Subham Twitter Review: శుభం తెలుగు మూవీ ట్విట్టర్ రివ్యూ

టాప్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా మారి అతిథి పాత్రలో నటించిన శుభం. సొంతంగా నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందించారు. మే 9వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ముందుగానే ప్రదర్శించారు. ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకొన్న రివ్యూలు, అభిప్రాయల వివరాల్లోకి వెళితే..

Subham Twitter Review

శుభం సినిమాతో సమంత నిర్మాతగా అణిముత్యం లాంటి సినిమాను అందించారు. ఇలాంటి సినిమాను అందించినందుకు టాలీవుడ్ గర్వపడాలి. మూవీ మొదలైనప్పటి నుంచి చివరి సన్నివేశం వరకు పుల్లుగా ఎంజాయ్ చేశాను. అతి కాకుండా మంచి కంటెంట్‌తో హాస్యాన్ని పండించిన విధానం బాగుంది. శుభం విజేతగా నిలువడం ఖాయం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


శుభం సినిమా తెలుగులో ప్రాపర్‌గా రూపొందించిన హారర్ కామెడీ మూవీ. నిర్మాతగా సమంత స్ట్రాంగ్‌గా ఎంట్రీ ఇచ్చారు. సినిమాబండి సినిమా తర్వాత దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మరో మంచి సినిమాను అందించారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

శుభం సినిమా ప్రీమియర్ చూశాను. అసలే మాత్రం అసభ్యత, అశ్లీలత లేకుండా తీసిన సినిమా బాగుంది. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సమంత నిర్మాతగా తీసిన ఈ సినిమాను ఓసారి చూసేయండి అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

శుభం సినిమా చూసిన తర్వాత చిన్నప్పుడు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సందడే సందడి లాంటి మూవీస్ చూసి ఎంజాయ్ చేసినట్టు అనిపిపించింది. కేబుల్ టీవీ, డిష్ టీవీ టైమ్ పిరియడ్ కాన్సెప్ట్ బాగుంది. హర్షిత్, చరణ్ బాగా నటించినందుకు కంగ్రాట్స్. మంచి హారర్ కామెడీ సినిమా. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. తప్పకుండా చూడండి అని ఓ నెటిజన్ తన రివ్యూను వెల్లడించారు.

శుభం సినిమా నాకు బాగా నచ్చింది. ఫుల్లుగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. నవ్వులతో సాగే ప్రయాణంలా ఉంటుంది. క్లీన్ కామెడీ మూవీని అమ్మమ్మ, నానమ్మతో కలిసి చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. హర్షిత్, శ్రీయ కొంతం పెర్ఫార్మెన్స్‌తో మీరు అదరగొట్టారు. అతిథి పాత్రలో నటించిన సమంత‌ మాతకు స్పెషల్ థ్యాంక్స్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

శుభం సినిమా చూశాను. సెకండాఫ్‌లో స్టోరీ కొంత పేలవంగా ఉంది. అయినప్పటికీ సినిమా కామెడీ, ఫన్‌తో సాగుతూ ప్రేక్షకులను బాగా నవ్వించేలా చేసింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు బాగా పెర్ఫార్మ్ చేయడం పాజిటివ్ విషయం. అందరూ కూడా మంచి టాలెంట్‌తో పాత్రలను ఎలివేట్ చేశారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

శుభం సినిమాతో సమంత నిర్మాతగా అణిముత్యం లాంటి సినిమాను అందించారు. ఇలాంటి సినిమాను అందించినందుకు టాలీవుడ్ గర్వపడాలి. మూవీ మొదలైనప్పటి నుంచి చివరి సన్నివేశం వరకు పుల్లుగా ఎంజాయ్ చేశాను. అతి కాకుండా మంచి కంటెంట్‌తో హాస్యాన్ని పండించిన విధానం బాగుంది. శుభం విజేతగా నిలువడం ఖాయం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X