Subham Movie Review: శుభం తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు
దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
నిర్మాత: సమంత రుత్ ప్రభు
మ్యూజిక్: క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి: మృదుల్ సేన్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
ఆర్ట్: అనికేత్ మిత్ర
ప్రొడక్షన్ డిజైన్: రామచరణ్ తేజ్ లబానీ
బ్యానర్: ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-05-09

భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్‌ శ్రీను (హర్షిత్ రెడ్డి) తన ఇద్దరు స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ) హ్యాపీగా లైఫ్ గడుపుతుంటారు. అయితే ఈ ముగ్గురు భార్యలు శ్రీవల్లి, ఫరీదా, గాయత్రి (శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి)కి తెలుగు టెలివిజన్ సీరియల్ జన్మజన్మల బంధం అంటే పిచ్చి. ఆ సీరియల్ ప్రసారమయ్యే సమయంలో ఎవరైనా అడ్డుకొంటే వారి ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు. అలాంటి భార్యల పిచ్చి వల్ల శ్రీను, అతడి స్నేహితుల బతుకు తలకిందులవుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రామంలో ఉండే మాంత్రికురాలు మాయ మాత ( సమంత రుత్ ప్రభు)ను సలహా కోసం ఆశ్రయిస్తారు.

Subham Movie Review

శ్రీనుకు అతడి స్నేహితులకు తమ భార్యల నుంచి వచ్చిన కష్టం ఏమిటి? తెలుగు సీరియల్ వారి జీవితంలో అశాంతికి కారణమైంది? మాయ మాతను ఆశ్రయిస్తే వారికి ఆమె ఇచ్చిన సలహా ఏమిటి? మాయ మాత సలహాలు వారికి ఎలా ఉపయోగపడ్డాయి? శ్రీను బృందానికి ఆ గ్రామంలోని డిష్ కుమార్ ఇచ్చిన షాక్ ఏమిటి? ఆ షాక్‌ను ఈ ముగ్గురు ఎలా తిప్పి కొట్టారు? గ్రామస్థులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ కష్టానికి శ్రీను అతడి స్నేహితులు పరిష్కారం చూపించారు? అనే ప్రశ్నలకు కామెడీగా, ఫన్‌గా చెప్పిన జవాబులే శుభం సినిమా కథ.

సమంత నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమా కథ కొత్తగా సృష్టించిందేమీ కాదు. గొప్పగా సాంకేతికత జోడించి అబ్బుర పరిచే సినిమా అంతకంటే మాత్రం కాదు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతీ నిత్యం జరిగే ఈ చిన్న తమాషా సంఘటన.. దాని వల్ల కాపురాలు, కుటుంబాల్లో ఎలాంటి అశాంతి కలుగుతుందనే విషయాన్ని అత్యంత వినోదంగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా శుభం. ఈ సినిమా కథను చెప్పిన విధానం.. ఆ స్టోరీని చెప్పడానికి పాత్రలను డిజైన్ చేసిన విధానం మరోసారి సినిమాబండి దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వ ప్రతిభను తెలియజెప్పింది. అత్యంత సహజమైన విధానంలో ముగ్గురు దంపతుల క్యారెక్టర్లను మలిచిన విధానం.. అలాంటి పాత్రలకు నటీనటులను ఎంపిక చేసిన విధానమే ఈ సినిమా సక్సెస్‌కు బాట వేసిందని చెప్పవచ్చు.

పాలు నీళ్ల బంధం.. జన్మజన్మల బంధం అంటూ సాగే టెలివిజన్ సీరియల్‌ను కథలో వాడుకొన్న తీరు సినిమాకు బలంగా మారింది. ఫస్టాఫ్‌లో సమస్యను ఎస్టాబ్లిష్ చేసిన విధానం.. పాత్రల పరిచయం.. వారి యాటిట్యూడ్, బిహేవియర్‌ను చూపించిన విషయాలు కథలో లీనమయ్యేలా చేసింది. ఫస్టాఫ్‌లో కథను సరైన ట్రాక్‌లో నడిపించిన ప్రవీణ్.. సెకండాఫ్‌లో పూర్తిగా తడబడ్డాడు. స్క్రిప్టులో అనేక లోపాలు కనిపించాయి. వాటిని కప్పిపుచ్చడానికి సినిమాబండి టీమ్‌ను సినిమాలోకి లాగి పెద్ద కసరత్తే చేశాడనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్నిసార్లు ట్రాక్ తప్పినా.. తన టాలెంట్‌తో సరిదిద్దిన తీరు మూవీని సంపూర్ణంగా మార్చేలా చేసింది.

స్టార్ హీరోలు ఉన్న సినిమాలు రెండు గంటలు చూడటానికి కష్టాలు పడుతున్న సమయంలో.. ఏ మాత్రం ముఖ పరిచయం లేని తెర మీద మూడు జంటలు.. ఆరుగురు నటీనటులు తమ పెర్ఫార్మెన్స్‌తో రెండు గంటలపాటు సీట్లలో అత్తుకుపోయేలా చేశారు. నవ్వించడమే కాకుండా కొన్ని సీన్లలో ఎమోషన్‌కు కూడా గురి చేశారు. మన కుటుంబంలో మన చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్‌ను గుర్తు చేసేలా నటించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ యాక్టింగ్‌తో అదరగొట్టారు. అతిథి పాత్రల్లో కనిపించిన సమంత ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మిగితా పాత్రల్లో వారంతా తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. క్లింటన్ సెరెజో అందించిన పాటలు సందర్బోచితంగా బాగున్నాయి. డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను లైవ్లీగా మార్చింది. ‌మృదుల్ సేన్ సినిమాటోగ్రఫి నేచురల్‌గా సీన్లను చూపించే ప్రయత్నం బాగుంది. ధర్మేంద్ర కాకరాల తన కత్తెరను సరైన రీతిలోనే ఉపయోగించారు. ట్రూ లా లా ప్రొడక్షన్ టీమ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సమంత నిర్మాతగా తన తొలి సినిమాతోనే ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల ప్రేమ, అకింత భావం ఏమిటో మరోసారి తెలిసింది.

శుభం సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో సాగే రెండు గంటల వినోద భరిత చిత్రం. లాజిక్కులు, అంచనాలు అవసరం లేకుండా హ్యాపీగా ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేయవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, దర్శకుడి టాలెంట్, విజన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. సెకండాఫ్‌లో కథలో సాగదీత.. స్క్రిప్టులో కొంత గందరగోళం తప్పిస్తే.. మిగితా విషయాలన్నీ ఫర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి. ఈ సినిమాను థియేటర్లోనే చూడండి.. మంచి అనుభూతిని తప్పకు పంచుతుంది. డోంట్ మిస్ ఇట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X