Super Girl First Review: సూపర్ గర్ల్ ఫస్ట్ రివ్యూ

సూపర్ హీరో పాత్రలతో రూపొందిన సినిమాలను అందించిన డీ యూనివర్స్ నుంచి వస్తున్న సూపర్ ఉమెన్ మూవీ సూపర్ గర్ల్. ఇప్పటి వరకు డీసీ యూనివర్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు క్రేగ్ గిలెప్సీ దర్శకత్వం వహించారు. సూపర్ గర్ల్‌గా మిల్లీ ఆల్‌క్లాక్ నటించారు. మ్యాథియాస్ షూనేర్ట్స్, ఈవ్ రిడ్లీ, డేవిడ్ క్రమ్‌హోల్ట్స్, ఎమిలీ బీచమ్, డేవిడ్ కారెన్ స్వెట్, జాసన్ మామో నటించారు. ఈ సినిమాను డీసీ స్టూడియోస్ బ్యానర్‌పై జేమ్స్ గన్, పీటర్ సఫ్రాన్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: రాబ్ హార్డీ, ఎడిటింగ్: తాతియానా ఎస్ రీజెల్, ఫ్రెడ్ రస్కిన్, మ్యూజిక్: క్లాడియా సార్న్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాను ట్రోల్ కోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, ది సాఫ్రాన్ కంపెనీ బ్యానర్లపై రూపొందించారు. ఈ చిత్రం జూన్ 26, 2026 రోజున రిలీజ్‌ అవుతున్నది. ఈ చిత్రం కథ ఏమిటి? ఈ సినిమాకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఎంత? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

Super Girl Review by Censor Board

క్రిప్టన్ అనే గ్రహం విధ్వంసానికి గురవుతున్న సమయంలో జోర్ ఎల్ అనే సైంటిస్ట్ తన భార్య అలురాతో కలిసి ఆ ప్రాంతం నుంచి అదే గ్రహంలోని ఆర్గో సిటీకి వెళ్లిపోతారు. ఆర్గో సిటీ భాగం క్రిప్టన్ గ్రహం నుంచి ఓ ముక్కగా వేరు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అలురా తన తొలి బిడ్డ కారా జోర్ ఎల్‌కు జన్మనిస్తుంది. ఆర్గో సిటీలో ఉండే క్రిప్టోనైన్ అనే మినరల్ ఆ ప్రాంత పౌరులను చంపడం మొదలుపెడుతుంది. దాంతో కారాను, తమ పెంపుడు కుక్క క్రిప్టోను భూమిపైకి పంపుతారు. అక్కడే క్లార్ కెంట్ అలియాస్ సూపర్‌మ్యాన్‌ పరిచయం అవుతాడు. సూపర్ మ్యాన్ సహాయంతో కారా సూపర్ గర్ల్‌గా మారుతుంది. అయితే బ్రిగాండ్ లీడర్ క్రెమ్ ఆఫ్ ది ఎల్లో హిల్స్ దాడి నుంచి తప్పించుకొన్న చివరి బాధితుడు సూపర్ గర్ల్‌ కలుస్తుంది. దాంతో తన కుటుంబానికి బ్రిగాండ్ లీడర్ చేసిన ద్రోహం తెలుస్తుంది. దాంతో ప్రతీకారం తీర్చుకొనేందుకు సూపర్ గర్ల్ రెడీ అవుతుంది. అయితే ఎలా తన ప్రతీకారం తీర్చుకొని క్రిప్టన్ గ్రహాన్ని సొంతం చేసుకొన్నది అనేది సినిమా కథ.

యాక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్ సాగే సినిమాను సుమారుగా 170 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే 1600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో వీఎక్స్‌గ్రాఫిక్స్ పెద్ద పీట వేశారు. క్రిప్టన్ గ్రహ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు ప్రయత్నించారు. ఇలాంటి చిత్రాన్ని సెన్సార్ బోర్డు వీక్షించింది. ఈ చిత్రంలో అభ్యంతరాలు చెప్పాల్సిన సన్నివేశాలు ఏమీ లేకపోవడంతో విడుదలకు క్లీన్ చిట్ ఇచ్చారు.

సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం.. ఈ చిత్రానికి యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అంటే ఈ సినిమాను 16 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని చెప్పారు. ఈ సినిమా రన్ టైమ్ 1 గంట 49 నిమిషాలు అంటే.. 109 నిమిషాలు రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు.

ఇండియాలో కాకుండా ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సూపర్‌గా ఉంది. ఓ కామిక్ బుక్ మాదిరిగా అనుభూతిని పంచుతున్నది. ఈ సినిమాకు స్క్రిప్టు అత్యంత బలంగా ఉంది. జేమ్స్ గన్ ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు హైలెట్‌గా ఉంటాయి అని క్రిటిక్ చెబుతున్నారు. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: james gunn hollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X