పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

By Srikanya

-సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:
2.0/5
రీమేక్ అనేది ఎప్పుడూ కత్తిమీద సామే. ఒరిజనల్ లో ఉన్న ఫీల్ చెడిపోకుండా... మన నేటివిటీకి తేవటం మామూలు విషయం కాదు. తాజాగా మాధవన్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో వచ్చిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'తను వెడ్స్ మను'ని సునీల్ తో మిస్టర్ పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి రీమేక్ గా దించారు. అయితే ఈ మాస్ కోసం ముస్తాబు ఎక్కువైన ఈ చిత్రం ఒరిజినాలిటిని కోల్పోయి... కాస్సేపు కామెడీగా, మరికాస్సేపు సెంటిమెంట్ గా.. మరికాస్సేపు డల్ గా... టోటల్ గా... కష్టమనిపించాలా తయారైంది. ఇదే బ్యానర్ లో గతంలో సునీల్ తో అందాలరాముడు హిట్ కొట్టాం కదా.. అదే క్యారెక్టర్ కంటిన్యూ చేస్తే సరిపోతుందనుకున్నారేమో... దేశాలు తిరిగి వచ్చిన ఎన్నారై హీరో పాత్రను... విసిగించే అమాయికత్వంతో కూడిన పాత్రగా.. నీరసంగా మార్చేసారు. హీరోమీద జాలి పుట్టేలా చేసుకున్న ఆ సీన్స్ చూస్తూంటే.. చాలా సార్లు... మనమీద మనకు జాలి పుడుతుంది. సునీల్ సినిమా కదా కామెడీ అన్నా ఉంటుందనుకుంటే... కంగారు పుట్టేలా చేసారు.

పెళ్లికోసం ఇండియా వచ్చిన ఎన్నారై బుచ్చిబాబు(సునీల్)కి మొదటి పెళ్ళిచూపుల్లో కనపడ్డ అంజలి(ఇషా ఛావ్లా) తెగ నచ్చేస్తుంది. అయితే ఆమెకు మాత్రం ఆల్రెడీ వేరే వాడు నచ్చి ఉన్నాడు. ఆ విషయం చెప్పి.. బుచ్చి బాబుని సైడ్ అయిపోమంటుంది. సరేనని వేరే చోట్లకు పెళ్ళి చూపులకు వెళ్ళిన బుచ్చిబాబుకు ఆమే మనస్సులో ఉండటంతో అక్కడ ఎవరూ నచ్చరు. తిరిగి అమెరికా వెళ్ళిపోదామనుకునేంతలో తన స్నేహితుడు పెళ్లకి కేరళ వెళ్లాల్సివస్తుంది. అక్కడ అంజలి మళ్లీ కనిపిస్తుంది. అప్పుడేం జరుగుతుంది. చివరకు బుచ్చిబాబు తన మనస్సుకు దగ్గరైన అంజలినే పెళ్లిచేసుకున్నాడా అనేది మిగతా కథ.

మొదటే చెప్పుకున్నట్లు... రీమేక్ కొంత సేఫ్ బెట్ అయినా... రిస్క్ కూడాను. తను వెడ్స్ మనూ లో వర్కవుట్ అయింది.. సింపుల్ ఈజ్ బ్యూటి అన్నట్లు చిన్న టౌన్ అమ్మాయి కథని నేరేట్ చేయటం. ముఖ్యంగా కంగనా రనౌత్ అక్కడ తన ప్రతిభతో సినిమాని ఒంటిచేత్తో నిలబెట్టింది. అదే తెలుగుకి వచ్చేసరికి పూర్తిగా సునీల్ ని బేస్ చేసుకుని అతని వైపు అల్లిన కథగా మారింది. దానికి తోడు సునీల్ ఉన్నాడుకదా అని కామెడీ, మాస్ ఎలిమెంట్స్ చొప్పించాలనే ప్రయత్నంలో అతని పాత్ర.. ఎన్నారై... డిగ్నిఫైడ్ గా ఉండటం మెల్లిగా తొలిగిపోయి... ఓ అమాయకత్వంతో కూడిన అతి మంచివాడు కధగా తయారైంది. ఫస్టాఫ్ లో ఎత్తుగడ, కథలోకి రావటం వంటివి బాగున్నా.. ఇంటర్వెల్ దాటే సరికి మెల్లిగా కథనం డల్ అవటం ప్రారంభించి, క్లైమాక్స్ కి వచ్చేసరికి పరమ రొటీన్ డ్రామాగా మిగిలింది. హీరో మంచితనంతో అందరినీ మార్చేయటం అనే కాన్సెప్టు నవ్వు తెప్పించింది తప్ప ఇన్వాల్వ్ చేయలేకపోయింది. తెలుగులో కూడా కథను ఓ రొమాంటిక్ కామిడీగా జెంటిల్ గా, స్మూత్ గా ట్రై చేస్తే బాగుండేది.

మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

ఈ చిత్రం చూస్తుంటే అందాలరాముడు నాటి సునీలే గుర్తుకు వస్తాడు.. క్యారెక్టర్ పరంగా.. అలాగే ఇప్పటిసునీల్ కన్నా అప్పటి సునీలే ఇలాంటి పాత్రలకు ఫెరఫెక్ట్ అనిపిస్తాడు... బాడీ లాంగ్వేజ్.. బాడీతో సహా....

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

సిక్స్ ప్యాక్ బాడీతో సినిమాలో ఇంట్రడక్షన్ ఇచ్చిన సునీల్ మళ్లీ క్లైమాక్స్ ఫైట్ కే చొక్కా విప్పటం కొంతలో కొంత ఊరట. ఇక సునీల్ తరహా టైమింగ్ తో కూడిన పంచ్ లు కూడా సినిమాలో కరువయ్యాయి. వాటిమీద మరింత దృష్టి పెడితే బాగుండేది. పూలరంగడులో అవే వర్కవుట్ అయ్యాయి. అయితే డాన్స్ లలో మాత్రం సునీల్ ఇప్పుడున్న హీరోలకు పోటీ ఇచ్చాడనే చెప్పాలి.

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

హీరోయిన్ ఇషాఛావ్లాకి మాత్రం ఇది ఛాలెంజింగ్ రోల్. కానీ దాన్ని ఆమె ఛాలెంజ్ గా తీసుకున్నట్లు లేదు. సోసోగా ఉండి తేలిపోయింది.

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

అలి, ధర్మవరపు, ఎమ్.ఎస్ నారాయణ వంటి కమిడియెన్స్ చేత వారి ట్యాలెంట్ కు సరపడ కామెడీ చేయించలేదు. కామెడీని బాగా డీల్ చేయగలడు అనిపించుకున్న దర్శకుడు దేవి ఇక్కడ ఎందుకనో ఫెయిలయ్యారు. రవిబాబు పాత్ర అసలెందుకు పెట్టారో అన్నట్లు తయారైంది.

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

ఒకప్పుడు మెలోడీ పాటలకు చిరునామాగా మారిన ఎస్.ఎ రాజ్ కుమార్.. ఈ సినిమాకు మైనస్ గా మారారు. ఆయన ఈ చిత్రం కోసం చేసిన పాటల్లో టైటిల్ సాంగ్ తప్ప ఏదీ బాగోలేదు.

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

సమీర్ రెడ్డి కెమెరా వర్క్ పాటల్లో బాగున్నా.. సీన్స్ లో చాలా చోట్ల తేలిపోయింది.

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది కొరియోగ్రఫీ. పాటలు ఇరగదీసాడనే చెప్పాలి. ఇక నందమూరి హరి.. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాలి.

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

సినిమాకు పెద్ద మైనస్.. మొదటే చెప్పుకున్నట్లు స్క్రీన్ ప్లే. స్క్రిప్టు పై మరింత కుస్తీ పట్టాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ బాగా లాగ్ గా సాగుతూ పోయింది. సీన్స్ కూడా ఇంప్రెసివ్ గా లేవు.

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

ఇనుప రేకులు అంటూ టీవీ సీరియల్స్ వేసిన సెటైర్స్ బాగా పండాయి. డైలాగ్స్ ఓకే. కానీ పంచ్ మిస్సైంది. ఓ రకంగా.. ఇది ఓ పూర్ రీమేక్.

పంచె జారిన..... ('మిస్టర్ పెళ్లికొడుకు' రివ్యూ)

బ్యానర్: మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్
నటీనటులు: సునీల్, ఇషాఛావ్లా, రాఘన, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కాశీవిశ్వనాథ్, మధు, ఖలీల్, తులసి, ఉషశ్రీ తదితరులు.
సంగీతం: ఎస్.ఎ.రాజకుమార్,
ఫైట్స్: కనల్ కణ్ణన్,
కో డైరెక్టర్స్: ఎన్.బ్రహ్మాజీ, విజయ్ కుమార్,
ప్రొడక్షన్: భీమనేని రాయుడు,
కళ: ఎం.ఎస్. కుమార్,
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి,
ఎడిటింగ్: నందమూరి హరి,
సమర్పణ: ఆర్.బి.చౌదరి,
నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్,
స్కీన్‌ప్లే, దర్శకత్వం: దేవీప్రసాద్.
విడుదల తేదీ: మార్చి 1, 2013.

ఫైనల్ గా ఈ చిత్రం ఒరిజనల్.. తనూ వెడ్స్ మనూ చూసిన వారికి నచ్చటం కష్టమనిపిస్తుంది. ఫ్రెష్ గా చూసే వారికి సునీల్.. తరహా కామెడీ చిత్రం కాదనుకుని చూస్తే ఓకే అనిపిస్తుంది. అదేమీ కాదు.. సునీల్ సినిమా కదా అని... కాస్సేపు నవ్వుకోవచ్చు అని ఫిక్సై సినిమాకి వెళ్తే మాత్రం బుక్కైపోతారు.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X