twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Super Machi movie review లవ్, ఎమోషనల్ అంశాలతో కల్యాణ్ దేవ్ మూవీ.. హిట్ కొట్టాడా అంటే..

    |

    Rating: 2.5/5

    నటీనటులు: కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట తదితరులు
    రచన, దర్శకత్వం: పులి వాసు
    నిర్మాత: రిజ్వాన్
    సినిమాటోగ్రఫి: శ్యామ్ కే నాయుడు
    ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
    ఆర్ట్: బ్రహ్మ కడలి
    మ్యూజిక్: ఎస్ థమన్
    బ్యానర్: రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్ డేట్: 2022-01-14

    Super Machi movie review and Rating

    ఎలాంటి బాధ్యత లేకుండా స్నేహితులతో జల్సాగా తిరుగుతూ బార్‌లో పాటలు పాడే యువకుడు రాజు (కల్యాణ్ దేవ్). రాజును ప్రేమించానని వెంటపడుతూ తిరిగే యువతి మీనాక్షి (రచిత రామ్) ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే మీనాక్షి పిచ్చిగా ప్రేమిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా రాజు ఆమె ప్రేమను తిరస్కరిస్తుంటాడు. అయితే మీనాక్షిని వదిలించుకోవడానికి ఒక రాత్రి గడిపితే నీ ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకొంటానని కండిషన్ పెడుతాడు.

    చదువు సంధ్య లేని రాజు ప్రేమ కోసం మీనాక్షి ఎందుకు తపించింది? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? రాజును ప్రేమించడానికి కంటే ముందు చూడకుండా ప్రేమించిన వ్యక్తి ఎవరు? చూసుకోకుండానే ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన యువకుడిని ఎందుకు మీనాక్షి ఎందుకు వదులుకొన్నది? తండ్రి (రాజేంద్ర ప్రసాద్) చివరి కోరిక కోసం తన ప్రేమను త్యాగం చేసి.. రాజును పెళ్లి చేసుకోవాలనుకొన్నది? మీనాక్షిని తండ్రి కోరిన కోరిక ఏమిటి? ఇలాంటి మూడు కోణాలు ఉన్న ప్రేమకు ముగింపు ఏమిటి? మీనాక్షి, రాజు ఒక్కటయ్యారా? లేదా అజ్ఞాత ప్రేమికుడిని మీనాక్షి చేరువైందా? అనే ప్రశ్నలకు సమాధానమే సూపర్ మచ్చి సినిమా కథ.

    బార్‌లో పాటలు పాడే రాజుతో మీనాక్షి వన్ సైడ్ లవ్‌ ప్రధమార్థంలో ప్రధానమైన కథగా సాగుతుంది. రాజు తల్లిదండ్రులు (ప్రగతి, వీకే నరేష్) మధ్య ఎమోషనల్ సన్నివేశాలు కథకు ఫీల్‌గుడ్‌గా మారుతుంది. మీనాక్షి లవ్ ఎపిసోడ్ ఆసక్తిని రేపుతాయి. మీనాక్షి ప్రేమను రాజు ఎందుకు నిరాకరిస్తున్నారనే విషయం సస్పెన్స్‌గా సాగుతుంది. ఓ ఎమోషనల్ ఎపిసోడ్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది.

    ఇక సెకండాఫ్‌లో తనకు తెలియని అజ్ఞాత ప్రేమికురాలిని రాజు ప్రేమించడం కథలో సరికొత్త పాయింట్. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో రాజు తెలియకుండానే ఓ యువతిని ప్రేమించడం, అలాగే మీనాక్షి కూడా తెలియకుండానే ఓ యువకుడిని ప్రేమించడం లాంటి అంశాలు కథను ఆసక్తిగా మారుస్తాయి. సినిమా రెండో భాగంలో మీనాక్షి, తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు కథను ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. మరణానికి ముందు తండ్రి కోరిన కోరిక కోసం ప్రాణంగా ప్రేమించే యువకుడిని ప్రేమను త్యాగం చేసి రాజు కోసం సర్వం అర్పించడానికి సిద్దమైందనే పాయింట్ ఫీల్‌గుడ్‌గా మారుతుంది. క్లైమాక్స్‌లో కథకు ఇచ్చిన ముగింపు ప్రేక్షకుడికి సంతృప్తిని కలిగిస్తుంది.

    ఇక దర్శకుడు పులి వాసు ఎంచుకొన్న బేసిక్ పాయింట్ అద్భుతంగా ఉంది. కానీ ఆ పాయింట్‌ను పూర్తిస్థాయి ఎమోషనల్ లవ్ జర్నీగా మలచడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో తండ్రి (రాజేంద్రప్రసాద్), కూతుళ్ల (రచిత రామ్) మధ్య ఎపిసోడ్స్‌ను మరింత బాగా మలిచి ఉంటే మరో సుస్వాగతం లాంటి సినిమాగా మారి ఉండేదనిపిస్తుంది. కానీ రొటీన్ సన్నివేశాలు, నాసిరకమైన సీన్లు సినిమాలోని ఎమోషనల్ పాయింట్‌ను తేలికగా మార్చయానే ఫీలింగ్ కలుగుతుంది. కానీ క్లైమాక్స్‌లో దర్శకుడు చూపించిన ప్రతిభ ప్రేక్షకుల మెప్పు పొందేలా ఉంటుంది.

    బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడిగా కల్యాణ్ దేవ్ మంచి వేరియేషన్స్ చూపించాడు. అయితే దర్శకుడు కల్యాణ్ దేవ్‌లోని టాలెంట్‌ను మరింత వెలికి తీసి ఉంటే డిఫినెట్‌గా హీరోకు మంచి పేరు వచ్చి ఉండేది. రాజు పాత్రలో ఆయన ఒదిగిపోయి తగిన న్యాయం చేసేందుకు ప్రయత్నించారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. రెండో సినిమాలోనే రకరకాల ఎమోషన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ఫైట్స్, డ్యాన్సులు బాగా చేశాడు. నీవు అతడిని పెళ్లి చేసుకొంటే సీతవు అవుతావో తెలియదు కానీ.. నిన్ను పెళ్లి చేసుకొంటే అతడు రాముడు అవుతాడు అంటూ మీనాక్షికి ఆమె తండ్రి చెప్పిన డైలాగ్ కథలోని ఎమోషన్స్, లవ్‌ను చెప్పేస్తాయి.

    ఇక సినిమా భారాన్ని మొత్తం భుజాన వేసుకొని నడిపించిన మీనాక్షి పాత్రలో రచిత రామ్ ఆకట్టుకొన్నది. ఫస్టాఫ్ మొత్తం తన ప్రతిభతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అందం, అభినయంతో మెప్పించే ప్రయత్నం చేసింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లలో రచిత రామ్ నటన బాగుంది. తన పాత్ర పరిధి మేరకు తగిన న్యాయం చేసింది.

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మార్తాండ్ వెంకటేష్ కత్తెర పదును సెకాండఫ్‌లో కాస్త తగ్గిందనే చెప్పాలి. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. బ్రహ్మ కడలి ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది.

    ఇక భావోద్వేగమైన కథను ప్రేక్షకుడికి అందించాలనే తపన రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో కనిపించింది. రిజ్వాన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై రేంజ్‌లో ఉన్నాయి. కథకు, పాత్రలకు తగిన నటీనటులు ఎంపిక విధానం చూస్తే.. సినిమాపై వారికి ఉన్న అభిరుచి ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. సినిమాలో ప్రోడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడానికి ఎక్కడా రాజీ పడలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కథ, కథనాల్లో కొన్ని లోపాలను సరిదిద్దుకొంటే మంచి ప్రేమ కథ అయి ఉండేది. ఓవరాల్‌గా పండుగ సమయంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించే ప్రయత్నం చేసిన నిర్మాత రిజ్వాన్ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

    ప్రేమ, ఎమోషన్స్, ఫాదర్, డాటర్ సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్న చిత్రం సూపర్ మచ్చి. ఎలాంటి అశ్లీలత, బూతు, ద్వందార్థాలు లేని క్లీన్.. ఫెయిర్ చిత్రం సూపర్ మచ్చి. కథనం విషయాలో అక్కడక్కడా లోపాలు కనిపిస్తాయి. అది తప్పితే సినిమా ఎంటర్‌టైనింగ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే మంచి అనుభూతితో ప్రేక్షకుడు రావడం ఖాయమనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాతో కల్యాణ్ దేవ్ ద్వితీయ విఘ్నం దాటాడా? హిట్టును ఖాతాలో వేసుకొన్నాడా అనే విషయం కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

    English summary
    Young Hero Kalyan Dhev's latest movie is Super Machi. Rachita Ram is the heroine. This movie hits the screen on January 14, 2022. In this occassion, Telugu Filmibeat brings, Exclusive reveiw.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X