RRR movie review.. రాజమౌళి టేకింగ్ మైండ్ బ్లోయింగ్.. రాంచరణ్, ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్

Rating:
3.5/5

Recommended Video

RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగేళ్లుగా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేట్రికల్ రిలీజ్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ పడిన కష్టానికి ప్రతిఫలాన్ని కోరుతూ ప్రేక్షకుల తీర్పు కోసం ఈ సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టారు. ప్రతీ భారతీయ సీనీ ప్రేక్షకుడు పెంచుకొన్న అంచనాలను ఈ సినిమా చేరిందా? ఈ చిత్రంలో ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని అంశాలు, ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయనే విషయంలోకి వెళితే..

RRR కథ ఏమిటంటే?

RRR కథ ఏమిటంటే?

భారత్‌లో బ్రిటీష్ పాలన కొనసాగుతున్న కాలంలో రామరాజు (రాంచరణ్) తెల్లదొరల ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. స్వాతంత్ర్యం కోసం, ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనేందుకు బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న భీమ్ ఓ కారణంగా (ఎన్టీఆర్) ఢిల్లీలోని బ్రిటన్ సర్కార్‌పై విధ్వంసం సృష్టిస్తాడు. బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగిన భీమ్‌ను పట్టుకొనేందుకు రామరాజును ప్రత్యేక అధికారిగా నియమిస్తారు.

RRRలో ట్విస్టులు

RRRలో ట్విస్టులు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భీమ్‌ను రామరాజు పట్టుకొన్నాడా? ఢిల్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భీమ్ పోరాటం చేయడానికి కారణం ఏమిటి?
ప్రభుత్వానికి శత్రువైన భీమ్‌తో రామరాజు ఎందుకు స్నేహం చేశాడు? భీమ్‌కు రామరాజు ఎలాంటి సాయం చేశాడు? భీమ్‌కు సహాయం చేసిన రామరాజు ఎలాంటి శిక్షను ఎదుర్కొన్నాడు. భీమ్, రామరాజు మధ్య స్నేహం పెరగడానికి సీత (ఆలియాభట్) ఎలాంటి పాత్రను పోషించింది. ఈ కథలో అజయ్ దేవగన్, శ్రీయ పాత్రలు ఏమిటి? రామ్, భీమ్ ఇద్దరు కలిసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించారు అనే ప్రశ్నలకు సమాధానమే RRR మూవీ కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

గిరిజన బాలికను బ్రిటీష్ సేనలు ఎత్తుకెళ్లే ఓ ఎమోషనల్ సీన్‌తో కథ మొదలవుతుంది. బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారి రాంచరణ్ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్‌తో కథ మరింత ఎమోషనల్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ అడవుల్లో ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్‌తో కథ మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది. నాటు నాటు పాట, ఇద్దరు హీరోల ఎంట్రీ, అలాగే రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్‌తో తొలిభాగం ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఫస్టాఫ్ నిడివి ఎక్కువ కావడం, కొంత స్లోగా కథ సాగడం మైనస్‌గా అనిపిస్తుంది. కానీ రాజమౌళి ట్రీట్‌మెంట్ ఆ రెండు లోపాలను కప్పిపుచ్చేలా ఉంటాయి.

సెకండాఫ్‌ మరింత ఎమోషనల్‌గా

సెకండాఫ్‌ మరింత ఎమోషనల్‌గా

సెకండాఫ్‌లో అజయ్ దేవగన్, శ్రీయ ఎంట్రీలతో కథ మరో లెవెల్‌కు వెళ్లినట్టు అనిపిస్తుంది. ఎమోషన్స్ లేకుండా ఫ్లాష్ బ్యాక్‌లో రొటీన్‌గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ తర్వాత సీత (ఆలియాభట్) పాత్ర కీలకంగా మారడంతో కథ మరింత భావోద్వేగంగా మారుతుందనుకొనే వారికి నిరాశే మిగులుతుంది. బ్రిటీషర్ల కస్టడీలో జైలు నుంచి పారిపోయిన భీమ్ కోసం వెతుకులాట మొదలవుతుంది. సీత చెప్పిన ఓ వాస్తవం ఆధారంగా కథ కొత్త మలుపు తిరగడంతో ప్రేక్షకుల్లో జోష్ పెరుగుతుంది. రామ్, భీమ్ ఇద్దరు ఏకం అయిన తర్వాత అదే రొటీన్ వ్యవహారం కొనసాగుతుంది. రెండో భాగంలో 30 నిమిషాలు చాలా స్లోగా సాగడం ఇబ్బంది అనిపిస్తుంది.

దర్శకుడు రాజమౌళి గురంచి

దర్శకుడు రాజమౌళి గురంచి

దర్శకుడు రాజమౌళి ఒక చిన్న పాయింట్‌‌ను ఎంచుకొని దానిని కథ వస్తువుగా చిత్రీకరించిన తీరు తెర మీద అద్బుతంగా ఉంటుంది. కథను చెప్పిన విధానం, కథలో భావోద్వేగాలను రాజమౌళి జొప్పించిన విధానం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఎలివేషన్ షాట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన విధానం రాజమౌళి ప్రతిభకు మరోసారి అద్దం పట్టిందని చెప్పవచ్చు. జక్కన్న విజన్, పట్టుదల, అంకితభావం ప్రతీ ప్రేమ్‌లోను కనిపిస్తుంది. కథా ప్రయాణంలో ఫస్టాఫ్‌, సెకండాఫ్‌లో కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించిన విధానం చూస్తే.. ఆ ఊహా శక్తికి అబ్బురపడటం ఖాయం. కానీ కథలో బలమైన పాయింట్ లేకుండా ఉండటం నిరాశ కలిగించే అంశం. లోపాలు ఎన్ని ఉన్నా రాజమౌళి టేకింగ్‌ను అభినందించకుండా ఉండలేం.

ఎన్టీఆర్,  రాంచరణ్ గురించి

ఎన్టీఆర్, రాంచరణ్ గురించి

RRR మూవీలో రాంచరణ్, ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో రాంచరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. వారిద్దరి నటన హై ఓల్టేజ్ పవర్ హౌజ్‌గా కనిపిస్తుంది. రాంచరణ్, భీమ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇద్దరి కెరీర్‌లోను ఈ సినిమా ది బెస్ట్ అని చెప్పవచ్చు. నాటు నాటు పాటలో వారిద్దరూ పోటాపోటీగా డ్యాన్స్ చేసిన విధానం ప్రేక్షకులకు పండగే చెప్పవచ్చు. వాస్తవం చెప్పుకోవాలంటే.. ఎన్టీఆర్ పాత్ర కంటే రాంచరణ్ రోల్‌కే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

ఆలియాభట్, ఇతర  పాత్రలు

ఆలియాభట్, ఇతర పాత్రలు

సీతగా అలియాభట్ పాత్ర నిడివి చిన్నదైనా సినిమాకు కీలకమైనదే. అజయ్ దేవగణ్, శ్రీయ పాత్రలు గెస్ట్‌గా కనిపించినా సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. అయితే ఆలియాభట్ పాత్ర తీరు అందర్నీ అసంతృప్తికి గురిచేయడం ఖాయం. ఆలియాభట్ పాత్ర తేలిపోయినట్టు అనిపిస్తుంది. మేకప్ సరిగా లేకపోవడంతో జూనియర్ ఆర్టిస్టుగా కనిపిస్తుంది. సముద్రఖని, ఒలివియా మోరిస్ పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి.

సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనీతీరు విషయానికి వస్తే.. కీరవాణి అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పలు సన్నివేశాలను తన బీజీఎంతో కీరవాణి మరో లెవెల్‌కు తీసుకెళ్తాడు. దోసి సాంగ్, రామమ్ రాఘవ పాటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. నాటు, నాటు పాట ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. దోస్తి సాంగ్ ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకొంటుంది. కొమురం భీముడే పాట విషయానికి వస్తే.. అవసరం ఉందా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎండ్ టైటిల్ సాంగ్ ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి ప్రాణంగా మారింది. ప్రతీ సన్నివేశాన్ని అద్బుతంగా తెరకెక్కించడమే కాకుండా విజువల్ ఫీస్ట్‌గా మార్చాడు. వీఎఫ్ఎక్స్, ఆర్ట్, ఫైట్స్ విభాగాలు అద్భుతంగా తెరపైన రాణించాయి. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో సినిమాను రూపొందడంలో డీవీవీ దానయ్య రాజీలేని తనం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంగా సాగే అత్యంత భావోద్వేగమైన చిత్రం RRR. ఎన్టీఆర్, రాంచరణ్ నటన, ఆలియా భట్ పెర్ఫార్మెన్స్, ఇతర నటీనటుల యాక్టింగ్ సినిమాకు ప్లస్. రాజమౌళి విజన్, టేకింగ్ సినిమాను ఉన్నతస్థానంలో నిలబెట్టాయని చెప్పవచ్చు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్.. ఇక ఆలస్యం, ఇతర కారణాలు వెతుక్కోకుండా కొత్త అనుభూతి కోసం సినిమాను చూడాల్సిందే. బాక్సాఫీస్ రికార్డులు ఈ సినిమా విజయం, రేంజ్‌ను కొద్ది రోజుల్లో చెబుతాయి. ఫ్యాన్స్ పండుగలాంటి చిత్రం... ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రంగా చెప్పుకోవచ్చు.

నటీనటులు: సాంకేతిక నిపుణులు

నటీనటులు: సాంకేతిక నిపుణులు

నటీనటులు: ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రీయ సరన్, ఓలియా మోరిస్, అలిసన్ డూడీ,, రే స్టీవెన్‌సన్ తదితరులు
దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
నిర్మాత: డీవీవీ దానయ్య
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
సినిమాటోగ్రఫి: కేకే సెంథిల్ కుమార్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: ఎంఎం కీరవాణి
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
డిస్ట్రిబ్యూషన్: లైకా ప్రొడక్షన్స్ (తమిళం), పెన్ స్టూడియోస్ (నార్త్)
రిలీజ్ డేట్: 2021-10-13

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X