ఆటోగ్రాఫ్...స్లోగా...స్వీట్ గా ( 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' రివ్యూ)

By Srikanya

Rating:
2.5/5

ప్రేమ కథలు స్లో గా నేరేట్ చేసి చెప్పాలన్న రూల్ ఏమన్నా పెట్టుకున్నారా ఏమో అని కొన్ని లవ్ స్టోరీలు చూస్తూంటే డౌట్ వస్తూంటుంది. అలాంటివాటిల్లో ఈ చిత్రంకూడా చేరుతుంది. సినిమాలో విషయం ఉన్నా...స్లో నేరేషన్ ని తట్టుకుని కూర్చోగలిగితేనే ఎంజాయ్ చేయగలుగుతూంటాం. దానికి తోడు దర్శక,నిర్మాతలు ఇన్ సెక్యూరిటీతో కథకు సంభందం లేని కమర్షియల్ ఎలిమెంట్స్ కలపటం ఒకటి చిరాకు తెప్పిస్తూంటుంది. అయితే దర్శకుడు ఎంచుకున్న విషయంలో ఉన్న నిజాయితీ మనని చాలా సేపు కట్టిపారేస్తుంది.

ఫీల్ గుడ్ కథలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. దానికి తోడు ఈ సారి సుధీర్ బాబు కూడా తను నటుడుని అని ప్రూవ్ చేసుకోవాలన్నట్లు కష్టపడి నటించటం కూడా ప్లస్ అయ్యింది. నిర్మాత అభిరుచి బాగుంటే ఇలాంటి సినిమాలు వెలుగులోకి వస్తాయి...ప్రేక్షకులు ఆదరిస్తే అవి నిలబడతాయి. అయితే ఇలాంటి సినిమాలు మనకు రీమేక్ గానే ఎందుకు వస్తాయి...స్టెయిట్ గా ఎందుకు రావు...ఇలాంటి కథలు చెప్తే ఈ నిర్మాతలు ఆదరించరా..ఏమో..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Sudheer Babu's Krishnamma Kalipindi Iddarini  review

కన్నడలో విజయంతమైన 'చార్‌మినార్‌'కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం కథలో .... యుస్ ఎ లో ఓ పెద్ద కంపెనీకి సీఇఓగా పనిచేసే కృష్ణ (సుధీర్ బాబు), తాను చదివిన స్కూల్‌ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన సొంత ఊరు కృష్ణాపురం(ఇలాంటి పేర్లు మన సినిమాల్లో ఈ మధ్యన ఎవరూ పెట్టడం లేదు...మళ్లీ గుర్తు చేసారు ఆ రోజులని ) కి బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. హైదరాబాద్ లో దిగి కృష్ణాపురంకి జర్నీ మొదలవ్వగానే కృష్ణకు తన గతం గుర్తు వస్తుంది. తను ఎదుగదలకు కారణమై...తను ఎంతగానో ఇష్టపడ్డ రాధ (నందిత) చుట్టూ తిరుగుతుంది. లోయిర్ క్లాస్ లో పుట్టి ఆర్దికంగా ఇబ్బందులు పడుతూ ఏడవ తరగతి కూడా పాస్ కాలేని...తను ఇంజినీరు గా మారి ఆర్దికంగా ఉన్నత స్దాయికి ఎలా ఎదిగాడు..అందుకు ఆమె ప్రేమ ఎలా స్పూర్తిగా నిలిచింది. ఆమె ప్రేమను వ్యక్తం చేసే ప్రతీ సారి అతను పడే ఇబ్బందులు ఏమిటి...చివరకు... అతను ఆమె ప్రేమను పొందాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రవితేజ హీరోగా వచ్చిన ఆటోగ్రాఫ్ ..స్వీట్ మెమెరీస్ సినిమాను గుర్తు చేసే ఈ చిత్రం కథ మొత్తం హీరో పాయింటాఫ్ వ్యూ నుంచి చెప్తూంటారు. దాంతో హీరోయిన్ వైపు ఎమోషన్స్ ని ఎక్కడా రిజిస్టర్ కాకుండాపోయాయి. నందిత వంటి మంచి ఆర్టిస్టుని పెట్టుకుని ఈ నేరేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే సీన్లలో ఉన్న ఒరిజినాలిటి, సహజత్వం ఆ లోపాన్ని పెద్దగా హైలెట్ కాకుండా కాపాడాయి.

Sudheer Babu's Krishnamma Kalipindi Iddarini  review

అలాగే...సాధారణంగా రీమేక్ చిత్రాలు చేసేటప్పుడు నేటివిటీ అనేది అతి ముఖ్యమైన అంశం. ఈ రీమేక్ కు తెలుగులో దర్శకులే కొరవడినట్లు...అదే దర్శకుడుని తీసుకువచ్చి డైరక్ట్ చేయించారు. దాంతో కన్నడ చిత్రం తెలుగులో డబ్బింగ్ చేసినట్లు కొన్ని సీన్స్ లో కొట్టివచ్చినట్లు కనపడుతుంది. అలాగే ప్రస్తుతం మనకు రాష్ట్రంలో ఉన్న యూత్ పరిస్ధితిని ఎక్కడా ప్రెజెంట్ చేయలేకపోయాడు. అలాగే...తెలుగులో గత కొంతకాలంగా నడుస్తున్న ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ ని పట్టించుకోలేదు. దాంతో ఎంటర్ట్మైంట్ మెంట్ అనేది లేకుండా పోయింది. ఇక ఎమోషన్ సీన్స్ చాలా చోట్ల కనెక్ట్ చేయలేకపోయారు.

సాంకేతిక విషయాలకి వస్తే...ఈ చిత్రానికి ..హరి అందించిన సంగీతం హైలెట్ అనే చెప్పాలి. అయితే అందరూ చెప్పే కంప్లైంట్ ఒక్కటే...ప్లేస్ మెంట్ సరిగ్గా లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకు ప్లస్ అయ్యింది. చాలా సీన్స్ ని హైలెట్ చేసింది. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. డైలాగులు అక్కడక్కడా బాగున్నాయి. మిగతా వి ఓకే. సుధీర్ బాబు...తనలోనూ నటుడు ఉన్నాడని తెలియచేసిన చిత్రం ఇది.

సినిమా హైలెట్స్... చెప్పాలంటే..

Sudheer Babu's Krishnamma Kalipindi Iddarini  review

చైల్డ్ హుడ్ ఎపిసోడ్, పోసాని ఎపిసోడ్, మదర్ సెంటిమెంట్ ఎపిసోడ్, గెట్ టుగెదర్ ఎపిసోడ్, క్లైమాక్స్.... ఇలా... ఏ ఎపిసోడ్ కు ఆ ఎపిసోడ్ బాగా డిజైన్ చేసారు. అయితే లోతులకు వెళ్లలేదు..వెళ్లి ఉంటే సినిమా ఇక్కడ కూడా అద్బుతమనిపించేది. ఎందుకంటే మనకు ఇంకా ఆటోగ్రాఫ్ సినిమా గుర్తుంది...ప్రేమించిన అమ్మాయి మాటలని స్పూర్తిగా తీసుకుని ఎదిగే తొలిప్రేమ లాంటి సినిమాలు టీవిలో వస్తూనే ఉన్నాయి. కాబట్టి కొంత ప్రెష్ గా ఉన్నా...అంతా కొత్తగా అనిపించదు. అద్బుతమనిపించదు..అలాగని కొట్టిపారేయనూ లేము.

బ్యానర్ : రామలక్ష్మి సినీ క్రియేషన్స్
నటీనటులు: సుధీర్‌బాబు, నందిత, గిరిబాబు, ఎం.ఎస్.నారాయణ, సారికా రామచంద్రరావు, చిట్టిబాబు, అభిజిత్, కిషోర్‌దాస్, ఆశాలత, ప్రగతి, చైతన్య కృష్ణ తదితరులు
మాటలు: ఖధీర్‌బాబు,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,
కెమెరా:కె.ఎస్.చంద్రశేఖర్,
ఎడిటర్: రమేష్ కొల్లూరి
సంగీతం: హరి,
నిర్మాత: శిరీషా శ్రీధర్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.చంద్రు.
విడుదల తేదీ: 19, జూన్, 2015.

---------------------

పైనల్ గా... ఈ సినిమా ...క్లైమాక్స్ లో ఉన్నంత డెప్త్ సినిమా అంతా ఉంటే అద్బుతమయ్యేది. దర్శకుడు ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కాబట్టి...ఫీల్ గుడ్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం ఫస్ట్ ఛాయిస్. అలాగే... క్లీన్ గా ఉంది కాబట్టి ఫ్యామిలీలు కూడా చక్కగా వీకెండ్ లో వెళ్లి తమ గతంలో ఇలాంటి స్టోరీలు ఉంటే గుర్తు చేసుకోవచ్చు. గతంలోకి జారిపోవచ్చు.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X