Stalin Re Release Review: స్టాలిన్ మూవీ రీ రిలీజ్ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: చిరంజీవి, త్రిషా, ప్రకాశ్ రాజ్, శారద, కుష్బూ సుందర్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, రవళి, సునీల్, హేమ, బ్రహ్మాజీ, సుమన్ తదితరులు
దర్శకత్వం: ఏఆర్ మురగదాస్
నిర్మాత: నాగబాబు
సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
ఎడిటింగ్: ఆంథోని
మ్యూజిక్: మణిశర్మ
బ్యానర్: అంజనా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2006-09-20
రి రీలీజ్ డేట్: 2025-08-22

స్టాలిన్ (చిరంజీవి) భారత సైన్యంలో మేజర్. క్రమశిక్షణ చర్య కింద ఆయనను యుద్ధ భూమిలో పోరాడే విధుల నుంచి ఆఫీస్ పనుల కోసం లెఫ్టినెంట్ కల్నల్ ఇక్బాల్ కక్కర్ (ముఖేష్ రుష) ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. దాంతో ఆర్మీ ఉద్యోగం వదిలేసి తన సొంత పట్టణానికి వస్తాడు. స్టాలిన్‌కు చెల్లెలు ఝాన్సీ (కుష్భూ), తల్లి (శారద) ఉంటారు. అయితే ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఓ అమ్మాయి ఆత్మహత్య సంఘటన కదిలించి వేస్తుంది. దాంతో ప్రతీ ఒక్కరు ముగ్గురికి సాయం చేయాలనే చైన్ స్కీమ్‌కు అంకురార్పణ చేస్తాడు స్టాలిన్. అయితే స్కీమ్‌తో హోంమంత్రి ముద్దు కృష్ణయ్య (ప్రకాశ్ రాజ్)తో స్టాలిన్‌కు వైరం ఏర్పడుతుంది.

దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడే స్టాలిన్‌పై ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకొన్నారు? మేజర్ స్థాయి నుంచి ఆఫీస్ పనులకు వాడుకోవాలని అధికారి ఎందుకు నిర్ణయం తీసుకొన్నారు? ఆర్మీ ఉద్యోగాన్ని ఏ పరిస్థితుల్లో స్టాలిన్ వదిలేసుకొన్నాడు? చిన్నారి అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నది? బాలిక ఆత్మహత్య స్టాలిన్‌ను ఎలా కదిలించింది? ముగ్గురికి సాయం చేయాలని పిలుపు నివ్వడం హోంమంత్రికి ఎందుకు నచ్చలేదు? స్టాలిన్ సోదరిని హోం మంత్రి ఎందుకు కిడ్నాప్ చేశాడు? హోంమంత్రికి, స్టాలిన్‌కు మధ్య వైరం ఎలా కొనసాగింది? చివరికి హోంమంత్రికి ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఆర్మీలో క్రమశిక్షణ చర్య చేపట్టడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే స్టాలిన్ సినిమా కథ.

Stalin Movie Re Release Review

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్తూ.. సమాజ సేవలో నిమగ్నమైన విషయాలను బేరీజు వేసుకొని తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ రాసుకొన్న కథ.. యూత్‌కు మంచి కనెక్టివిటి, సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది. అయితే చిరంజీవి సోషల్ సర్వీస్‌ను స్పూర్తిగా తీసుకొని ఆ కథ రాశాను. ఆయన ఇమేజ్‌కు తగినట్టుగా సినిమాను తీశాం అని మురగదాస్ పలు సందర్భాల్లో చెప్పారు. దేశభక్తి, రాజకీయ నేతల అరాచకాల నేపథ్యంగా ఈ సినిమాలోని ఎలిమెంట్స్ అభిమానులను కిక్క్ ఇచ్చేలా చేశాయి. చిరంజీవి కెరీర్‌లో మంచి చిత్రంగా భారీ విజయం సాధించింది.

అయితే చిరంజీవి నటన, డ్యాన్సులు ఎప్పటిలానే ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ మాత్రమే కాకుండా ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. త్రిషా గ్లామర్, ప్రకాశ్ రాజ్ విలనిజం ఆకట్టుకొన్నాయి. ఇక కుష్బూ సోదరిగా భారీ సెంటిమెంట్‌ను పండించింది. సిక్కును ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఆమె..తన అన్నయ్యకు పంజాబీ అయిన భర్త రక్తదానం చేయడమనే సీన్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. మిగితా పాత్రల్లో నటించిన వారాంతా ఫర్వాలేదనిపించారు.

తెలుగు సినిమా రంగంలో రీ రిలీజ్ చిత్రాల హావా కొనసాగుతున్నది. ఆగస్టు 22వ తేదీ చిరంజీవి పుట్టిన రోజున పురస్కరించుకొని స్టాలిన్ సినిమాను లేటేస్ట్ టెక్నాలజీతో నేటితరం ప్రేక్షకులకు అభిరుచికి తగినట్టుగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. కలర్ గ్రేడింగ్, సౌండ్, విజువల్ క్లారిటీ అంశాలను లేటేస్ట్ పద్దతులను, టెక్నాలజీతో హంగులు అద్దారు. చిరంజీవి అభిమానుల కోసం మరోసారి ఈ మూవీని తీసుకొచ్చారు. మరోసారి చిరంజీవి మ్యాజిక్‌ను తెర మీద చూసే అవకాశం ఉంది.. చూసి కొత్త అనుభూతిని పొందండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X