twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓకే రా బుజ్జీ... ('ఆడు మగాడ్రా బుజ్జీ' రివ్యూ)

    By Srikanya
    |

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    Rating:
    2.5/5

    పవరఫుల్ టైటిల్, సిక్స్ ప్యాక్ కండల హీరో ని పోస్టర్ పై చూడగానే ఏమనిపిస్తుంది....ఏదో ఓ భారీ యాక్షన్ చిత్రం చూడబోతున్నాం అనుకుంటాం. అయితే 'ఆడు మగాడ్రా బుజ్జీ' నిజానికి ఓ కామెడీ సినిమా. ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయిన కృష్ణారెడ్డి సేఫ్ గేమ్ ఆడటానికే ప్రయత్నించారు. ఓ కుక్క పాత్రని క్రియేట్ చేసి,కథలో క్యారెక్టర్స్ పై సెటైర్స్ వేయిస్తూ కొత్తదనానికి ప్రయత్నించినా పరమ రొటిన్ కథతో రావటంతో తొలి ప్రయత్నం యావరేజ్ అనిపించుకుంది. ఫస్టాఫ్ నాన్ స్టాఫ్ గా కామెడీతో వెళ్లిపోయినా సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ లలో ఆ జోష్ మిస్ అవటంతో జస్ట్ ఓకే అనిపించుకుంది. హీరో సుధీర్ బాబు...కేవలం బాడి ప్రదర్శనకే తప్ప...నటనకి ఎక్కడా ప్రయత్నం చేయలేదు. పెద్దగా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా కామెడీ కోసం వెళితే బాగుందనిపిస్తుంది. ముఖ్యంగా కుక్క కామెడీ కోసం తప్పని సరిగా చూడాలి.

    సిద్దు(సుధీర్) చిన్నప్పటినుంచి ఎవరో ఒకరిని ఇరికిస్తూ తన పబ్బం గడుపుకునే క్యారెక్టర్. దాంతో అతని సొంత తండ్రి ప్రసాద్(నరేష్) సైతం భయపడి,దూరంగా హాస్టల్ లో పెట్టి చదివిస్తూ ఉంటాడు. చదువుతో పాటు పనిలో పనిగా సిద్దూ ఓ అమ్మాయి ఇందూ(అస్మిత సూద్)ని ప్రేమిస్తాడు. ఆమెకు చెర్రీ(రణధీర్) అనే ఓ రౌడీ అన్నయ్య ఉంటాడు. అతనికి ఎలాగో మాయ చేసి..ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూంటాడు. అంతేకాదు ఆమె దగ్గర మార్కులు కొట్టేయటానికి సిటీలో రౌడీ పొలిటీషియన్ శంకర్(అజయ్)ని నడిరోడ్డుపై కొడతాడు. అయితే అక్కడా తెలివి ప్రదర్శించి..ముఖానికి చున్నీ కట్టుకుని ఫేస్ కనపడకుండా మ్యానేజ్ చేస్తాడు. అయితే అనుకోని విధంగా...సిద్దూ ...కొన్ని పరిస్ధితుల్లో శంకర్ ఇంట్లోనే మకాం వేయాల్సి వస్తుంది. శంకర్ ఓ ప్రక్కన తనని కొట్టిన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడే ఉన్న సిద్దూ ఎలా తప్పించుకుంటాడు. ఆ ఇంట్లోకి సిద్దూ ఎంట్రీ ఇవ్వటానికి కారణం ఏమిటి..అనేది మిగతా కథ.

    వాస్తవానికి ఇలాంటి విలన్ ని బకరా చేసే కథలు తెలుగు తెరకి కొత్తేమీ కాదు. ఢీ,రెడీ, దూసుకెళ్తా, కందిరీగ, బాధ్షా ఇలా..విలన్ ఇంట్లోకి హీరో ఎంట్రీ ఇచ్చి..విలన్ ని చెడామెడా ఆడేసుకోవటం,కామెడీ పండించెయ్యటం, చివర్లో విలన్ మెల్లిగా మేల్కొని..హీరో తనని బకరా చేసాడని తెలుకుని రెచ్చిపోవటం..హీరో చేతిలో చావు దెబ్బలు తినటం రొటీన్ గా జరిగిపోతూంటాయి. ఇలాంటి రొటీన్ కథనుంచి కొత్తదనం పిండటం కష్టమే...చాలా ప్రెడిక్టిబుల్ గా ప్రేక్షకుల అంచనాలకు అందుతూ ఉంటాయి. దాన్ని ఎంతలా బ్రేక్ చేసాడనేదానిపై దర్శకుడు సక్సెస్ రేంజి ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా లో కుక్క పాత్ర ద్వారా..దర్శకుడు ఆ ప్రయత్నం చేసి కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా దర్శకుడుగా హీరోలని సమర్ధవంతంగా డీల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు(తొలి చిత్రం దర్శకుడు టార్గెట్ అదే కదా).

    కథలో ...సెంకండాఫ్ లో రావాల్సిన డ్రామా మిస్సవటం సినిమాకు మైనస్ అయ్యింది. నో కాంఫ్లిక్ట్..నో డ్రామా..నో డ్రామా ..నో సినిమా అని సినిమా పెద్దలు ఎప్పుడో సినిమా పుట్టిన కొత్తలోనే చెప్పేసారు. కానీ ఆ డ్రామానే ఈ సినిమాలో మిస్సైంది. విలన్ ని ఇరికించటానికి..హీరో సెకండాఫ్ లో డ్రామా మొదలు పెట్టినప్పుడు...అక్కడనుంచి ఆ డ్రామాని విస్తరిస్తూ ఏక్ట్ 3,ఏక్ట్ 4 ని జాగ్రత్తగా చేస్తే సినిమాలో కొత్త సీన్స్ వస్తాయి. అలా కాకుండా ఏక్ట్ 3 ఫేజ్ ని డ్రామాలో కి వెళ్లకండా కేవలం కొన్ని కామెడీ సీన్స్ తో గెంటేస్తే...రస హీనంగా తయరవుతుంది. సాధారణంగా ప్రేక్షకుడు ...సినిమాలో హీరోకు వచ్చిన సమస్యను ఎలా ఫేస్ చేస్తాడు..ఆ ఫేస్ చేసే దారిలో ఏ సమస్యలు వస్తాయి..వాటిని..ఎలా ఎదుర్కొంటాడు అనేవే చుడ్డానికే వస్తాడు. వాటిని మిస్సైతే మిగతా విభాగాలు మిగతా సినిమా ఎంత బాగున్నా పెద్దగా క్లిక్ అవదు.

    నటీనటుల్లో మొదటే చెప్పుకున్నట్లు..సుధీర్ బాబు సినిమాకు పెద్ద ప్లస్ కాలేదు. అలాగే హీరోయిన్ సైతం పెద్ద గ్లామర్ గా లేదు...ఎలాగో నటశూన్య కాబట్టి ఆమె నుంచి ఎక్సపెక్ట్ చేసేదేమీ లేదు. మిగతా సీనియర్ నటులు యధావిధిగా చేసుకుంటూపోయారు. డైలాగ్స్ బాగా పేలాయి. అయితే కాస్త ప్రాస తగ్గిస్తే బాగుండేది. పాటల్లో ఒకటి బాగుంది. ఇక హైలెట్ గా చెప్పుకుంటున్న కుక్క విషయానికి వస్తే దాని గ్రాఫిక్స్ కు, దాన్ని అంత అందంగా డిజైన్ చేయించుకుని,కమర్షియల్ గా వాడుకున్న దర్శకుడు ఆలోచనకు హ్యాట్యాఫ్ చెప్పాలి. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ చాలా సీన్స్ ఎస్టాబ్లిష్ కాకుండా..షార్ప్ గా చేసేసారు. దాంతో కొన్ని చోట్ల ఇబ్బందిగా అనిపించింది. రీరికార్డింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

    పైనల్ గా మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం కామెడీ బాగుంది కాబట్టి బాగా నిలబడే అవకాసం ఉంది. మల్టిప్లెక్స్ లు, ఎ సెంటర్లు మినహాయిస్తే బి,సి సెంటర్లలో ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    బ్యానర్ :కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
    నటీనటులు: సుధీర్ బాబు, అస్మిత, సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు
    సంగీతం: శ్రీ,
    కథ: కృష్ణాడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్,
    కెమెరా: శాంటోనియో ట్రిజియో,
    మాటలు: పద్మశ్రీ, నక్కా రామకృష్ణ,
    పాటలు: అనంతశ్రీరామ్, కృష్ణచైతన్య, చిర్రావూరి విజయ్‌కుమార్,
    నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి,
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

    English summary
    Sudheer Babu's Aadu Magadura Bujji released today with average talk.Directed by Gangadasu Krishna Reddy, Aadu Magadura Bujji has Asmita Sood and Poonam Kaur as heroines. The film has music by Sri. Sudheer Babu is very optimistic about the film and is looking for a second hit after Prema Katha Chitiram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X