For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Surapanam movie Review ఆకట్టుకొనే శివలింగం మిస్పింగ్ డ్రామా

  |

  నటీనటులు: సంప‌త్ కుమార్‌, ప్రగ్యా న‌య‌న్‌, అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, విద్యాసాగర్, అంజి బాబు, మాస్టర్ అఖిల్ తదితరులు
  సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  సినిమాటోగ్రఫి: విజయ్ ఠాగూర్
  ఎడిటర్: జేపీ
  మాటలు: రాజేంద్రప్రసాద్ చిరుత
  సాహిత్యం: సురేష్ గంగుల, అలరాజు, దేవ్ పవర్,
  నిర్మాత: మధు యాదవ్ మట్ట,
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ కుమార్

  తెలంగాణ ప్రాంతంలోని ఓ పల్లెటూరిలో చిల్లర దొంగతనాలు చేసుకొంటూ ఫ్రెండ్స్‌తో జాలీగా జీవితాన్ని లాగించేస్తుంటాడు శివ (సంపత్ కుమార్). ఈ క్రమంలో మల్లన్న అనే బాడా బాబు శివకు ఓ మైన్‌ను తవ్వే బాధ్యతను అప్పగిస్తాడు. ఆ తవ్వకాల్లో శివుడి ప్రతిమతో కూడిన బాక్స్ లభిస్తుంది. ఆ బాక్స్‌లో చిన్న సీసాలో పానీయం కూడా ఉంటుంది. సీసాలోని ద్రవాన్ని శివ తాగుతాడు. ఇదిలా ఉండగా ఆ శివుడి ప్రతిమ అనుకోకుండా మిస్ అవుతుంది.

  సీసాలోని ద్రవాన్ని తాగిన శివకు ఏమైంది? శివుడి ప్రతిమ ఎక్కడ? ఎవరి చేతిలోకి వెళ్లింది? శివను వెంటాడిని మల్లన బ్యాచ్‌కు ఎదురైన పరిస్థితులు ఏమిటి? పానీయం తాగడం వల్ల శివకు ఎదురైన సమస్యలు ఏమిటి? హీరోయిన్‌ (ప్రగ్యా న‌య‌న్‌)‌తో లవ్ ట్రాక్ ఎలా నడిచింది? హీరోయిన్‌తో ప్రేమను ఎలా గెలిపించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే సురాపానం మూవీ కథ.

  Surapanam movie Review and Rating: sivalingam missing drama with emotional point

  దర్శకుడిగా, హీరోగా సంపత్ విభిన్న పాత్రలను పోషించాడు. ఫిక్షన్‌తో శివలింగం, సురాపానం ఎలిమెంట్స్ జోడించి రాసుకొన్న కథ బాగుంది. తొలి చిత్రమైనా అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్లతో రాబట్టుకొన్న హాస్యం సినిమాకు ప్లస్ అయింది. శివలింగం మిస్సింగ్ ఎలిమెంట్‌తో కథను నడిపించిన విధానం సినిమా మేకింగ్‌పై అతడికి ఉన్న తపనను చెప్పింది. ఇక సురాపానం తాగిన తర్వాత బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లాంటి దశలకు మారిపోవడమనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. పరిమితమైన బడ్జెట్ ఈ సినిమా క్లాలిటీకి కొంత మైనస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు విజన్‌కు తగినట్టుగా తెలంగాణ మాండలికంలో రాజేంద్ర ప్రసాద్ రాసిన డైలాగ్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి.

  Surapanam movie Review

  హీరో సంపత్ కుమార్ డైరెక్షన్‌తోపాటు ఫెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నాడు. పల్లెటూరి అమ్మాయిగా ప్రగ్యా నయన్ అందం, అభినయంతో రాణించింది. ఇక ఫిష్ వెంకట్ ఎప్పటి లానే తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పి హాస్యాన్ని పండించాడు. మీసాల లక్ష్మణ్‌ మరోసారి మంచి పాత్రతో మెప్పించాడు. అజయ్ ఘోష్ తనదైన విలనిజాన్ని పండించాడు., చమ్మక్ చంద్ర తన పాత్రల పరిధి మేరకు రాణించారు. కొత్తగా పరిచయమైన విద్యాసాగ‌ర్ ఇంగ్లీష్ సినిమాల్లో చెప్పే డ‌బ్బింగ్ తరహా డైలాగ్స్‌తో మెప్పించాడు.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. విజయ్ టాగూర్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లె వాతావరణాన్ని, మట్టి మనుషుల మూడ్‌ను ఫీల్‌గుడ్‌గా కెమెరాలో బంధించాడు. జేపీ ఎడిటర్‌గా సినిమాను పరుగులు పెట్టించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సన్నివేశాలను హైలెట్ చేశాయి. సురేష్ గంగుల రాసిన పాట ఆకట్టుకొనేలా ఉంది. నిర్మాత మధు యాదవ్ అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా మరింత క్లాలిటీగా మార్చాయి.

  శివుడు విగ్రహం, సురాపానం అనే రెండు అంశాలతో వినోదంగాను, భావోద్వేగంగా సాగే చిత్రం సురాపానం. విభిన్నమైన కథనం, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్. చిన్న చిత్రమైనా కంటెంట్ పరంగా చాలా రిచ్‌గా ఉంటుంది. రూరల్ నేటివిటితో వచ్చే చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. వారాంతంలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్త అనుభూతిని పొందాలనుకొంటే.. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన సురాపానం ఫ్యామిలితో కలిసి చూసే మంచి చిత్రమని చెప్పవచ్చు.

  English summary
  Surapanam movie hits the screens on June 10th. Here is the Telugu filmibeat review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X