Sundaram Master Review నిర్మాతగా రవితేజ మెప్పించాడా? హర్షవైవా హిట్ కొట్టాడా? సుందరం మాస్టర్ రివ్యూ!

Rating:
2.0/5

నటీనటులు: హర్ష చెముడు, దివ్య శ్రీపాద, హర్షవర్ధన్, భద్రం తదితరులు
దర్శకత్వం: కల్యాణ్ సంతోష్
నిర్మాతలు: మాస్ మహారాజ్ రవితేజ, సుధీర్ కుమార్ కుర్ర
సినిమాటోగ్రఫి: దీపక్ యారగెరా
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
ఎడిటర్: కార్తీక్ ఉన్నవ
ఆర్ట్ డైరెక్టర్: చంద్రమౌళి
బ్యానర్: గోల్‌డెన్ మీడియా, ఆర్టీ టీమ్ వర్క్స్
రిలీజ్ డేట్: 2024-02-23

ఉత్తరాంధ్రలోని పాడేరుకు సమీపంలోని మిరియాలమిట్ట అనే గ్రామానికి అక్కడి ప్రజల కోరిక మేరకు ఇంగ్లీష్ టీచర్‌గా సుందర్ రావు (హర్ష చెముడు) వెళ్తాడు. ఆ గ్రామానికి వెళ్లడానికి ముందు ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్ధన్) అంతు చిక్కని నిధి గురించి చెప్పి.. దాని గురించి తెలుసుకోమని చెబుతాడు. అలా మిరియాలమిట్ట గ్రామంలో సుందర్ టీచర్‌‌గా అడుగుపెడుతాడు.

మిరియాల మిట్ట గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టారుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎమ్మెల్యే చెప్పిన అంతుచిక్కని నిధి రహస్యం తెలిసిందా? ఇంగ్లీష్ రాదని తెలుసుకొన్న గ్రామస్థులు సుందరంతో ఎలా బిహేవ్ చేశారు. సుందరం మాస్టార్ పరిస్థితి చివరకు ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే సుందరం మాస్టర్ సినిమా కథ.

Sundaram Master Movie Review In Telugu: Raviteja produced movie unimpressive

సమాజానికి దూరంగా విసిరి వేసిన గ్రామంలోని ప్రజలకు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. కానీ రాయడం రాదు. అలాగే ఇండియా బ్రిటీష్ పాలనలోనే ఉన్నారనే భ్రమలో బతుకుతున్న ఊరికి ఇంగ్లీష్ రావడమేనది లాజికల్‌గా మంచి పాయింట్. కానీ కథలో కొన్ని కీలక విషయాలకు లాజిక్‌ లేకుండా పోవడం ప్రేక్షకులు కనెక్ట్ కాలేదనే చెప్పాలి. ఇక స్టోరీ నేరేషన్ చాలా నిస్సత్తువగా.. ఏదో సాగిపోతున్నదనే ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఎమోషన్స్ గానీ, లేదా థ్రిల్లింగ్ పాయింట్ వెతికినా కనిపించవు. దాంతో తొలి భాగం ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపొయిందనే చెప్పాలి.

Sundaram Master Movie Review In Telugu: Raviteja produced movie unimpressive

సుందరం మాస్టరుగా వైవా హర్ష తన పాత్రలో ఒదిగిపోయాడు. స్వతహాగా ప్రతిభావంతుడైన ఆయనకు పూర్తిస్థాయిలో పెర్ఫార్మ్ చేయడానికి తన రోల్‌లో స్కోప్ లేకపోయింది. దాంతో రెగ్యులర్, రొటీన్‌గా ఆయన పాత్ర మారిపోయిందనిపిస్తుంది. ఇంకా హర్షవర్ధన్, దివ్య శ్రీపాద తమ పాత్రలకు తగ్గట్టుగా న్యాయం చేశారు.

సుందరం మాస్టర్ సినిమాకు శ్రీ చరణ్ పాకాల అందించిన మ్యూజిక్ బలంగా కనిపిస్తుంది. అలాగే దపీక్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లె అందాలను కెమెరాలో మంచిగా ఒడిసిపట్టుకొన్నాడు. కార్తీక్ ఉన్నవకు ఎడిటింగ్ విషయంలో చాలా పని ఉందని చెప్పాలి. రవితేజ, సుధరీ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టిపెడితే ఇంకా బాగుండేది. మంచి నేటివిటీతో కూడిన రూరల్ మూవీగా మారి ఉండేదనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X