అభిమానులకు మాత్రమే 'సూపర్‌'

By Staff

Super
సినిమా: సూపర్‌
విడుదల తేదీ: 21-7-2005
నటీనటులు: నాగార్జున, ఆయేషా టకియా, అనుష్క,
సోను సూద్‌, అలీ, శాయాజీ షిండే, సునీల్‌, పియుష్‌ మిశ్రా,
షబీర్‌, ఆర్యమాన్‌, ఖయ్యూమ్‌, సుమిత్ర తదితరులు
సంగీతం: సందీప్‌ చౌటా
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె నాయుడు
కొరియోగ్రఫీ: అల్లా అమీన్‌ ఘనీ
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌
నిర్మాత: నాగార్జున అక్కినేని
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాధ్‌

'శివమణి' తర్వాత నాగార్జున- పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం 'సూపర్‌'. కొత్త తరహాగా మలచాలన్న తపన ఈ చిత్రంలో అడుగడుగునా కన్పిస్తుంది. కానీ ప్రధాన పాత్రలకు సరైన పాత్ర చిత్రణ జరగకపోవడం, హృదయాల్ని కదిలించే ఒక్క సన్నివేశం కూడా లేకపోవడంతో సినిమాలో 'ఆత్మ' లోపించి యావరేజి స్ధాయిలో ఉండిపోయింది.

కథ: అఖిల్‌ (నాగార్జున) ఒక ట్యాక్సీ షెడ్‌ ఓనర్‌. తరచుగా బైక్‌ రేసుల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంటాడు. టీవీతో అతని టాక్సీ ఎక్కబోయి టీవీ బద్దలు కొట్టుకుంటాడు పరుచూరి వెంకటేశ్వరరావు. ఆయన కూతురు సిరివల్లి (ఆయేషా తకియా) ఓ డాక్టరు. పగిలిన టీవీని రిప్లేస్‌ చేయమని ట్యాక్సీ తాళాలు తీసుకుంటుంది ఆయేషా. ఆమె అందం చూసి ముగ్దుడైన అఖిల్‌ ఆమె ప్రేమలో పడిపోయి పెళ్ళి ప్రస్ధావన తెస్తాడు. ఈలోగా పరుచూరి యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. అప్పుడామె సోనూ సూద్‌ వద్దకు వెళ్తుంది. అతను దొంగతనాలు చేసి ఎంతోకాలంగా ఆమె కుటుంబాన్ని ఆదుకుంటూ ఉంటాడు. ఆయేష్‌ అతడిని అన్నగా భావిస్తుంటుంది. అతనికి, అఖిల్‌కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ క్రమంలో ఆయేషా, అఖిల్‌ల ప్రేమాయణానికి సోను ఒప్పుకోడు.

అసలు నాగార్జున, సోను సూద్‌ ఎందుకు ద్వేషించుకుంటారంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళాలి.

నాగార్జున సోను సూద్‌ ఉద్యోగాన్వేషణలో ఓడిపోయి కలిసికట్టుగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ ఇద్దరితో పాటు సోనూ సూద్‌ చెల్లెలు అనుష్క కూడా బైకులపై వెళ్ళి 'మిషన్‌ ఇంపాజిబుల్‌' తరహా దొంగతనాల్లో పాలు పంచుకుంటుంది. ఆమెకు నాగార్జున అంటే ప్రేమ. తాను ప్రేమించడం లేదని నాగార్జున స్పష్టంగా చెబుతాడు. అది తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటి నుంచి నాగార్జునకు, సోను సూద్‌కు పడదు. ఫ్లాష్‌బ్యాక్‌ కాగానే నాగార్జునకు ఒ కొత్త నిజం తెలుస్తుంది. దానితో అతను సోనూ సూద్‌తో కలిసి ఆఖరి పోరాటానికి సిద్ధమవుతాడు. ఆ నిజం ఏమిటన్నది తెరమీద చూడాల్సిందే.

'టైమ్‌ అండ్‌ థీమ్‌' పద్ధతిలో స్క్రీన్‌ప్లే తయారు చేయడం తెలుగు సినిమాకు కొత్త ప్రయోగం. కానీ ఇంటర్వల్‌ వరకు సినిమా కథ కొద్దిగా కూడా జరిగినట్టు అన్పించకపోవడం ఈ తరహా చిత్రాల్లో మామూలే. దానితో ఇంటర్వల్‌తోనే చాలా మంది జారుకునే ప్రమాదముంది. 'సూపర్‌' దానికి మినహాయింపు కాదు. టేకింగ్‌ పరంగా సాంకేతికంగా ఉన్నత స్ధాయిలో ఉన్న ఈ చిత్రం కథ కృత్రిమంగా ఉండడం పెద్ద లోపం. పాటలు, వాటి చిత్రీకరణ 'ఎంటివీ' తరహాలో ఉండడంతో తెలుగు మాస్‌కి పట్టవు. హీరో తన స్వార్ధం కోసం దొంగగా మారడం, చట్టానికి దొరక్కపోవడం తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించదు. 'మిషన్‌ ఇంపాజిబుల్‌', 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌', 'ఇటాలియన్‌ జాజ్‌' సన్నివేశాలు మల్టిప్లెక్స్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. అలాగే హీరోకి తన ప్రియురాలి మరణం గురించిన నిజం యాధృచ్చికంగా అలీ క్యారెక్టర్‌ ద్వారా తెలియడం కథలోని లోపమే.నాగార్జున కొత్త గె టప్‌ బాగుంది. రీరికార్డింగ్‌ చాలా బాగుంది. 'మాస్‌'ని కాకుండా మల్టిప్లెక్స్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసినట్టున్న ఈ సినిమా అభిమానులకు మాత్రమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X