Sriranga Neethulu Review పెళ్లికి ముందే గర్బవతి అయితే.. శ్రీరంగ నీతులు సినిమా సమీక్ష!

Rating:
2.5/5

నటీనటులు: సుహాస్, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం, శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్, సంజయ్ స్వరూప్, తణికెళ్ల భరణి, గీతా భాస్కర్, సీవీఎల్ నరసింహరావు, జీవన్ రెడ్డి తదితరులు
రచన, దర్శకత్వం: ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్
నిర్మాత: వెంకటేశ్వర్ రావు బల్మూరి
మ్యూజిక్: అజయ్ అరసద, హర్షవర్దన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫి: టిజో టామీ
ఎడిటర్: శంశాక్ వుప్పుటూరి
బ్యానర్: రాధవి ఎంటర్‌టైనర్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2024-04-11

వరుణ్ (విరాజ్ అశ్విన్), ఐశ్వర్య (రుహానీ శర్మ) ఇద్దరు లవర్స్. ఇంట్లో వారికి తెలియకుండా శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో ఐశ్వర్య ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఆమె గర్బవతి అవుతుంది. ఇక మురికివాడలో జీవించే శివ (సుహాస్) లోకల్ లీడర్‌గా కావాలని కలలు కంటుంటాడు. బడా రాజకీయ నేతలతో దిగి ఫ్లెక్సీలు కట్టించుకోవడమే తన అస్థిత్వంగా భావిస్తుంటాడు. ఇక డ్రగ్స్‌ వ్యసనానికి బానిసైన కార్తీక్ (కార్తీక్ రత్నం) కోసం పోలీసులు వెంటాడుతుంటారు.

Sriranga Neethulu Movie Review in Telugu  Suhas  Viraj Ashwin  Ruhani Sharma shines in Anthology

గర్బవతి అయిన ఐశ్వర్య పరిస్థితి ఏమిటి? వరుణ్‌ సహకారంతో ఆమె అబార్షన్ చేయించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించాయా? ఇంట్లో తన పరిస్థితి, ప్రేమ గురించి తండ్రి (సంజయ్ స్వరూప) కి చెప్పిందా? ఫ్లెక్సీల విషయంలో కాలనీలో ఇతర యువకులతో శివకు ఎలాంటి గొడవలు జరిగాయి? డ్రగ్స్ కేసులో పోలీసులు వెంటాడుతున్న కార్తీక్ పరిస్థితి ఏమిటి? ఈ ముగ్గురికి తాము చేసిన తప్పుల విషయంలో ఎలా జానోదయం అయింది అనే ప్రశ్నలకు సమాధానమే శ్రీరంగనీతులు సినిమా కథ.

శ్రీరంగనీతులు సినిమా విషయానికి వస్తే.. తప్పుదారి ఎంచుకొన్న ఓ ప్రేమజంట.. ఇద్దరు యువకుల జీవితాలను ఎమోషనల్‌గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. దర్శకుడు ప్రవీణ్ కుమార్ రాసుకొన్న పాయింట్.. కథగా విస్తరించిన తీరు బాగుంది. కానీ ఫస్టాఫ్ వరకు సినిమాకు పట్టాలు తప్పకుండా సరైనా ట్రాక్‌లోనే నడిపించాడు. అదే విధంగా సెకండాఫ్‌ను ఇంకా కాస్త బెటర్‌టగా తెరకెక్కించినట్టయితే మంచి అంథాలజీ అయ్యే అవకాశం ఉండేది.

శ్రీరంగనీతులు సినిమాలో గర్బవతి అయ్యాననే అనుమానంతో వేదనకు గురయ్యే యువతి పాత్రలో రుహానీ శర్మ చక్కగా నటించారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో మెచ్యురిటీతో కూడిన విరాజ్, ఆమె తమ ఫెర్పార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఇక సుహాస్ తనదైన బాడీ లాంగ్వేజ్‌తో మరోసారి మంచి నటనను ప్రదర్శించాడు. ఇక డ్రగ్స్‌కు బానిసైన యువకుడిగా కార్తీక్ రత్నం. అతడిని కాపాడుకొనేందుకు ప్రయత్నించిన తండ్రి పాత్రలో దేవీ ప్రసాద్ ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు సన్నివేశాలను పండించేందుకు ప్రయత్నించారు.

Sriranga Neethulu Movie Review in Telugu  Suhas  Viraj Ashwin  Ruhani Sharma shines in Anthology

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. టిజో టామీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. కలర్ ప్యాటర్ బాగుంది. డిఫరెంట్ కలర్ టచ్‌తో సీన్లను చిత్రీకరించిన తీరు సన్నివేశాలను మరింత రిచ్‌గా చూపించారు. ఈ సినిమాకు పాటలు, బీజీఎం అదనపు ఆకర్షణగా మారాయి. సెకండాఫ్‌లో ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. వెంకటేశ్వర్ రావు బల్మూరి అనుసరించిన నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

అంథాలజీగా రూపొందే సినిమాల్లో సన్నివేశాలు, కథనం బాగుంటే.. ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో కూడా ఫస్టాఫ్ గ్రిప్పింగ్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో క్యారెక్టర్లు రియలైజ్ అయ్యే పాయింట్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. యూత్‌ఫుల్, న్యూఏజ్ లవ్ స్టోరీలు, రస్టిక్ డ్రామా ఆధారంగా రూపొందే సినిమాలను ఆదరించే వారికి శ్రీరంగనీతులు నచ్చే అవకాశం ఉంది. యువ దర్శకుడు చేసిన ప్రయత్నం మిమ్మల్ని మెప్పిస్తుందనడానికి చాలా అంశాలే ఉన్నాయి. కాబట్టి థియేటర్‌లో చూసి కొత్త అనుభూతిని పొందండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X