Super Subbu Web Series Review: సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.0/5

నటీనటులు: సందీప్ కిషన్, మానస చౌదరీ, మిథిలా పార్కర్, మురళీ శర్మ, బ్రహ్మనందం, గెటప్ శ్రీను, సంపూర్ణేష్ బాబు, గెటప్ శ్రీను, రఘుబాబు, జీవన్ కుమార్, దివ్య పిళ్లై తదితరులు
రచన, దర్శకత్వం: మల్లిక్ రామ్
నిర్మాతలు: రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపాటి
మ్యూజిక్: అనుదీప్
సినిమాటోగ్రఫి: అరోన్ కైసర్ ఆలం
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
బ్యానర్: చిలక ప్రొడక్షన్స్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-07-02

సుబ్రహ్మణ్యం చిలుకూరి రావు (సందీప్ కిషన్) అలియాస్ సుబ్బు తన తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీశర్మ) ఆంక్షలు, వేధింపుల మధ్య పెరిగి పెద్దవుతాడు. తండ్రి పోరు భరించలేక కంప్యూటర్ టీచర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఊహించని విధంగా ప్రిన్స్‌పాల్ మధుసూదన్ రావు (బ్రహ్మానందం) సలహా మేరకు మఖిపూర్ గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేరుతాడు. అప్పటికే దివ్య (మానస చౌదరీ) ఎంగేజ్‌మెంట్ అయిన సుబ్బుకు గ్రామంలో స్వాతి (మిథిలా పార్కర్) అను అమ్మాయి పరిచయం అవుతుంది.

Super Subbu Web Series Review

అయితే అత్యంత మారుమూల ప్రాంతమైన మఖిపూర్ గ్రామంలో సుబ్బుకు గ్రామస్థుల నుంచి ఎదురైన సమస్యలు ఏమిటి? గ్రామస్థుల మూఢ నమ్మకాలు మధ్య సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలను సుబ్బు ఎలా చెప్పాడు? గ్రామస్థుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమైంది. కొడుకు చేస్తున్న సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగం గురించి తెలిసిన కుక్కుటేశ్వరరావు రెస్పాన్స్ ఏమిటి? స్వాతితో పరిచయం సుబ్బులో ఏమైనా మార్పు తెచ్చిందా? స్వాతి లేదా దివ్యలో ఎవరితో పెళ్లి జరిగింది? సునీల్ (సంపూ), రజనీ (దివ్య పిళ్లై) పాత్రలు ఏమిటి? తన ఉద్యోగం వ్యవహారాన్ని దాచడానికి సుబ్బు ఎలాంటి తంటాలు పడ్డారు? చివరకు సుబ్బు లైఫ్‌లో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ కథ.

సెక్స్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్‌ పేరుతో దర్శకుడు మల్లిక్ రామ్ రాసుకొన్న కథ పూర్తిగా అవుట్ డేటేడ్ స్టోరీగా కనిపిస్తుంది. ఏ మాత్రం కొత్తదనం లేని సీన్లు, ఆకట్టుకొని కామెడీ ట్రాక్‌తో ఈ వెబ్ సిరీస్ యావరేజ్‌గా కనిపిస్తుంది. సన్నివేశాల్లో హాస్యం నేచురల్‌గా కనిపించకపోగా, అర్ఠిషియల్‌గా అనిపిస్తుంది. ఏ ఒక్క ఎపిసోడ్‌లోని కంటెంట్ కూడా కనెక్ట్ అయ్యేలా చేయదు. ప్రతీ పాత్ర కూడా అతిగా బిహేవ్ చేయడం, నాసిరకంగా క్యారెక్టర్ల బిహేవియర్ ఉండటం వల్ల వెబ్ సిరీస్‌ నేటి జనరేషన్ ప్రమాణాలకు దిగువన ఉన్నట్టు కనిపిస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, నమ్మకాలు చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నవ్వించేలా ఉండటం కొంత ఊరటగా కనిపిస్తుంది. టిల్లు స్వ్కేర్ లాంటి సినిమాను తీసిన మల్లిక్ రామ్ నుంచి ఇలాంటి కథ, కథనాలను ఊహించలేం. కనీసం ఎమోషన్స్ కూడా పూర్తిస్థాయిలో పండలేకపోయాయనే చెప్పాలి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సందీప్ కిషన్‌ను ఇప్పటి వరకు ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లలో చూశాం. కానీ సుబ్బు లాంటి పాత్రను చేయడం కెరీర్ పరంగా ఛాలెంజ్‌గానే భావించాలే. ఈ సిరీస్‌లో సందీప్ కిషన్ నుంచి కొత్తగా ఊహించుకోవడానికి పెద్దగా అంశాలేమీ కనిపించవు. కాకపోతే సుబ్బు పాత్రను బెటర్‌గా చేయడానికి సందీప్ పడిన కష్టం, అందుకోసం ఓ తపన కనిపిస్తుంది. గ్రామీణ యువతిగా హీరోయిన్ కావాలనే కోరిక ఉన్న అమ్మాయిగా మిథిలా పర్వాలేదనిపిస్తుంది. మానస చౌదరీ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది. గెటప్ సీన్, రఘుబాబు, సంపూ పాతతరం రొటీన్ కామెడీని పండించారు. మురళీశర్మ స్క్ట్రిక్ట్ ఫాదర్‌గా ఓకే అనిపిస్తారు. మిగితా పాత్రల్లో నటించిన వారు ఒకే ఒకే అనిపిస్తారు.

కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం వల్ల సాంకేతిక నిపుణులు కూడా ఎక్సలెంట్‌గా అవుట్‌పుట్ డెలివరీ చేయలేకపోయారనే చెప్పాలి. అనుదీప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. రూరల్ ఎన్విరాన్‌మెంట్‌ను సినిమాటోగ్రాఫర్ అరోన్ బాగానే క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. చిలక ప్రొడక్షన్ బ్యానర్‌పై రాజీవ్ భరత్ అనుసరించిన నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. నటీనటుల ఎంపిక బాగానే ఉంది. కానీ ఈ సిరీస్‌కు బలమైన కంటెంట్ లేకపోవడం ప్రధానమైన లోపంగా ఉంటుంది. రూరల్ కామెడీని ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్‌ను బెటర్ ఎక్సీపిరియెన్స్ కావాలనుకొంటే.. తీరిక వేళలో ఒకే స్ట్రెచ్‌లో చూడండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X