏ చిన్న సినిమాకూ రానంత క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం సినీ లవర్స్ అంచనాలను అందుకుందా , వారు ఊహించినట్లు సున్నితమైన భావోద్వేగాలతో సాగే ఫన్నీ చిత్రంగా రూపొందిందా..చూద్దాం.


అప్పుడు జరిగిన కథ

అప్పుడు జరిగిన కథ

ఈ సినిమా కథ 2013లో ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు జరిగింది. తెలంగాణ ప్రాంతం కరీంనగర్‌జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సర్వమంగళం అలియాస్ సర్వేశ్ కుమార్ ( శ్రీనివాస్‌రెడ్డి) చుట్టూ తిరుగుతుంది.


నిరుద్యోగిగా తిరుగుతూ..

నిరుద్యోగిగా తిరుగుతూ..

సర్వమంగళం...గత పదేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తూ ఎలాంటి ఫలితం రాకపోవడంతో నిరుద్యోగిగా తిరుగుతుంటాడు. అతను తెలివైన కుర్రాడే.... కానీ.. అతనిలో ఆత్మన్యూనతా భావం ఎక్కువ. అందుకే తనలోని శక్తి సామర్థ్యాల్ని వదిలేసి.. అమాయకంగా అంధ విశ్వాసాల్ని నమ్ముతుంటాడు.


రాత్రంతా అక్కడే పడుకుంటే..

రాత్రంతా అక్కడే పడుకుంటే..

సర్వమంగళం... ప్రతి విషయానికీ బాబా పిత (జీవా) చెప్పే జోస్యానికి విలువనిస్తూ ఆయన మీద ఆధారపడుతుంటాడు. ఆయనేం చెబితే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంటాడు .ఆ బలహీనతను ఆసరాగా చేసుకున్న ఓ స్వామీజీ (జీవా) పేరు మార్చుకుని, ఒక రాత్రి స్మశానంలో పడుకుంటే ఉద్యోగం వస్తుందని సర్వమంగళానికి త్వరలో ఉద్యోగం వస్తుందని చెబుతాడు.


ఆంధ్రలో ఉద్యోగం

ఆంధ్రలో ఉద్యోగం

పిత చెప్పిన జాతకం ప్రకారమే తన పేరును సర్వమంగళంగా మార్చుకొంటాడు. అలాగే స్మశానంలో ఓ రాత్రంతా పడుకుంటాడు. అలా స్వామీజీ చెప్పిన ప్రకారమే చేసిన సర్వమంగళానికి...ఆంధ్ర ప్రాంతంలోని కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో గుమస్తాగా పోస్టింగ్ వస్తుంది.


తర్వాత కూడా జాతకాలపైనే

తర్వాత కూడా జాతకాలపైనే

ప్రభుత్వ ఉద్యోగమే కలగా భావించే సర్వ మంగళానికి స్వామీజీ చెప్పినట్లే .. కాకినాడ మున్సిపాలిటీలో ఉద్యోగం రావటంతో... ఆ తర్వాత కూడా పిత చెప్పే జాతకాలపైనే ఆధారపడుతుంటాడు. అయితే అంత దూరం రావడానికి తల్లి ఇష్టపడకపోవడంతో చేసేదిలేక ఒంటరిగా కాకినాడకు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాడు సర్వేశ్.


ఇక్కడ చూసిన అమ్మాయే..అక్కడ కూడా

ఇక్కడ చూసిన అమ్మాయే..అక్కడ కూడా

అమ్మ కోసం బదిలీపై సొంతూరు కరీంనగర్‌ వెళ్లాలన్నది అతని కోరిక. దాంతో ఉద్యోగంలో చేరిన రోజునుండే ఎలాగైనా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని తన తల్లి దగ్గరికి కరీంనగర్‌కు వెళ్ళిపోవాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. అదే సమయంలో ఉద్యోగం వచ్చే ముందు కరీంనగర్‌లో చూసిన అమ్మాయి రాణి (పూర్ణ) ని మళ్ళీ కాకినాడలో చూస్తాడు. అదీ తన ఆఫీసు పక్కనే ఉన్న మీ సేవాలో పనిచేయడం చూసి తనతో ప్రేమలో పడిపోతాడు.


ప్రేమ విషయంలోనూ..

ప్రేమ విషయంలోనూ..

ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎదురుపడిన రాణి (పూర్ణ) జీవితంలోకి వస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని పిత చెబుతాడు. దాంతో రాణిని ప్రేమించడం మొదలుపెడతాడు సర్వమంగళం.


ఆమె వివరాలన్నీ..

ఆమె వివరాలన్నీ..

తనకు అద‌ష్టంగా కలిసొచ్చిన ఆ అమ్మాయి పేరు రాణి అని తెలుసుకున్న సర్వేశ్‌ అక్కడే బ్రోకర్‌లా పనిచేసే తత్కాల్ ( ప్రవీణ్) సహాయంతో ఆ అమ్మాయి వివరాలన్నీ కనుక్కుని ప్రొసీడ్ అవుతూంటాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని తన బాస్ ద్వారా త్వరగా ట్రాన్ఫర్ చేయించుకుని సొంత ఊరికి వెళ్లిపోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ పని మీదే ఉంటాడు. ఈ క్ర‌మంలోనే రాణి న‌ర్స‌రీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఫైల్ మ‌నోడి వ‌ద్ద‌కే వ‌స్తుంది. అప్ప‌టి నుంచి ఆమెకు ద‌గ్గ‌ర‌య్యేందుకు ర‌క‌ర‌కాల ప్లాన్లు వేస్తుంటాడు.


అడపా అప్పారావు తో ..

అడపా అప్పారావు తో ..

అక్క‌డ స‌ర్వ‌మంగ‌ళం పై అధికారి జే.సి(రవివర్మ) స్త్రీ లోలుడు. అందుకోసం అతను సర్వమంగళం ఉంటోన్న ఇంటినే వాడుతుంటాడు. అలాగే సూపరిండెంట్ అడపా అప్పారావు ( క‌ృష్ణ భగవాన్) కూడా తన అవసరాల కోసం వాడుకుంటూంటారు. అది చూసి ఏం చేయలేకపోతాడు. కానీ తల్లి కోసం తప్పదు భరిస్తాడు.


లవ్ మ్యాటర్ లో మలుపు

లవ్ మ్యాటర్ లో మలుపు

ఇదిలా ఉంటే...ఓ రోజు రాణి తనపై ఆఫీసర్ జేసితో కలిసి తన రూమ్ కు వస్తుంది. జేసీతో రాణిని చూసిన సర్వమంగళం ఏం చేశాడు ? రాణి నిజంగానే తప్పు చేసిందా.. ? అతను మంచివాడు కాదనే విషయం సర్వమంగళంకి తెలుసు. మరి అతని వలలో రాణి పడకుండా ఏం చేశాడు? ఇంతకీ రాణిని ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు? అనేది చూసి తెలుసుకోవాలి.


ఆత్మ విశ్వాసం ఎలా కలిగింది

ఆత్మ విశ్వాసం ఎలా కలిగింది

సర్వమంగళం జాతకాల పిచ్చిని వదిలి పెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? ఆత్మవిశ్వాసంతో అడుగులేశాక అతని చుట్టూ వాతావారణం ఎలా మారింది? కరీంనగర్‌కి ఎలా బదిలీ అయ్యాడు? లాంటి విషయాల్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


రియలిస్టిక్ టచ్

రియలిస్టిక్ టచ్

జయమ్ము నిశ్చయమ్మురా చిత్రానికి ప్రారంభం చూడగానే ఇంప్రెస్ అయిపోతాం. ఎందుకంటే చాలా రియలిస్టిక్ ఎప్రోచ్ తో రూరల్ యాంబియన్స్ లో సీన్స్ వస్తూండటం ముచ్చటేస్తుంది. వర్మ శిష్యుడు కదా భలే చేసాడు అని పిస్తుంది.


సినిమాటెక్ గా ,రొటీన్ గా

సినిమాటెక్ గా ,రొటీన్ గా

ఫస్టాఫ్ అలా సరదా సీన్స్ తో ఇంట్రస్టింగ్ అలా నడిచిపోయినా, సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమా టెక్ డ్రామా ఎక్కువైంది. దర్శకుడు సేఫ్ గేమ్ ఆడటం మొదలెట్టాలనుకున్నారేమో , రొటీన్ సీన్స్ తో జరుగుతుంది. ఫస్టాఫ్ లో మొదలెట్టిన రియలిస్టిక్ టచ్ ముగిసిపోతుంది.


సినిమా పూర్తయ్యాక చూస్తే..

సినిమా పూర్తయ్యాక చూస్తే..

దానికి తోడు ...సినిమాకు ఎడిటింగ్ చాలా పూర్ గా ఉండి..చాలా స్లోగా నడక మొదలవుతుంది. దాంతో సెకండాఫ్ చూసి, సినిమా పూర్తయ్యాక ఏదో పాత సినిమా మళ్లీ చూసినట్లు ఉంటుంది కానీ..ప్రత్యేకమైన ఫీల్ మిగలలేదు.


సబ్ ప్లాట్స్ బాగున్నాయి

సబ్ ప్లాట్స్ బాగున్నాయి

ఫస్టాఫ్ కథంతా హీరో అమాయకత్వం.. అతడి జాతకాల పిచ్చి.. సహోద్యోగుల తీరుతో పండే ఎంటర్టైన్మెంట్ తోనే సాగుతుంది. కథ కాకినాడకి షిఫ్ట్‌ అయ్యే వరకు సినిమా వేగం పుంజుకున్నట్టు అనిపించదు. అక్కడ జేసీ చడ్డా (రవివర్మ).. తత్కాల్‌ (ప్రవీణ్‌).. అడపా ప్రసాద్‌ (కృష్ణ భగవాన్‌).. పంతులు (పోసాని కృష్ణమురళి).. కాంత్‌ (శ్రీవిష్ణు) పాత్రలు ఒకొక్కటిగా ఎంట్రీ ఇచ్చాక కథ మరింతగా రక్తి కడుతుంది. వారందరూ ఒక్కో సబ్ ప్లాట్ తో తెరపైకొస్తారు. వాటినన్నటినీ కధకు బాగా కలిపారు.


అప్పుడు కామెడీ వస్తుంది

అప్పుడు కామెడీ వస్తుంది

హీరో పాత్ర ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో అడుగులేయడం మొదలుపెడుతుందో అప్పట్నుంచి తెరపై నవ్వులే పండాయి. తొలి సగంలో తన అమాయకత్వంతో ఆడుకొన్నవాళ్లపై హీరో రివేంజ్ తీర్చుకొనే సీన్స్ అన్నీ నవ్విస్తాయి. ఇది కామెడీ హీరో సినిమా అనే విషయం అప్పుడు గుర్తుకొస్తుంది.


కమిడయన్ గా చూడలేదు

కమిడయన్ గా చూడలేదు

హీరోగా ఓ కమిడియన్ ని ఎంచుకొని కూడా కథని.. పాత్రల్ని తీర్చిదిద్దిన దర్శకుడి తీరుని మెచ్చుకోకుండా ఉండలేం. హీరో పాత్ర గెటప్ లోనూ.. డైలాగుల్లోనూ ఎక్కడా కూడా శ్రీనివాసరెడ్డి మార్క్ వెటకారం కనిపించనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే శ్రీనివాసరెడ్డి కామెడీ స్టైల్‌ కానీ బయటికి రాకపోవడం సినిమాకు లాభమే అయ్యిందనే చెప్పాలి.


లెంగ్త్ చూసుకోవాల్సింది

లెంగ్త్ చూసుకోవాల్సింది

సినిమాలో ప్రతీపాత్రకు సంబంధించి డీటైల్డ్‌గా క్యారెక్టరైజేషన్ రాసుకున్నాడు డైరక్టర్ అని అర్దమవుతుంది. అయితే ఈ క్రమంలో లెంగ్త్ గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. కాబట్టే సినిమాలో కంటెంట్ బాగున్నప్పటికీ సినిమా లెంగ్త్ మాత్రం బాగా పెరిగిపోయినట్లు అనిపిస్తుంది. అంతేగాక స్క్రీన్ ‌ప్లే పైన మరింత ద‌ృష్టిపెడితే సినిమా రేంజ్ మారిపోయేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఫస్టాఫ్‌లో చాలా సీన్స్ అనవసరం అనిపిస్తాయి.


సంగీతం కలిసి..

సంగీతం కలిసి..

ఈ సినిమాకు పెద్ద హైలెట్‌గా నిలిచేది సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. పల్లె వాతావరణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఎంతో బాగా చూపించి మెప్పించాడు. అంతేగాక స్క్రీన్‌పై వస్తున్న అందమైన విజువల్స్‌కు తోడుగా సంగీతం కలసి ప్రేక్షకులను కట్టిపడేసింది.


విసిగించాయి

విసిగించాయి

సినిమా బాగానే మొదలుపెట్టినా మొదటి 20 నిముషాల తరువాత కథ చాలా స్లో అవటం మొదలెట్టింది. డైరక్టర్ .. చాలా సేపటి వరకూ అసలు కథలోకి వెళ్లకుండా పాత్రలను పరిచయం చేయడంలోనే ఎక్కువకాలం గడిపేసాడు. అలాగే సినిమాలో హీరో పాత్ర చుట్టూ కొన్ని అనవసరమైన సన్నివేశాలు నడిచి కాస్త విసిగించాయి.


రాజేంద్రప్రసాద్ గుర్తువచ్చాడు

రాజేంద్రప్రసాద్ గుర్తువచ్చాడు

సినిమాల్లో కొన్ని సీన్స్ చూస్తూంటే అప్పట్లో రాజేంద్రప్రసాద్ హీరోగా సినిమాలు చేసే రోజులు గుర్తుకు వచ్చాయి. హీరో అమాయికత్వం, జాతకాల పిచ్చి, ఆత్మవిశ్వాస లోపం, హీరోయిన్ వెనక బడటం వంటివి గతంలోకి మనల్ని తీసుకెళ్తాయి.


ఇదే ఈ చిత్రం టీమ్

ఇదే ఈ చిత్రం టీమ్

బ్యానర్: శివరాజ్‌ ఫిలిమ్స్‌
నటీనటులు: శ్రీనివాసరెడ్డి, పూర్ణ, శ్రీవిష్ణు, కృష్ణుడు, రవివర్మ, కృష్ణ భగవాన్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, జీవా, కృష్ణంరాజు, జోగినాయుడు, డబ్బింగ్ జానకి, మీనా,నారాయణ రావు, సూర్య, గుండు సుదర్శన్, ప్రభాస్ శ్రీను, రోలర్ రఘు, ఫిష్ వెంకట్ ,జబర్దస్త్ సన్నీ, సముద్రం వెంకటేష్, రాహుల్ రామకృష్ణ, సిరి, మాధవి, సరితాశర్మ, జ్యోతి తదితరులు
మ్యూజిక్: రవిచంద్ర,
కెమెరా: నాగేష్ బన్నెల్,
ఎడిటింగ్: వెంకట్,
ఎగ్సిక్యుటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్,
లైన్ ప్రొడ్యూసర్: జగన్నాధన్ మణి,
నిర్మాతలు: శివరాజ్ కనుమూరి-సతీష్ కనుమూరి,
రచన-దర్శకత్వం: శివ రాజ్ కనుమూరి!
విడుదల తేదీ: 25-11-2016ఫైనల్ గా అప్పటి రోజుల నాటి సినిమాలు రావటంలేదని కంప్లైంట్ చేసేవారు అర్జెంట్ గా వెళ్లి చూడాల్సిన సినమా. అలాగని కమిడియన్ శ్రీనివాస రెడ్డి హీరో కదా ..అని అతని స్టైల్ లో సాగే వెటకారాలు అవీ ఆశిస్తే మాత్రం ఈ సినిమా నిరాశపరుస్తుంది.

English summary
Comedian Srinivas Reddy come up as a hero in the comedy and horror entertainer Geethanjali movie which scored good hit for him. And now he has come up with a different script. Here is the complete review and rating of Jayammu Nischayammu Raa movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu