Su from So Movie Review: సు ఫ్రమ్ సో కన్నడ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: షానిల్ గౌతమ్, జపీ తుమీనాడ్, సంధ్య అరాకెరే, ప్రకాశ్ తుమీనాడ్, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్ తదితరులు
కథ, దర్శకత్వం: జేపీ తుమినాడు
నిర్మాతలు: శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కాళిదాస, రాజ్ బీ శెట్టి
మ్యూజిక్: సుమేద్ కే, సందీప్ తులసిదాస్
సినిమాటోగ్రఫి: చంద్రశేఖరం ఎస్
ఎడిటర్: నితిన్ శెట్టి
సౌండ్ డిపార్ట్‌మెంట్: శరత్ కుమార్ మరియప్పన్, నారాయణన్ ఎస్పీ
బ్యానర్: లైటర్ బుద్దా ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-07-25
దక్షిణ కన్నడ తీర ప్రాంతంలోని గ్రామంలో రవి అన్న (షానీల్ గౌతమ్) అనే బ్రహ్మాచారి, గ్రామ పెద్ద, ఆయనకు రైడ్ హ్యాండ్ సతీష్ అన్న (దీపక్ రాయ్ పనాజే), రిక్షా చంద్ర అన్న (ప్రకాశ్ తుమినాడ్), యాదు అన్న (మైమ్ రామదాస్), రమేష్ అన్న ఓ కమిటీని ఏర్పాటు చేసి స్పీచ్‌లు ఇస్తుంటారు. రమేశ్ అన్నకు పోర్న్ వీడియోలు చూస్తూ అల్లరి చిల్లరిగా తిరుగుతు ఉండే కొడుకు అశోక (జేపీ తుమినాడ్) ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో అశోక్‌కు సులోచన అనే దెయ్యం పట్టిందనే విషయాన్ని మంత్రగాడు బయటపెడుతాడు.

అశోక్‌కు దెయ్యం పట్టిన వ్యవహారం గ్రామంలో ఎలాంటి గందరగోళానికి గురి చేసింది? అశోక్‌కు పట్టిన దెయ్యం సులోచన ఎవరు? అశోక్ సమస్యను రవి అన్న ఎందుకు పరిష్కరించడానికి ప్రయత్నించిండు? అసలు సులోచన ఎవరు? ఆమె ఎందుకు దెయ్యంగా మారింది? భాను (సంధ్య అరెకెరే) పాత్ర ఏమిటి? సోమేశ్వర గ్రామంలో ఏం జరిగింది? అశోక్ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే సు అండ్ సో సినిమా కథ.
దెయ్యం కాన్సెప్ట్‌తో ఫన్ అండ్ హ్యుమర్ అంశాలను జోడించి రూరల్ బ్యాక్ డ్రాప్ డ్రామాను దర్శకుడు జేపీ తుమినాడ్ రాసుకొన్న విధానం, పాత్రలను డిజైన్ చేసిన తీరు చక్కగా కుదిరింది. సింపుల్ కామెడీ కథను ఎలాంటి కమర్షియల్ వాల్యూస్ జొప్పించకుండా సున్నితమైన హాస్యంతో సినిమాను నడిపించిన విధానం అతడిలోని ప్రతిభకు అద్దం పట్టింది. కామెడీ అంటే నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండాలనే ఫార్మూలను విస్మరించి నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రతీ సన్నివేశాన్ని చక్కటి వినోదం, సంభాషణలతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆయన ఎంచుకొన్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకులను మెప్పిస్తుంది. దర్శకత్వ ప్రతిభకు ఫుల్ మార్క్సులు వేయాల్సిందే.
ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు అంతా కొత్తవారితోనే చిన్న పాటి ప్రయోగం చేశారు. అలా నటించిన వారంతా గుర్తుండిపోయేలా ఫెర్ఫార్మెన్స్ చేశారు. శనీల్ గౌతమ్, ప్రకాష్ కే తుమినాడ్, దీపక్ రై పణజె కూడా బాగా నటించారు. సులోచనలా మారి ఆమె ఇంటికి వెళ్లేటప్పుడు జెపి తుమినాడ్ అద్భుతంగా కనిపిస్తాడు, అశోక్ పాత్రలో ఆయన బాగా నటించినప్పటికీ, ఈ పాత్ర ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాల్సింది అనిపిస్తుంది. కథ మొత్తానికి ఈ పాత్రే జీవం కాబట్టి కొన్ని సన్నివేశాల్లో నీరసంగా అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో డల్ అనిపిస్తాడు.అమ్మాయిని కళ్ళలో కళ్ళు పెట్టి చూసే సన్నివేశంలో ఇంకాస్త రొమాన్స్ పండించాల్సింది అనిపిస్తుంది. నిర్మాతగానే కాకుండా రాజ్ బీ శెట్టి ఓ కీలక పాత్రలో నటించాడు. కరుణాకర్ గురూ పాత్రలో ఆకట్టుకొన్నాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా త పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ పాజిటివ్ అంశాలుగా మారాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు చక్కగా కుదిరాయి. సందీప్ తులసీ దాస్ అందించిన బీజీఎం ఈ మూవీకి ప్రాణంగా నిలిచింది. సుమేధ్ కే పాటలు అలరించాయి. రూరల్ డ్రామాలో ఉండే ఎమోషన్స్, ఫన్ సీన్లను చంద్రశేఖరం ఎస్ తన కెమెరాలో అద్బుతంగా బంధించారు. శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కాళిదాస, రాజ్ బీ శెట్టి అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఈ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. రెగ్యులర్‌గా వచ్చే దెయ్యం కథ సినిమాల మాదిరి కాకుండా.. డిఫరెంట్‌గా చూపించిన రూరల్ డ్రామా. నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక విభాగాల పనితీరు ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఈ సినిమాలో స్క్రిప్టు పరంగా, ఇతర అంశాల విషయంలో లోపాలు ఉన్నప్పటికీ.. పెద్దగా కొట్టొచ్చినట్టు కనిపించవు. ఫన్, రూరల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. పక్కాగా పైసా వసూల్ సినిమా. థియేటర్‌లోనే చూడండి.. మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications











