twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సు(త్తి)కుమారుడు(రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    హైదరాబాద్ : ప్రేమకావాలి, లవ్లీ చిత్రాలు ఫర్వాలేదనే టాక్ రావడంతో హీరో ఆది సినిమాలపై జనాల్లో మంచి ఇంప్రెషనే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆది తాజా సినిమా 'సుకుమారుడు'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. పిల్ల జమిందార్ లాంటి హిట్ చిత్రాలు తీసిన జి.అశోక్ దర్శకత్వం కావడం, ఇటీవల విడుదలైన ట్రైలర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, శారద లాంటి భారీ తారాగణం ఉండటం కూడా ఇందుకు ఓ కారణం. అయితే సినిమా మాత్రం అంచనాలకు భిన్నంగా ఉంది.

    కథ : అమెరికాలో ఉండే సుకుమార్ (ఆది) సెల్ఫిష్, మనీ మైండెడ్. వెరీ సక్సెస్ ఫుల్ లైఫ్ గడుపుతుంటాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అతనికి అత్యవసరంగా భారీగా డబ్బు అవసం పడుతుంది. ఇండియాలో తనకు వారసత్వంగా దక్కాల్సిన రూ.150 కోట్ల ఆస్తి ఉండటంతో ఇండియా వస్తాడు. తన గ్రాండ్ మదర్ వందనమ్మ(శారద) నుంచి ఆస్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంత భారీ మొత్తంలో ఆస్తి ఉన్నప్పుడు, దాన్ని దక్కించుకోవడానికి అనేక తిరకాసులు ఉండటం సహజమే. ఇక్కడ సుకుమార్ తన అంకుల్ రావు రమేష్ నుంచి ఇలాంటి తిరకాసులే ఎదుర్కొంటాడు. ఈక్రమంలో శంకరి(నిషా అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. మరి సుకుమార్ ఆ ఆస్తిని ఎలా దక్కించుకున్నాడు? తన గ్రాండ్ మదర్‌‌ను ఎలా ఒప్పించాడు? శంకరితో సుకుమార్ ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది మిగతా స్టోరీ.

    ప్లస్సులు, మైనస్‌లు : సూపర్ స్టార్ కృష్ణ, శారదలాంటి సీనియర్ స్టార్స్ నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సినిమాలో నెగెటివ్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. సినిమాను చాలా పెద్దగా సాగదీసారు. ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని కలిగించాలంటే బెటర్ స్ర్కిప్టు ఉండాలనే అంశాన్ని మరిచి, మా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చూపెట్టడానికే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చారు.

    టెక్నికల్ అంశాల పరంగా సినిమా ఎవరినీ ఆకట్టుకోలేదు. స్ర్కీన్ ప్లే చాలా బ్యాడ్‌గా ఉంది. స్క్రిప్టులో చాలా లోపాలున్నాయి. సినిమాటోగ్రఫీ జస్ట్ ఫర్వాలేదు ఓకే అనే విధంగా ఉంది. ఇక దర్శకత్వం చాలా పూర్‌గా ఉంది. ఎడిటింగ్ గురించి మాట్లాడకపోవడమే బెటర్. సరిగా నటించని కొన్ని సీన్లను బ్యాగ్రౌండ్ స్కోర్‌తో కవర్ చేయాలని చూసారు కానీ వర్కౌట్ కాలేదు.

    నటన విషయానికొస్తే...ఆది ఫర్వాలేదనిపించాడు. నిషా అగర్వాల్‌ నటించడం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదన్నట్లే ఉంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ కాలేదు. ఇతర నటీనటులు వారి పాత్రల మేరకు మమ అనిపించారు. బ్యాడ్ కామెడీ, అవసరం లేని డ్రామా చాలా ఉంది. సమయం సందర్భం లేని పాటలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. మీరు ఆదికి వీరాభిమానులైతే సినిమాకు వెళ్లండి. మీ సహనాన్ని పరీక్షించుకోవాలనే సరదా ఉన్నా వెళ్లొచ్చు!

     చూస్తే టార్చరే.. (సుకుమారుడు రివ్యూ)

    మనవడి పాత్రలో ఆది, గ్రాండ్ మదర్ పాత్రలో శారద కాన్సెప్టు బాగానే ఉంది. శారద నటన సినిమాకు బాగా ప్లస్. సెంటిమెంట్ సీన్లు చాలా బాగా పండించింది.

     చూస్తే టార్చరే.. (సుకుమారుడు రివ్యూ)

    ఆది, త్రిష మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. అయితే సాంగుల్లో మాత్రం ఫర్వాలేదనిపించారు.

     చూస్తే టార్చరే.. (సుకుమారుడు రివ్యూ)

    స్క్రీన్ ప్లే చాలా చెత్తగా ఉంది. స్క్రిప్టులోనూ చాలా లోపాలున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే, దర్శకత్వం బాగోలేదు.

     చూస్తే టార్చరే.. (సుకుమారుడు రివ్యూ)

    ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా మైనస్సులే ఉన్నాయి.

     చూస్తే టార్చరే.. (సుకుమారుడు రివ్యూ)

    ఆది అభిమానులకు కూడా రుచించడం కష్టమే

     చూస్తే టార్చరే.. (సుకుమారుడు రివ్యూ)

    యాక్షన్ సీన్లు ఫర్వాలేదు.

     చూస్తే టార్చరే.. (సుకుమారుడు రివ్యూ)

    చాలా మంది కమెడియన్లు ఉండటంతో అక్కడక్కడ నవ్వుకోవచ్చు. కొన్ని కామెడీ సీన్లు కాస్త ఓవర్ గా ఉన్నాయి. అవి కొంత మందికి మాత్రమే నచ్చే విధంగా ఉన్నాయి.

     చూస్తే టార్చరే.. (సుకుమారుడు రివ్యూ)

    బ్యానర్ : సౌదామినీ క్రియేషన్స్
    నటీనటులు: ఆది, నిషా అగర్వాల్, నీలం ఉపాధ్యాయ, సూపర్‌స్టార్ కృష్ణ, శారద, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, అజయ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు.
    ససంగీతం: అనూప్ రూబెన్స్
    కెమెరా: సాయిశ్రీరామ్
    ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి
    మాటలు: చంద్రశేఖర్ గుండిమెడ
    ఆర్ట్: రామ్
    డాన్స్: జులాయి శేఖర్
    కో ప్రొడ్యూసర్: బాబ్జీ
    సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ
    నిర్మాత: కె.వేణుగోపాల్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ జి.

    English summary
    Sukumarudu, Aadi's third movie, directed by G. Ashok released today across the world. There had been expectations from this movie because of the trailer and also because of the cast which looked apealing. The presence of Superstar Krishna and Veteran Actress Sharada was a huge plus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X