Su from So Telugu Review: సు ఫ్రమ్ సో తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: షానిల్ గౌతమ్, జపీ తుమీనాడ్, సంధ్య అరాకెరే, ప్రకాశ్ తుమీనాడ్, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్ తదితరులు
కథ, దర్శకత్వం: జేపీ తుమినాడు
నిర్మాతలు: శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కాళిదాస, రాజ్ బీ శెట్టి
మ్యూజిక్: సుమేద్ కే, సందీప్ తులసిదాస్
సినిమాటోగ్రఫి: చంద్రశేఖరం ఎస్
ఎడిటర్: నితిన్ శెట్టి
సౌండ్ డిపార్ట్‌మెంట్: శరత్ కుమార్ మరియప్పన్, నారాయణన్ ఎస్పీ
బ్యానర్: లైటర్ బుద్దా ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-07-25

కర్ణాటకలోని మర్లూర్ అనే చిన్న గ్రామంలో రవన్న (షానీల్ గౌతమ్) పెద్దరికంతో పంచాయితీలు, సమస్యలను తీర్చుతుంటాడు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా.. ముందుడి సాల్వ్ చేస్తుంటాడు. అలాంటి గ్రామంలో పక్క గ్రామం సోమేశ్వరకు చెందిన సులోచన అనే దెయ్యం తనకు పట్టిందని అశోక్ (జేపీ తుమినాడ్) చెబుతాడు. దాంతో రవన్న రంగంలోకి దిగి సులోచన ఎవరు? తమ గ్రామంలోని యువకుడిని ఎందుకు పట్టింది అనే విషయంపై రవన్న, గ్రామస్థులు దృష్టిపెడుతారు. ఆ క్రమంలో స్వామిజీ (రాజ్ బీ శెట్టి)ని గ్రామానికి ఆహ్వానించి దెయ్యాన్ని వెళ్లగొట్టేందుకు ప్లాన్ చేస్తారు.

Su from So Telugu Review

గ్రామంలో రవన్న పెద్దరికం ఎలా సాగింది? రవన్న వయసు పైబడినా గానీ బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయాడు? ఆ గ్రామంలో ఆచార వ్యవహారాలు ఎలా సాగాయి? అశోక్‌కు సులోచన దెయ్యం ఎందుకు పట్టింది? దెయ్యం పట్టిన తర్వాత అశోక్ పరిస్థితి ఏమిటి? గ్రామస్థులందరూ అశోక్‌ను చూసి ఎందుకు భయపడుతారు? అసలు సులోచన ఎవరు? భాను (సంధ్య అరాకెరే)కు సులోచనకు ఏమిటి సంబంధం? రవన్నకు భానుకు ఉన్న అనుబంధం ఏమిటి? చివరకు అశోక్‌కు దెయ్యం ఎలా వదిలింది? అనే ప్రశ్నలకు సమాధానమే సు ఫ్రం సో సినిమా కథ.

సు ఫ్రమ్ సో గొప్పగా చెప్పుకోవడానికి కథాపరంగా ఏమీ కనిపించదు. అందమైన గ్రామీణ ప్రాంతంలోని ప్రజల అమాయకత్వం, నిజాయితీతో కూడిన సన్నివేశాలు, గ్రామంలో ఉండే ఆచారాలతో సరదాగా సినిమా సాగిపోతుంది. ఈ సినిమా చూసేంత సేపు బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పుడప్పుడు హృదయంలో చోటు కల్పించకున్నా.. కథలోని సన్నివేశాలు, పాత్రలు మనసును తాకుతూనే ఉంటాయి. భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. స్వామిజీ (రాజ్ బీ శెట్టి) ఎంట్రీతో సెకండాఫ్ హిలేరియస్‌గా ఉండబోతుందనే హింట్ దొరికిపోతుంది. ఫస్టాఫ్‌లో బావ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువగా ఉండటం వల్ల ల్యాగ్ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. కన్నడలో వర్కవుట్ కావొచ్చేమో.. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొంత సహనానికి పరీక్షలానే ఆ పాత్ర అనిపిస్తుంది.

ఇక సెకండాఫ్‌లో స్వామిజీ పాత్రతో కొంత మేరకు సినిమాను రాజ్ బీ శెట్టి భుజాన వేసుకొంటే.. ప్రీ క్లైమాక్స్ నుంచి భాను పాత్రలోనే ఎమోషన్స్, గుండెను తట్టిలేపే భావోద్వేగాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ఇక చివర్లలో అశోక్ నటనపరంగా క్రేజీగా ఆకట్టుకోవడం, రవన్న క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన విధానంతో సినిమా పరిపూర్ణంగా మారిపోతుంది. అంతా కొత్తవారితోనే చిన్న పాటి ప్రయోగం చేశారు. అలా నటించిన వారంతా గుర్తుండిపోయేలా ఫెర్ఫార్మెన్స్ చేశారు. శనీల్ గౌతమ్, ప్రకాష్ కే తుమినాడ్, దీపక్ రై పణజె కూడా బాగా నటించారు. సులోచనలా మారి ఆమె ఇంటికి వెళ్లేటప్పుడు జెపి తుమినాడ్ అద్భుతంగా కనిపిస్తాడు

సు ఫ్రమ్ సో సినిమా తెలుగు వారికి బాగా కనెక్ట్ కావడానికి డబ్బింగ్ వర్క్ ప్రధాన కారణం. డైలాగ్స్ చెప్పించిన తీరు.. రాసిన విధానం.. ముఖ్యంగా రాజ్ బీ శెట్టికి డబ్బింగ్ చక్కగా సరిపోవడమే కాకుండా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌ను క్రియేట్ చేసింది. వేష భాషలు, ఎన్విరాన్‌మెంట్ చూస్తే.. కన్నడ వాసన కొట్టొచ్చినట్టు కనిపించినా.. డబ్బింగ్ వర్క్ కారణంగా పక్కాగా తెలుగు సినిమాను చూస్తున్నామా? అనే మూడ్‌ను క్రియేట్ చేయడం ఈ సినిమా సక్సెస్ ప్రధాన కారణమవుతుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా మారడమే కాకుండా పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. తెలుగు డైలాగ్స్ బాగా కుదిరాయి. ఈ సినిమాను మిస్ చేసుకోకుండా తప్పకుండా థియేటర్‌లోనే చూడండి.. ఈ మధ్యకాలంలో ఓ మంచి చిత్రాన్ని చూశామనే సంతృప్తి మిగలడం గ్యారెంటి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X