Maama Mascheendra Review మూడు పాత్రల్లో సుధీర్ బాబు.. మైనస్ ఏమిటంటే? మామా మశ్చీంద్ర సమీక్ష!

Rating: 1.5/5

నటీనటులు: సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళిని రవి, హరి తేజ, హర్షవర్ధన్, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు
దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి: పీజీ విందా
ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్
రిలీజ్ డేట్: 2023-10-06

తన తల్లిని దారుణంగా చావుకు కారణమైన తన తండ్రి, సవతి తల్లిని చంపిన పరుశురామ్ (సుధీర్ బాబు) జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వస్తాడు. తన తల్లి ఆస్తిని సంరక్షించిన తన మేనమామ ఆదరించడంతో ఆయన కుమార్తెగా భావించే అమ్మాయిని పరుశురామ్ పెళ్లి చేసుకొంటాడు. ఈ క్రమంలో తమ మామ కొడుకు ప్రసాద్‌ (అజయ్)ను చంపమని తన సహయకుడు రాందాస్ (హర్షవర్థన్)‌ను ఆదేశిస్తాడు. తన పోలికలతో ఉన్న తన మామ కొడుకులు దుర్గ (సుధీర్ బాబు), డీజే (సుధీర్ బాబు) వల్ల పరుశురామ్ లైఫ్‌లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

పరుశురామ్ తన తండ్రిని, సవతి తల్లిని చంపడానికి అసలు కారణం ఏమిటి? పరుశురామ్ కూతురు విశాలాక్షి (ఇషా రెబ్బా)తో రౌడీ షీటర్ దుర్గ, తన వద్ద పనిచేసే దాసు కూతురు మీనాక్షితో డీజే (సుధీర్ బాబు) లవ్‌లో పడిన తర్వాత ఏం జరిగింది? చివరకు తన మేనలుళ్లు చేసిన హంగామా ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మామా మశ్చీంద్ర సినిమా కథ.

Maama Mascheendra Review

నటుడు, రచయిత హర్షవర్ధన్ మామా మశ్చీంద్ర కోసం సుధీర్ బాబును మూడు డిఫరెంట్ గెటప్స్‌లో చూపించాలనే తాపత్రయం తప్పా.. క్లారిటీగా కథ చెప్పాలనే తపన, మంచి స్క్రీన్ ప్లేతో కథను నడింపించాలనే ప్రయత్నం ఎక్కడా కనిపించదు. సినిమా మొత్తం కన్ఫ్యాజన్‌తో చిరాకు పెట్టించేలా ఉంటుంది. తొలిభాగం సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. ఇక సెకండాఫ్‌ అయినా బాగుంటుందా? అనే ఎదురు చూసిన వారికి నిరాశే మిగులుతుంది. చివర్లలో కొంత ఆసక్తికరమైన పాయింట్ ఉన్నప్పటికీ.. అప్పటి వరకు నీరసించిన ప్రేక్షకులకు క్లైమాక్స్ కూడా ఎక్కడం కష్టంగా మారిందనే చెప్పాలి.

Maama Mascheendra

ఇక సుధీర్ బాబు ఎలాంటి పాత్రనైనా ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తాడనే అభిప్రాయం ఉంది. అందుకు తగినట్టే.. ఈ సినిమాలో మూడు పాత్రలను తన శక్తిమేరకు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ కథలో, సన్నివేశాల్లో, తాను పోషించిన క్యారెక్టర్లలో బలం లేకపోవడం వల్ల మూడు పాత్రలు నీరసపడిపోయాయనిపిస్తుంది. ముసలితనంతో కనిపించే గెటప్ నాసిరకంగా ఉంది. ఉబకాయంతో ఉండే సుధీర్‌ను గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. ఇక సిక్స్ ప్యాక్‌తో డీజే కనిపించినా.. ఆ క్యారక్టర్‌లో దమ్మ లేకపోవడంతో ఏమీ చేయలేకపోయాడనే చెప్పాలి. ఇషా రెబ్బా, మృణాళిని రవి పాత్రలు కూడా నాసిరకంగానే కనిపించాయి. రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్ ఇతర నటీనటులను సరిగా వాడుకోలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది.

 Sudheer Babus Maama Mascheendra Movie Review and Rating

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అంతంతా మాత్రమే కనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, కలర్ ప్యాటర్న్ ఎంపిక బాగుంది. కథలో దమ్ము లేకపోయినా పీజీ విందా విజువల్ పరంగా రిచ్‌నెస్‌ను తీసుకొచ్చారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బ్యానర్ ప్రమాణాలకు తగినట్టుగా లేవు. సినిమాపై ఆశలు వదిలేసుకొని చుట్టేశారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక రిలీజ్‌కు ముందు హడావిడి కూడా పెద్దగా కనిపించకపోవడం కూడా మైనస్ అయిందా అనే అనుమానం కలుగుతుంది.

మామా మశ్చీంద్ర సినిమా విషయానికి వస్తే.. అన్ని విభాగాల్లోను విఫలమైన సినిమాగా కనిపిస్తుంది. వరుస ఫ్లాపులతో కెరీర్ కొనసాగిస్తున్న సుధీర్ బాబు ఖాతాలో మరో సినిమా చేరింది. పేలవమైన కథ, కథనాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లలేకపోయాయి. గెటప్స్ మీద ఉన్న శ్రద్ద ఇతర విషయాలపై చూపించకపోవడం పెద్ద మైనస్. మామా మశ్చీంద్ర సినిమాను థియేటర్‌లో చూడాలనుకొనే వారు.. ఓటీటీ‌లో వచ్చే వరకు ఆగి చూడండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X