Suriya's ET Movie review సూర్య ఫెర్ఫార్మెన్స్ హైలెట్.. కానీ... !
Rating 2.5/5
నటీనటులు: సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, సత్యరాజ్, శరణ్య, వినయ్ రాయ్, జయప్రకాశ్, రాజ్ కిరణ్, తదితరులు
దర్శకత్వం: పాండిరాజ్
నిర్మాత: కళానిధి మారన్
సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు
ఎడిటింగ్: రూబెన్
మ్యూజిక్: డీ ఇమామ్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్: 2022-03-10

ఈటీ మూవీ కథ..
సైంటిస్ట్‌గా కావాలనుకొన్న కృష్ణ మోహన్ (సూర్య) లాయర్‌గా సమాజంలో మహిళలపై జరిగే అక్రమాలను, అన్యాయాలను ఎదుర్కొంటుంటాడు. సాంప్రదాయ కుటుంబానికి చెందిన కృష్ణ మోహన్ తన పక్క ఊరికి చెందిన అధీరా (ప్రియాంక అరుల్ మోహన్)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. అయితే అమ్మాయిలను మాయమాటలతో లొంగ దీసుకొనే ముఠా చేతిలో లైంగిక దాడి గురైన సొంత చెల్లెలిని రక్షించుకోలేకపోతాడు.
అమ్మాయిలపై అసభ్య వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసే మంత్రి కుమారుడు (వినయ్ రాయ్) చేసే అక్రమాలను కృష్ణ మోహన్ ఎదురిస్తాడు. ఓ దశలో ఏడుగురిని కృష్ణ మోహన్ చంపివేస్తాడు.

ఈటీ మూవీలో ట్విస్టులు
లాయర్‌గా కోర్టులో న్యాయం కోసం వాదించే కృష్ణమోహన్ ఎందుకు హంతకుడిగా మారాడు. ఏడు హత్యలకు ప్రేరణగా ఎందుకు నిలిచాడు? అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే ముఠా చేతిలో తన సోదరినికి ఎలాంటి అన్యాయం జరిగింది? తన చెల్లెలే కాకుండా మోసానికి ఎంతో మంది మహిళలకు ఎలా అండగా నిలిచాడు. తన భార్యను టార్గెట్ చేసిన ముఠాకు ఎలా బుద్ది చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ET (ఎవరికి తలవంచడు) సినిమా కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?
ఈటీ సినిమా విషయానికి వస్తే.. మూవీ క్లైమాక్స్ ఏమిటనే విషయాన్ని తొలి పది నిమిషాల్లోనే లీడ్‌గా చెప్పి కథ, కథనాలపై ఆసక్తిని రేకేత్తించాడు. అయితే కథా సమస్య, పరిష్కారం ఏమిటో తెలియడంతో ఎలా ఈ కథను ముందుకు తీసుకెళ్తాడనే ఓ క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే తొలి భాగంలో రొటీన్ సీన్లు, రెగ్యులర్‌గా అతిసాధారణమైన సన్నివేశాలతో సాగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. అసలు కథలోకి తీసుకెళ్లడానికి తొలి భాగంతో టైంపాస్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌కు లీడ్ ఇస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మంచి యాక్షన్లతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.

ఈడీ క్లైమాక్స్ హైలెట్‌గా
ఈటీ సినిమా సెకండాఫ్‌లోనైనా ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయేమోనని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా, ఇప్పటికే వందల సార్లు చూసిన సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కాకపోతే చివరి 30 నిమిషాలు మాత్రం పూర్తిస్థాయి భావోద్వేగంతో సాగుతుంది. క్లైమాక్స్‌లో ఓ భారీ ఎపిసోడ్ సినిమాకు జస్టిఫై చేసే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలెట్‌గా మారుతుంది. కాకపోతే అప్పటికే సహనం హరించుకుపోవడం ప్రేక్షకుడి అవుతుంది.

దర్శకుడు పాండిరాజ్ అలా విఫలం
దర్శకుడు పాండిరాజ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఒక ఎమోషనల్ పాయింట్‌ను కథగా విస్తరించడంలో తడబాటు కనిపిస్తుంది. వినోదం, లవ్ అంశాలను ఎమోషనల్ పాయింట్‌లో జొప్పించే ప్రయత్నంలో దర్శకుడు విఫలమయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. చివరి 20 నిమిషాలు కథను డీల్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాకు కథనం మైనస్ అనిచెప్పవచ్చు. బలమైన సన్నివేశాలు లేకపోవడం, ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురిచేసే అంశాలు లేకపోవడం వల్ల సినిమా సాదాసీదాగా సాగుతుంది.

హీరో సూర్య మరోసారి..
హీరో సూర్య మరోసారి భావోద్వేగమైన పాత్రలో కనిపించాడు. అయితే కృష్ణమోహన్ పాత్ర సూర్య స్టామినాకు తగినట్టు లేకపోవడమే ఈ సినిమాకు మైనస్‌గా మారింది. రకరకాల గెటప్స్‌తో సూర్య అలరిస్తాడు. ఎమోషనల్ సీన్లలో ఎప్పటి మాదిరిగానే తన వంతు న్యాయం చేసేశాడు. బలమైన సన్నివేశాలు ఉంటే.. ఈటీ మూవీని మరో రేంజ్‌కు చేర్చి ఉండేవాడనే అభిప్రాయం కలుగుతుంది. యాక్షన్ సీన్లలో సూర్య చేసిన విన్యాసాలు సినిమాకు హైలెట్‌గా కనిపిస్తాయి.

ప్రియాంక అరుల్ మోహన్, ఇతర నటీనటుల గురించి
ఈటీ మూవీలో ఇతర నటీనటుల నటన విషయానికి వస్తే.. ప్రియాంక అరుల్ మోహన్ గ్లామర్ పరంగా, ఫెర్ఫార్మెన్స్ పరంగా పర్వాలేదనిపించింది. భార్యభర్తలుగా శరణ్య, సత్యరాజ్ మధ్య సీన్లు ఫన్ క్రియేట్ చేస్తాయి. శరణ్య మరోసారి తనదైన శైలిలో మంచి హాస్యాన్ని పండించింది. సత్యరాజ్ మరోసారి తెర మీద ఎమోషనల్ పాత్రతో ఆకట్టుకొన్నారు. వినయ్ రాయ్ విలనిజంగా పెద్దగా పండలేదు. ఈ సినిమాకు విలన్ మైనస్ అని చెప్పవచ్చు.

టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. రత్నవేలు సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సీన్ల చిత్రీకరణ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇమామ్ మ్యూజిక్ విషయానికి వస్తే.. రెండు పాటలు బాగున్నాయి. బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్‌గా అనిపిస్తుంది. రూబెన్ ఎడిటింగ్ ఒకేలా ఉంది. కొన్ని సీన్ల లెంగ్త్ తగ్గించడానికి అవకాశం ఉందనిపిస్తుంది. ఫైట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కళానిధి మారన్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ పూర్తిస్థాయిలో భావోద్వేగంగా మలిచి ఉంటే సన్ పిక్చర్స్‌కు మరో మంచి చిత్రంగా నిలిచి ఉండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగుంది.
Recommended Video

ఫైనల్‌గా ఎలా ఉందంటే..
ఆధునిక ప్రపంచంలో సాంకేతికతను ఆసరాగా చేసుకొని అమ్మాయిలను వేశ్యవృత్తిలోకి లాగడం, వారు ఎదురిస్తే.. అశ్లీల, అసభ్య వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేయడం లాంటి అనాగరిక చర్యలు భారీ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. అలాంటి కథను బేస్ చేసుకొని వచ్చిన చిత్రం ఈటీ.. ఎవరికి తలవంచడు సినిమా. తమిళ వాసనలు, మసాలు దట్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
మంచి ఎమోషనల్ పాయింట్‌ను ఆసక్తికరంగా, ప్రేక్షకుడి హృదయానికి హత్తుకొనేలా చెప్పలేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. సూర్య చిత్రాలను ఆదరించే వారికి కూడా ఈ సినిమా నచ్చడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈటీ నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











