twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిగెరెట్, మందు, కబుర్లు (ఎస్.ఎమ్.ఎస్ రివ్యూ)

    By Srikanya
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    సంస్థ: వేగ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
    నటీనటులు: సుధీర్‌ బాబు, రెజీనా, రోహిణి, కాశీ విశ్వనాథ్‌, వెన్నెల కిషోర్‌, భీమిలి చంటి, సంతోష్‌, రమేష్‌ తదితరులు
    మాటలు: నంధ్యాల రవి
    సంగీతం: సెల్వగణేష్
    సమర్పణ: ఆర్‌.బి.చౌదరి
    నిర్మాత: విక్రమ్‌ రాజు
    దర్శకత్వం: సత్య తాతినేని

    కొత్త హీరో ఎంట్రీ ఎప్పుడూ కత్తిమీద సామే...అయితే దాన్ని తేలిగ్గా దాటటానికి సుధీర్ బాబు తెలివైన ప్యాకేజీతో ముందుకొచ్చాడు. ఆ ప్యాకేజీలో ఓపినింగ్స్ రాబట్టడానకి మొదటి అస్త్రం సూపర్ స్టార్ మహేష్ బావ అనేది బాగా పనిచేసింది. ఇక రెండోది మంచి బ్యానర్...అదీ ఎన్నో హిట్స్ ఇచ్చిన సూపర్ గుడ్ బ్యానర్.. మూడోది మంచి కథ.. దానికి ఆల్రెడీ తమిళంలో హిట్టైన రీమేక్ ని ఎంచుకున్నారు. ఇక చివరిది స్క్రీన్ ఎట్రాక్షన్.. దానికి క్యూట్ గా ఉండే హీరోయిన్ దొరికింది. అయితే అన్నీ బాగున్నా యూత్ అంటే ప్రతీ రెండు సీన్స్ కు త్రాగుడు, సిగెరెట్స్, సొల్లు కబుర్లు చెప్పుకున్నట్లు చూపటమే చిరాకు తెప్పిస్తుంది. కొరియర్ సంస్ధలో పనిచేసే శివ(సుధీర్)కి రైల్లో శ్రుతి(రెజీనా)పరిచయమవుతుంది. మొదటి అబద్దాలతో మొదలైన ఈ పరిచయం ఆ తర్వాత ఇద్దరి అల్లరి చేష్టలతో ముందుకెళ్తుంది. అయితే శివ..శృతి మించిన అల్లరి శ్రుతిని మనస్సుకి ఇబ్బంది పెడుతుంది. అక్కడనుంచి ఆమె అతన్నుంచి విడిపోయి వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటింది. అయితే అప్పటికే ప్రేమలో మునిగిపోయిన శివ .. ఆమెను ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

    రొమాంటిక్ కామిడీ జనర్ లో నడిచే ఈ చిత్రంలో అల్లరి అబ్బాయి..అంతకంటే అల్లరి అమ్మాయి..వీరిద్దరి మధ్యా పోట్లాటలు..తర్వాత చిన్న ఎడబాటు..చివరకు ఎలా కలిసారు..అన్న బీట్స్ స్పష్టంగా ఉన్నాయి. అయితే ఫస్టాఫ్ అంతా కామెడి..కామెడీగా నడిచినా సెకండాఫ్ కి వచ్చేసరికి హీరోయిన్ వైపు నుంచి అల్లరి అనే ఎలిమెంట్ తీసేసి సీరియస్ నెస్ ని కూర్చారు. దాంతో ఒక్కసారిగా కథ టోన్ మారిపోయి.. ఇబ్బందికరంగా మారి కనెక్టివిటీ తెగిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇద్దరూ అల్లరి బ్యాచే ఎలా కలిసారు అంటే... మరో శ్రీను వైట్ల ఆనందం చిత్రంలా సూపర్ హిట్టుగా నిలిచేది. ఇది స్క్రీన్ ప్లే సమస్య.

    దీనికి తోడు ఈ సినిమా మొత్తం డైలాగుల మీద నడిచేది. అప్పటికీ నంధ్యాల రవి తన డైలాగులతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసాడు. కానీ సుధీర్ బాబు వాయిస్ డిక్షన్ సరిగా లేకపోవటంతో ఎమోషనల్ సీన్స్ పండలేదు. అలాగని అతని నటనకు వంక పెట్టలేము..మొదటి సినిమా అయినా పరిణితి చెందిన ఆర్టిస్టులాగ చేసుకుపోయాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఇలియానా పోలికలతో ఉన్న ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆమెకు పెద్ద హీరోల ప్రక్కన ఛాన్స్ లు వచ్చి నిలబడుతుందనిపిస్తోంది. ఇక హీరో ప్రెండ్ గా చేసిన భీమిలీ చంటి ..సునీల్ ప్లేస్ ని రీ ప్లేస్ చేయవచ్చు. దర్శకుడు విషయానికి వస్తే..నిజానికి ఇది రీమేక్ కావటం..ఎక్కువ భాగం తమిళంలో ఉన్నదున్నట్లు చేయటంతో ఆ క్రెడిట్ మొత్తం ఒరిజనల్ దర్శకుడుకే చెందుతుంది. ఓ పాటలో జగన్ లా ,సింహాలో బాలకృష్ణలా హీరో ని చూపటం వంటివి మాత్రం బాగా చేసి విజిల్స్ వేయించుకున్నాడు. పాటలు సోసోగా ఉన్నాయి. ఎడిడింగ్,కెమెరా ఓకే అనిపిస్తాయి.

    ఫైనల్ గా సినిమాని ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా కామిడీని ఎంజాయ్ చేద్దామనుకుంటే ఓ సారి వెళ్లచ్చు. హీరోగా సుధీర్ బాబుకి మంచి లాంచింగ్ చిత్రమే అని చెప్పచ్చు.

    English summary
    Sudheer Babu's debut film SMS released with positive talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X