సుబ్బు - ఎంత గబ్బు!

By Staff

Subbu
-జలపతి
చిత్రం: సుబ్బు
నటీనటులు: ఎన్టీఆర్‌, సోనాలి జోషి
సంగీతం: మణిశర్మ
నిర్మాత: శ్రీనివాస్‌యాదవ్‌
కథ,మాటలు,దర్శకత్వం: సురేష్‌ వర్మ

ఈ చిత్రం ప్రారంభంలో ఏనిమేషన్‌ తో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రేమగాథలను వివరిస్తాడు దర్శకుడు. ఆ తర్వాత, తను ఇప్పుడు ఓ అందమైన ప్రేమకథ అందిస్తున్నానని ప్రకటిస్తాడు. నిజమే కాబోలు అని మనం సీట్లో సర్దుకొని కూర్చున్నాక తెలుస్తుంది, అది ఎంత అబద్దమని. మొదటి సీన్‌ నుంచి చివరి సీన్‌ వరకు అంతా బోర్‌. ప్రతి సీన్‌ చాలా సిల్లీగా అనిపిస్తాయి. దర్శకుడి ఇమ్మెచ్చురిటీ కనిపిస్తుంది. సినిమాలో ఏమి చెప్పాలనుకున్నారో అన్న విషయాన్ని పక్కనపెడితే, డీల్‌ చేసిన విధానమైనా బాగుండాలి కదా! ఎన్టీఆర్‌ ను యాక్షన్‌ హీరోగా నిలబెట్టాలన్న ప్రయత్నం తప్ప ఈ చిత్రంలో ఏమీ లేదు. మనం ఆవేశంగా ఏ పనైనా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు, చాలా సమస్యలు సాల్వ అవుతాయని చెప్పడం ఈ సినిమా ఉద్దేశం. కానీ ఇందులో ఎన్టీఆర్‌ మనకు అది చెప్తూనే, దొరికిన ప్రతి వాణ్ని కొడుతునే ఉంటాడు. ఇదేమో ట్విస్టో మరి. ఓవరాల్‌ గా పరమ శుద్ద దండగ చిత్రం ఇది.

బాలసుబ్రమణ్యం అలియాస్‌ సుబ్బు(ఎన్టీఆర్‌) చాలా మంచివాడు. ఈ రాముడు మంచి బాలుడు ఒకసారి రోడ్డు మీద వెళ్ళుతుంటే, యాక్సిడెంట్‌ కు గురై చావు బతుకుల్లో ఉన్న ఓ అమ్మాయిని చూస్తాడు. వెంటనే ఆసుపత్రిలో జాయిన్‌ చేస్తాడు. ఇక్కడ ఓ చిన్న ప్రహసనం. ఆసుపత్రిలో వారు జాయిన్‌ చేసుకునేందుకు నిరాకరిస్తారు. ఎందుకంటే, పోలీసులు వచ్చి కేసు బుక్‌ చేశాకే, అడ్మిట్‌ చేస్తామని అంటారు. దానికి హీరోగారు రెచ్చిపోయి, భారీ డైలాగ్‌ లు వదులుతారు. యాక్సిడెంట్‌ కేసుకు ఇప్పుడు పోలీసుల అవసరం లేదన్న కనీస జ్ఞానం దర్శకుడికి లేదు.

ఇక, విషయానికొస్తే ఆ అమ్మాయి గర్భవతి అని తేలుతుంది. బాలసుబ్రమణ్యం అనే అబ్బాయి దీనికి కారణమని ఆ అమ్మాయి చెప్పుతుంది. ఆ అమ్మాయి తండ్రి పోలీసుల చేత కొట్టిస్తాడు. కొట్టించాక తెలుస్తుంది, ఈ బాలు వేరని, ఆ బాలు వేరని. పోలీసులు అరెస్ట్‌ చేశారన్న అవమానం భరించని ఎన్టీఆర్‌ తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. ఐనా ఆ అమ్మాయి తండ్రిని, ఆ అమ్మాయిని ఏమీ ఎన్టీఆర్‌ ఏమీ అనడు. వీరిని కొడితే, తన తల్లితండ్రులు తిరిగివస్తారా అనేది లాజిక్‌. మరి హీరోయిన్‌ ను టీజ్‌ చేస్తే, ఈయనగారు రౌడీలను ఎందుకు చితకబాదుతారు మనకు అర్థం కాదు.

ఇక, సోనాలి జోషి సుబ్బును చూడకుండానే ప్రేమిస్తుంది. సుబ్బు కోసం వెతుకుతుంది. మరో వైపు, సుబ్బు ఈ అమ్మాయిని చూడగానే ప్రేమలో పడుతాడు. తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆమె నిరాకరిస్తుంది. బాలసుబ్రమణ్యం అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాని చెప్పుతుంది. క్లైమాక్స్‌ లో బాలసుబ్రమణ్యమే, సుబ్బు అని తెలియడంతో ఇద్దరూ కలుస్తారు. కథ ముగుస్తుంది. మనకు తలనొప్పి పట్టుకుంటుంది.

మణిశర్మ సంగీతం సాధారణంగా ఉంది. జాలాది రాసిన దేశభక్తి గీతం ఈ చిత్రంలో శుద్ద దండగ. ఫేక్‌ పేట్రియాటిజం ఉత్తేజం చేస్తుందా? విజయశ్రీ ఫోటోగ్రఫీ కన్నా న్యూజిలాండ్‌ లో చిత్రికరించిన పాటలకు ఛాయగ్రహణ దర్శకత్వం వహించిన ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ బాగుంది. సురేష్‌ వర్మ పేరు చూస్తే ఇక సినిమాకు వెళ్ళకూడదన్న రీతిలో దర్శకుడి ప్రతిభ ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్‌ 'నటన' గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు నటన రాదని మనం కొత్తగా చెప్పాలా?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X