twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jai Bhim movie Review: సూర్య అద్భుత నటన.. జ్ఞానవేల్ డైరెక్షన్ ఎలా ఉందంటే?

    |

    Rating:
    3.5/5
    Star Cast: సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, రజీషా విజయన్, లిజోమోల్ జోస్
    Director: టీజే జ్ఞానవేల్

    తమిళనాడులో జరిగిన లాక్‌డెత్, హత్య నేరారోపణలతో న్యాయవ్యవస్థలో అత్యధిక కాలం విచారణ జరిగిన కేసును ఆధారంగా చేసుకొని జై భీమ్ చిత్రం రూపొందింది. తమిళనాడులో పేద వర్గాలకు ఉచితంగా రికార్డుస్థాయిలో కేసులు వాదించిన అడ్వకేట్ చంద్రు జీవితంలోని కొన్ని సంఘటనలు తీసుకొని ఈ సినిమాను దర్శకుడు టీజే జ్ఞానవేల్ రూపొందించారు. నటి జ్యోతిక, హీరో సూర్య నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను దీపావళీ కానుకగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నటుడిగా, నిర్మాత సూర్య ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అడ్వకేట్ చంద్రు జీవితం తెరపైన ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే అసలు కథ, కథనాలు గురించి చర్చించాల్సిందే.

    జై భీమ్ కథ ఏమిటంటే..

    జై భీమ్ కథ ఏమిటంటే..

    గిరిజన తెగకు చెందిన రాజన్న పాములను పట్టే వృత్తిని జీవనధారం కోసం కొనసాగిస్తుంటాడు. గ్రామంలోని ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో పాము దూరితే దానిని చాకచక్యంగా పట్టిస్తాడు. ఆ రాజకీయ నాయకుడు ఊరు వెళ్లిన క్రమంలో ఆ ఇంట్లో దొంగలు పడటంతో రాజన్నపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే చేయని నేరాన్ని ఓప్పుకోవాలని పోలీసులు లాకప్‌లో చిత్రహింసలు పెడుతారు. ఆ తర్వాత రాజన్నతోపాటు మరో ఇద్దరు లాకప్‌ నుంచి తప్పించుకొన్నారని ఆరోపిస్తూ కేసు నమోదు చేస్తారు. అయితే తన భర్త కనిపించడం లేదని అడ్వకేట్ చంద్రు (సూర్య)ను సంప్రదిస్తారు.

    కథలో మలుపు ఏమిటంటే..

    కథలో మలుపు ఏమిటంటే..

    లాకప్‌లో రాజన్నకు ఏం జరిగింది? పోలీసుల చిత్రహింసలను భరించలేక రాజన్నతోపాటు మరో ఇద్దరు పారిపోయారా? రాజన్న కోసం కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన అడ్వకేట్ చంద్రు ఈ కేసులో తన వాదనలు వినిపించారు. ఈ కేసును ప్రభుత్వం తరఫున వాదించడానికి వచ్చిన అడ్వకేట్ జనరల్ (రావు రమేష్) చంద్రును ఎలా అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కోర్డు డ్రామాలో ఐజీ పెరుమాళ్లు స్వామి (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏమిటి? చివరకు రాజన్న ఏమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే జై భీమ్ సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    సాధారణంగా రూరల్ పోలీస్ స్టేషన్‌లో చేయని నేరాలు ఒప్పించడానికి పోలీసులు ఎవరో ఒకరిని బాధితుడిగా చేయడం లాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. తమిళనాడులో జరిగిన ఓ కేసు విచారణ, లాకప్ డెత్, పేదలు కోసం న్యాయం అందించే అంశాలతో సినిమా ఎమోషనల్‌గా మొదలువుతుంది. రాజన్న, గర్బిణిగా ఉన్న ఆయన భార్య, ఐదేళ్ల కూతురుతో కూడిన కథను ఆసక్తికరంగా మొదలువుతుంది. రాజన్నను పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ పద్దతులను ఉపయోగించే సీన్లు హృదయాన్ని పిండేలా చేస్తాయి. ఫస్టాఫ్ ఇలాంటి అంశాలతో ప్రతీ సీన్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయడమే కాకుండా ప్రతీ క్షణంఆలోచింప చేస్తుంది.

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే... చంద్రుగా సూర్య, అడ్వకేట్ జనరల్‌గా రావు రమేష్, నిజాయితీతో కూడిన పోలీస్ ఆఫీసర్‌గా ప్రకాశ్ రాజ్ ఫవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. కథను అనేక మలుపు తిప్పుతూ సినిమాను ప్రతీ ఎపిసోడ్‌కు మరో లెవెల్‌కు తీసుకెళ్తారు. రావు రమేష్, సూర్య మధ్య సన్నివేశాలు పోటాపోటీగా సాగుతాయి. ఇక ప్రకాశ్ రాజ్ పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా స్వరూపమే మారిపోతుంది. ప్రకాశ్ రాజ్ కనిపించే ప్రతీ సీన్‌ను గుండెను తట్టి లేపుతుంది. కోర్టు రూమ్ డ్రామా అద్యంతం ఆలోచింప చేస్తుంది.

    దర్శకుడి ప్రతిభ గురించి

    దర్శకుడి ప్రతిభ గురించి

    వాస్తవిక సంఘటనలను కథగా రాసుకొన్న విధానం, కథను నడిపించిన విధానం దర్శకుడు టీజే జ్ఞానవేల్ ప్రతిభకు అద్దం పట్టింది. సూర్యను కంప్లీట్‌గా పాత్రలోకి ప్రవేశపెట్టి అతడి నుంచి రాబట్టుకొన్న తీరు సినిమాకు అత్యంత బలంగా మారిందని చెప్పవచ్చు. రాజన్న లైఫ్‌స్టైల్, రొమాంటిక్ జీవితం ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇక సహజంగా చిత్రీకరించిన కోర్డు రూమ్ డ్రామా ఫుల్ ఎమోషనల్‌గా కనిపిస్తుంది. ఇటీవల వచ్చిన కోర్టు రూమ్ డ్రామా సినిమాలకు బైబిల్‌గా మారిందని చెప్పవచ్చు.

    అడ్వకేట్ చంద్రుగా సూర్య అద్భుతంగా

    అడ్వకేట్ చంద్రుగా సూర్య అద్భుతంగా

    అడ్వకేట్ చంద్రుగా సూర్య అద్భుతంగా కనిపించాడు. పాత్రకు తగినట్టుగా, సన్నివేశాలకు అనుగుణంగా చూపించిన హావభావాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతాయి. కోర్టులో చంద్రు పాత్ర బిహేవ్ చేసిన విధానం సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ప్రతీ సినిమాకు సూర్య ప్రతీసారి కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించిన తీరు నటనపట్ల ఆయన అంకితభావానికి అద్దం పట్టిందని చెప్పవచ్చు. మరోసారి సూర్య తన పాత్రలో జీవించాడని చెప్పవచ్చు.

    రావు రమేష్, ప్రకాశ్ రాజ్ పాత్రల గురించి

    రావు రమేష్, ప్రకాశ్ రాజ్ పాత్రల గురించి


    అడ్వకేట్ జనరల్ పాత్రలో రావు రమేష్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా కనిపించింది. ప్రకాశ్ రాజ్ నిజాయితీ ఆఫీసర్‌గా తన పాత్రలో చెలరేగిపోయాడు. ఈ రెండు పాత్రలు సినిమా బలంగా మారాయి. రాజన్న పాత్ర, ఆయన భార్య ఇతర పాత్రల్లో నటించిన వారు గొప్ప అనుభూతిని పంచుతారు. సూర్యతో కలిసి రజీషా విజయన్, రాజన్న భార్యగా లిజోమోల్ జోస్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

    టెక్నికల్ విభాగం పనితీరు

    టెక్నికల్ విభాగం పనితీరు

    సాంకేతిక విభాగానికి వస్తే.. ఎస్ఆర్ కదిర్ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సీన్లనే కాకుండా మున్నార్ లాంటి ప్రదేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. సీన్ రోల్డాన్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా సిట్యుయేషన్ తగినట్టుగా ఉంటాయి. కొన్ని పాటలు హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది.

    Recommended Video

    Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    నిర్మాతలుగా, సూర్య, జ్యోతిక పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వాస్తవ సంఘటనలను పరిశోధన చేసి కథ, కథనాలుగా మలిచిన తీరుతోనే సినిమా సక్సెస్ బాట పట్టింది. ఇక పాత్రలకు తగినట్టుగా నటీనటుల ఎంపిక సినిమాకు మరో సక్సెస్ ఫార్మూలాగా మారింది. గ్రామీణ వాతావరణం నేపథ్యంగా రూపొందించిన సన్నివేశాలు అతిసన్నిహితంగా ఉన్నాయి. సూర్య నటన, భావోద్వేగమైన కథతో కొత్త అనుభూతిని పొందాలనుకొనే వారు జై భీమ్ సినిమాను తప్పకుండా చూడాలనేది ఫిల్మీబీట్ స్ట్రాంగ్ రికమండేషన్.

    English summary
    Jai Bhim Tamil language legal drama film directed by T. J. Gnanavel and produced by 2D Entertainment. The film stars Suriya, with Prakash Raj, Rajisha Vijayan, Lijomol Jose, Rao Ramesh and K. Manikandan in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X