SS Rajamouli Review: Kalki 2898 AD మూవీపై రాజమౌళి రివ్యూ.. ప్రభాస్, నాగ్ అశ్విన్ గురించి ఏం చెప్పారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సౌత్ ఇండియన్ లెజెండ్ కమల్ హసన్, స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆర్జీవి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్లు ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా గురించి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన రివ్యూలో ఏం చెప్పారంటే?

ప్రభాస్ ఫ్యాన్స్‌కు దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీలో రకరకాల సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. ఈ చిత్రంలో రాజమౌళి ఓ సీన్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను కేక పెట్టించారు. ఈ చిత్రంలో జక్కన కనిపించడంతో థియేటర్ అంతా గోలగోలగా మారింది. ఇలాంటి ప్రత్యేకతలు సినిమాలో చాలానే ఉన్నాయి.

SS Rajamouli Review On Kalki 2898 AD Cinema  Prabhas Killed with Ease and Timing

తాను నటించిన కల్కి సినిమా గురించి రాజమౌళి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. కల్కి 2898 ఏడీ సినిమా కోసం నిర్మించిన ప్రపంచం బాగుంది. అద్బుతమైన సెట్టింగులతో నన్ను కొత్త లోకంలోకి , సరికొత్త అనుభూతిని పొందాను అంటూ నాగ్ అశ్విన్ టేకింగ్ గురించి రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ప్రభాస్ గురించి జక్కన్న మాట్లాడుతూ.. డార్లింగ్ తన ఫెర్ఫార్మెన్స్, ఈజ్, టైమింగ్‌తో చంపేశాడు. ఆయన పాత్ర చుట్టు ఉన్న అమితాబ్ జీ, కమల్ సార్, దీపిక గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు అంటూ తన రివ్యూలో పేర్కొన్నారు. ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించడంతో నెటిజన్లు జక్కన్నకు థ్యాంక్స్ చెబుతున్నారు.

SS Rajamouli Review On Kalki 2898 AD Cinema  Prabhas Killed with Ease and Timing

ఇక కల్కి 2898 ఏడీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో చివరి 30 నిమిషాలు కథ నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇలాంటి అనుభూతిని పంచిన నాగీ, వైజయంతీ టీమ్‌కు ధన్యవాదాలు. వాళ్లు ఊహకు అందని విధంగా సినిమాను తెరకెక్కించారు అని ప్రశంసల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X