Superman Movie Twitter Review: సూపర్ మ్యాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ
DC కామిక్స్ నుంచి వచ్చిన అద్బుతమైన అమెరికన్ సూపర్ హీరో క్యారెక్టర్ సూపర్ మ్యాన్. డీసీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. సూపర్ మ్యాన్ సిరీస్‌లో ఇది రెండో రీబూట్ చిత్రం. సూపర్ మ్యాన్‌గా డేవిడ్ కోరెన్‌స్వెట్ నటించాడు. ఈ చిత్రంలో రాచెల్ బ్రోస్నన్, నికోలాస్ హాల్ట్, ఇడీ గాథేజీ, ఆంథోని కారిగన్, నాథన్ ఫిల్లియాన్, ఐసాబెల్లా మెర్సిడ్ తదితరులు నటించారు.
ఈ సిిమాకు హెన్రీ బ్రాహమ్ సినిమాటోగ్రఫి, విలియమ్ హాయ్, క్రెయిగ్ అల్పర్ట్ ఎడిటింగ్, జాన్ మర్పీ, డేవిడ్ ఫ్లేమింగ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా అమెరికాతోపాటు పలు దేశాల్లో జూలై 11వ తేదీన రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

DC యూనివర్స్ నుంచి వచ్చిన చిత్రాల్లో సూపర్ మ్ాన్ చిత్రం మాస్టర్ పీస్. జేమ్స్ గన్ అద్బుతంగా సినిమాను రూపొందించారు. యాక్షన్ కొరియోగ్రఫి, విజువల్స్ టాప్ రేంజ్‌లో ఉన్నాయి. మిస్టర్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్‌ను ప్రతీ నిమిషం ఎంజాయ్ చేశాను. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నేను చాలా ఎక్సైట్‌మెంట్‌తో అరిచి గొలపెట్టాలనిపించింది. ఈ సినిమాకు నా రేటింగ్ 10 పాయింట్లకు 11 ఇస్తాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
12 ఏళ్లుగా సోలో సూపర్ మ్యాన్ సినిమా కోసం ఎదురు చూశాను. ఇప్పటి వరకు వచ్చిన సూపర్ మ్యాన్ సినిమాల్లో ఇదే బెస్ట్. ఇలాంటి అద్బుతమైన సినిమాను అందించిన జేమ్స్ గన్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సూపర్ మ్యాన్ బ్యాక్. ఆ క్షణంలో ఆనందబాష్పాలు రాల్చాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సూపర్ మ్యాన్ సినిమా ఫెంటాస్టిక్. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పర్‌ఫెక్ట్‌గా ఉంది. ఆన్ స్రీన్‌పై ప్రతీ పాత్ర మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. యాక్షన్, ఎమోషన్స్, హ్యుమర్‌ను బ్యాలెన్స్ చేసిన విధానం బాగుంది. బిగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న మూమెంట్స్ వేలకొలది ఉన్నాయి. ఎవరైనా ఈ సినిమా బాగా లేదని చెబితే.. అబద్దం ఆడటం లేదా హేట్ చేయడం జరిగి ఉంటుంది అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
సూపర్ మ్యాన్ సినిమా మైండ్ లెస్‌గా ఉన్న యావరేజ్ చిత్రం. మిస్టర్ టెర్రిఫిక్, గయ్ గార్డనర్ యాక్టింగ్‌ను ఇష్టపడ్డాను. సూపర్ మ్యాన్‌గా డేవిడ్ ఓకే. రాచెల్ నటన బాగుంది. ఈ సినిమాను అప్రిషియేట్ చేయడానికి ఏమీ లేదు. యావరేజ్ సినిమాటోగ్రఫి, యావరేజ్ విజువల్స్, స్క్రీన్ ప్లే అంతా ఊహించినట్టే ఉంటుంది. ఈ సినిమా రీబూట్ అంటే జస్టిఫికేషన్ లేకుండా పోయింది. ఈ సినిమాకు నా రేటింగ్ 5 పాయింట్లకు 2.5 అని ఓ నెటిజన్ తన రివ్యూను ఇచ్చాడు.
ఇప్పటి వరకు ఎంతో మంది రైటర్లు, డైరెక్టరు రూపొందించిన సూపర్ మ్యాన్‌లో రకరకాల ఇంటర్‌ప్రెటేషన్స్ ఉంటాయి. అదే ఈ సూపర్ మ్యాన్ సక్సెస్‌కు బ్యూటీ. స్టైలిస్టిక్‌గా డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఈ కథను జేమ్స్ గన్ చెప్పిన విధానం 100 శాతం కరెక్ట్. డీసీయూల నన్ను ఎక్సైట్ చేసిన విషయం అదే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సూపర్ మ్యాన్ సినిమాలో ఈ సీన్ చూసినప్పుడు ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. నా శరీరం మొత్తం ఆనందంతో పలుకరించింది. దాంతో నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి అని ఓ నెటిజన్ ఈ సినిమా గురించి కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











