For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కన్యా....( ‘కుమారి 21 ఎఫ్’ రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5

  ----సూర్య ప్రకాష్ జోశ్యుల

  సుకుమార్ లాంటి స్టార్ డైరక్టర్ కథ,మాటలు అందిస్తూ వెనుక ఉండి రూపొందిస్తున్న చిత్రం అంటే అందిరికీ ఆసక్తే. దానికి తోడు టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేస్తూండటం కూడా సినిమాపై క్రేజ్ ని పెంచేసింది. సుకుమార్ రైటింగ్స్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రం నిజానికి సుకుమార్ హాట్ రైటింగ్స్ అని పెడుతూ వస్తే బాగుండేంత బోల్డ్ గా రెడీ చేసారు. అంతవరకూ బాగుంది..ఓపినింగ్స్ కు భారీగా వచ్చిన యూత్ కు నచ్చేసింది. అయితే ఫస్టాఫ్ లో ఉన్న స్పీడు, ట్రెండీ లుక్ సెకండాఫ్ కు వచ్చేసరికి కరువైంది. లవ్ స్టోరీగా మొదలైన ఈ సినిమా ... సెకండాఫ్ కు వచ్చేసరికి హఠాత్తుగా క్రైమ్, తండ్రి సెంటిమెంట్ అంటూ జానర్ ఛేంజ్ చేసుకుని డ్రాప్ అవటం మొదలెట్టింది. అయితే క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకోవటం, యూత్ ముసుగులో బూతుని అద్దటం కలిసి వచ్చే అంశం.

  సిద్దు(రాజ్ తరుణ్) బెస్ట్ ఫ్రెండ్స్ శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). ఫ్రెండ్స్ ముగ్గురూ ఎటిఎం దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూంటే... హీరో వారికి సాయిం చేస్తూంటాడు. ఈ లోగా వారి కాలనీకి...కుమారి (హేబా పటేల్) వస్తుంది. ఆమె ఓ మోడల్. ఇప్పటి మెట్రో యూత్ కు ప్రతిబింబంగా ఉండే ఆమె ... మనస్సులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితో సోషల్ గా మూవ్ అవటం చేస్తూంటుంది. ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన సిద్దు...ఆమె బోల్డ్ నెస్, స్పీడుగా దూసుకుపోయే గుణం, సోషల్ గా మూవ్ అవటం చూసి అనుమానిస్తాడు. అతని అనుమానానికి అతని స్నేహితులు ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడి ఆజ్యం పోస్తారు. దానికి కారణం వారూ ఆమెపై కన్నేయటమే. ఈ క్రమంలో ఏం జరిగింది. అలాంటి వారితో స్నేహం చేసిన సిద్దుకు ఏం సమస్య వచ్చింది. చివరకు సిద్దు, కుమారీలు ఎలా ఒకటయ్యారు వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  Sukumar's Kumari 21F review

  వాస్తవానికి సుకుమార్ వంటి దర్శక,రచయిత నుంచి వచ్చిన అవుట్ పుట్ ఇలాంటి అడల్డ్ కంటెంట్ తో ఉంటుందని ఊహించలేం. అయితే సుకుమార్ రాసినదాన్ని అంతే సమర్దవంతంగా దర్శకుడు తెరకెక్కించినా, ఎటు చూసినా ప్రతీ ఫ్రేమ్ లోనూ సుకుమార్ మార్కే కనపడుతూంటుంది. అయితే మొదటే చెప్పుకున్నట్లు ఫస్టాఫ్ ...ఎంతో చక్కగా తను అనుకున్న దారిలో యూత్ ని కనెక్ట్ చేస్తూ....(టార్గెట్ చేస్తూ) సాగిన సినిమా..సెంకండాఫ్ వచ్చేసరికి ..జానర్ మార్చుకుని కంగారు పెడుతుంది.

  ముఖ్యంగా... ఈ కథ...హీరో,హీరోయిన్స్ లవ్ స్టోరీ నా లేక దుర్మార్గులైన స్నేహితులతో తిరిగితే వారి పరిస్ధితి అధోగతే అని దర్శకుడు చెప్పదలుచుకున్నాడా అనే డౌట్ వస్తుంది. దాంతో ఫస్టాఫ్ లవ్ స్టోరిగా ..సెకండాఫ్ లో స్నేహితులు, సమస్య చూపెట్టి దారి తప్పిస్తాడు. కాకపోతే క్లైమాక్స్ లో ఆ స్నేహితులుకు హీరో బుద్ది చెప్పటంతో కొంతలో కొంత మేలు అనిపిస్తుంది. అయితే దొంగతనాలు చేసే హీరోకు శిక్ష పడాల్సిన అవసరం లేదా...తప్పించుకు తిరగవచ్చా అనే డౌట్ కూడా వస్తుంది.

  దానికి తోడు కనెక్టు అవటం కష్టమనిపించే తండ్రి సెంటిమెంట్ ట్రాక్ ఓ ప్రక్కన కంగారుపెడుతుంది. అందులోనూ ఆ ట్రాక్ సైతం ...లాజిక్ లెస్ గా సాగుతుంది.( ఇరవై సంవత్సరాలు పాటు అదే ఊళ్లో ఉన్న తండ్రి ...ఎవరితో ఉంటున్నాడో కూడా తెలుసుకోలేని పరిస్దితుల్లో ఎదిగి వచ్చిన కొడుకు ఉండటం ఆశ్చర్యమనిపిస్తుంది. అలాగే...ప్రీ క్లైమాక్స్ లో వచ్చే హీరోయిన్ రేప్ కు గురి అవటం అనేది తమిళ సినిమాలను గుర్తు చేస్తుంది. మరీ ఇదిగా తీసారనిపిస్తుంది. నిజానికి సినిమాకు ఈ సన్నివేశం అనవసరం అనిపిస్తుంది కూడా.

  Sukumar's Kumari 21F review

  సినిమా చూపిస్తా మామ చిత్రంతో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ తన రెగ్యులర్ స్టైల్ లో ఈ సినిమా చేసుకుంటూ వెళ్లిపోయాడు. అంతేగానీ అంతకు ముందు సినిమాల్లో చూపిన ఎనర్జీ ఈ సినిమాల్లో మిస్సైంది. హేబా పటేల్ కేవలం...ఎక్సపోజింగ్ కు మాత్రమే అన్నట్లు సాగింది. ఎక్సప్రెషన్స్ నిల్. నోయల్ మాత్రం నెగిటివ్ రోల్ లో జీవించాడు. అతని టైమింగ్ కూడా బాగుంది. తాగుబోతు రమేష్, హేమ పాత్రలు చాలా బరువుగా సాగాయి.

  రచయితగా సుకుమార్..ఎందుకనో దర్శక,రచయిత మారుతిని అనుసరిస్తూ వెళ్లాడనిపిస్తుంది. తాను పెద్ద హీరోలతో చేయలేను లేదా..తాను డైరక్ట్ చేయలేను అనుకున్న సబ్జెక్టుని తన శిష్యుడు లేదా మిత్రుడు చేత డైరక్ట్ చేయించాడనిపిస్తుంది. అయితే సీనియర్ గా అతని అనుభవం క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ వద్ద పనికి వచ్చింది.

  దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు బాగున్నా, ప్లేస్ మెంట్ బాగోలేదు. అలాగే...రీరికార్డింగ్ మాత్రం చాలా సీన్లు కు ప్రాణం పోసేలా ఉంది. ఎడిటింగ్ టెక్నికల్ గా మిగతా డిపార్టమెంట్ లు సాగినంతగా ఉన్నత స్దాయిలో లేదు. రత్నవేలు పనితనం గురించి ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడుకునేదేముంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

  Sukumar's Kumari 21F review

  ఫైనల్ గా ... మెచ్యూరిటీ ముసుగులో ... వర్జినిటీ, కన్య అవునా కాదా... అనే విషయాలతో సుకుమార్ వంటి స్దాయి ఉన్న దర్శకుడు, యూత్ లో మంచి క్రేజ్ ఉన్న రచయిత సినిమాకు పూనుకోవటం ఆశ్చర్యం. ఆయన కూడా చిన్న సినిమా అదీ యూత్ ని ఆకట్టుకోవాలంటే బూతుని ఆశ్రయించాలనుకోవటం దురదృష్టమైన పరిణామం. అయితే ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాకు దేవిశ్రీప్రసాద్, రత్నవేలు వంటి టాప్ టెక్నిషియన్స్ తమ రెమ్యునేషన్స్ ని ప్రక్కన పెట్టి ముందుకు వచ్చి చేయటం చాలా మంచి విషయం. చిత్రం విషయానికి ఈ అడల్డ్ కంటెంట్ ఏ మేరకు కుర్రాళ్లకు నచ్చుతుంది అనే దానిపై సినిమా విజయం స్దాయి ఆదారపడి ఉంటుంది.

  బ్యానర్: పి.ఎ.మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్
  నటీనటులు :రాజ్‌తరుణ్, హేబాపటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు
  ఎడిటర్: అమర్‌రెడ్డి,
  ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్,
  సంగీతం: దేవిశ్రీప్రసాద్,
  ఛాయాగ్రహణం: రత్నవేలు.
  ప్రొడక్షన్ డిజైనర్:ఎస్.రవీందర్,
  పాటలు:చంద్రబోస్,
  మాటలు:పొట్లూరి వెంకటేశ్వరరావు,
  డ్యాన్స్:ప్రేమ్ రక్షిత్,
  సహనిర్మాతలు:ఎం.రాజా, ఎస్.రవికుమార్.
  నిర్మాతలు: విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి
  కథ, మాటలు,దర్శకుడు: సుకుమార్
  దర్శకుడు: పల్నాటి సూర్యప్రతాప్
  విడుదల తేదీ: 20,నవంబర్ 2015.

  English summary
  Sukumar's "Kumari 21F" released today with divide talk.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X