Subham First Review: శుభం మూవీ ఫస్ట్ రివ్యూ.. నిర్మాతగా సమంత హిట్ కొట్టిందా?
దక్షిణాదిలో పాపులర్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తి నిర్మించిన సినిమా శుభం. ఇప్పటి వరకు పలు చిత్రాల్లో కథానాయకురాలి పాత్రలను పోషించి కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించిన ఆమె స్వయంగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రివ్యూ, ఇతర విశేషాల్లోకి వెళితే..
శుభం సినిమాలో అంతా కొత్తవారికి అవకాశం కల్పించి ప్రతిభను పోత్సహించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్ ఏర్పడింది.

ఫ్యామిలీ, యూత్‌ఫుల్ అంశాలతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన శుభం సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు రివ్యూ చేశారు. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో అందించిన వినోదం, విభిన్నమైన కథ, స్క్రీన్ ప్లే, యువ నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ చక్కగా కుదిరాయనే అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. ఈ సినిమాకు క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
శుభం సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు, ఫన్ ఫ్యాక్టర్ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. అయితే ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. సమంత నిర్మాత కావడంతో ఈ సినిమాకు మరింత మైలేజ్ వచ్చింది. సమంత చేసిన ప్రమోషనల్ వర్క్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
శుభం సినిమా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అనే విషయాన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ ఎస్టాబ్లిష్ చేశాయి. కొత్త తరహా కామెడీ, విభిన్నమైన కథ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ రోజుల్లో వస్తున్న సినిమాలకు భిన్నమైన కంటెంట్ ఉంటుందని స్పెషల్ ప్రీమియర్లను చూసిన ఆడియెన్స్, సినీ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్ వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











