twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతు 'పట్టని'సినిమా (సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ రివ్యూ)

    By Staff
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: ఆస్కార్‌ ఫిలిమ్స్‌
    నటీనటులు: సూర్య, సమీరారెడ్డి, దివ్య, సిమ్రన్‌ తదితరులు.
    కెమెరా: రత్నవేలు
    ఆర్ట్ : రాజీవన్
    నిర్మాత: వి.రవిచంద్రన్‌
    దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవమీనన్‌
    రిలీజ్ డేట్: 14 నవంబర్ 2008

    ఒక జీవితాన్ని మొత్తాన్ని ఓ మూడు గంటలు సినిమాలో చూపెట్టడం కష్టమే. పోనీ ఎలాగోలా తిప్పలు పడి చూపించినా ఊహించని మలుపులు,ఎంటర్ టైన్ మెంట్ లేని ఆ సాదా సీదా జీవిత సారాన్ని భరించటం మరీ కష్టం. అదే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తేల్చి చెప్పిన సత్యం. అయితే గజనీ ఫేమ్ సూర్య డబుల్ రోల్ లో నటించటం,కాక కాక (ఘర్షణ) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందిచిన గౌతమ్ మీనన్ డైరక్టర్ కావటం,దశావతారం వంటి భారీ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన సినిమా కావంటం ఈ ఫిల్మ్ కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాయి. కానీ విపరీతమైన భావోద్వేగాలు స్లో నేరేషన్ తో నడిచే కథనం ఉన్న ఈ సినిమా చూడాలంటే టిక్కెట్టు రేటుతో పాటు గొప్ప ఓపిక కూడా ఉండాల్సిందే.

    సూర్య (సూర్య)కి తన తండ్రి(మళ్ళి సూర్యానే) అంటే విపరీతమైన ఆరాధన. ఆయన్ని ఓ హీరోలా, ఐకన్ లా చూస్తూంటాడు. అలాగే అతని తల్లి(మాలిని) కూడా నెమ్మదస్తురాలు,కుటుంబానికి మూలస్ధంబంలా ఉంటుంది. అతనికో చెల్లెలు. ఇలా ఫ్రెండ్స్ లా ఉండే ఫ్యామిలి మెంబర్స్ నీడలో ఏదీ అసాధ్యం కాదు అనే కాన్సెప్ట్ జీర్ణించుకుని సూర్య పెరిగి పెద్దవుతాడు. టీనేజ్ లోకి రాగానే తొలిచూపులోనే మేఘన(సమీరా రెడ్డి)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె అతనికి అనుకోకుండా మిస్సయిపోతుంది. అది తట్టుకోలేని సూర్య డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతాడు. అప్పుడు ఆ తల్లి తండ్రులు ఆ బిడ్డను ఎలా రక్షించుకున్నారు. తిరిగి అతను జీవితంలో పడి ఏం సాధించి సంపూర్ణతను సాధించుకున్నాడనేది మిగతా కథ.

    జీవితం ఓ సర్కిల్ లాంటిది...ఎక్కడా ఆగదు...మన భాధ సంతోషాలతో దానికి సంభందంలేదు. ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది అన్న విషయం చెప్పటానికి గౌతమ్ మీనన్ నిజాయితీగా చేసిన ఈ ప్రయత్నం నవల రూపంలో అయితే గ్యారింటీగా ఆదరణ పొంది ఉండేది. అదే సినిమా అనే సరికి కొంత డ్రామా,ట్విస్టులు,కామిడీ ఊహించుకోవటం సహజం. ఆ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవటం నిరాశ పరిచే అంశం. అందులో సినిమా దాదాపు మూడు గంటలు ఉండటం కూడా పూర్తిగా ఇబ్బంది పెడుతుంది. అలాగే కథనాన్ని యాక్ట్ లుగా విభజన చేసేటప్పుడు మరింత జాగ్రత్త పడి ఉండాల్సింది. అలా చేయకపోవటంతో తండ్రి కొడుకుల అనుభంధంగా మొదలైన కథ, ఫెయిల్యూర్ లవ్ స్టోరి గా నడిచి,జీవితం ఓ చక్రం లాంటిది అనే కాన్సెప్ట్ తో ముగియటం జరిగింది.

    ఇక దర్శకుడుగా టేకింగ్,షాట్ డివిజన్ విషయాల్లో గౌతమ్ మీనన్, వెలుగు నీడల్ని భావాలకి తగ్గట్లుగా చూపటంలో కెమెరా మెన్ పోటి పడి మరీ మంచి మార్కులే వేయించుకుంటాడు. నిర్మాణ విలువల్లో కూడా ఎక్కడా రాజీపడకపోవటం ఆస్కార్ రవిచంద్రన్ అభినందించాల్సిన అంశం. అయితే ఎన్నుకున్న కథ,కథనాలు సినిమాకు పనికొచ్చేవి కాకపోవటం తో ఆ శ్రమ మొత్తం నిష్ఫలమయింది.

    సంగీతం గురించి మాట్లాడుకోవాలంటే నిజానికి హరీష్ జయరాజ్ ఎప్పుడూ నిరాశపరచలేదు. ఈ సినిమాలో కూడా ఓ ట్యూన్ సినిమా నుండి బయిటకు వచ్చాక కూడా వెంటాడుతుంది. అలాగే అరవైలనాటి సంగీతాన్ని గుర్తుచేసే ట్యూన్స్,ఎనభైలనాటి రాక్ మ్యూజిక్ మంచి ప్రయోగమనిపిస్తాయి. నటులుగా ఈ సినిమా సూర్య షొ అని చెప్పాలి. సిమ్రాన్ కూడా తన వయిస్సుకు తగ్గ పాత్రల్లో జీవించింది. సమీరా రెడ్డి మేఘన గా లవ్ లీగా కనిపిస్తే...దివ్య స్పందన అనే అమ్మాయి ప్రియ గా క్యూట్ గా ఉంది.

    కుటుంబ సంభందాలు,జీవన ప్రయాణం చర్చించే ఈ సినిమా అక్కడక్కడా ఏక్షన్ ఎపిసోడ్స్,ఎమోషన్ సన్నివేశాలు బోల్డన్ని,సూర్య సిక్స్ పాక్ బాడీ ఉన్నా ఆకట్టుకోవటం కష్టమే. అలాగే సిగెరెట్లు త్రాగితే సూర్య తండ్రికి ఈ సినిమాలో థ్రోట్ కాన్సర్ వస్తుంది. అయితే ఈ విషయాన్ని కళ్ళారా చూస్తున్నా...సినిమా ఎంత బోర్ అనిపిస్తుందంటే సిగెరెట్ కి మధ్యలో పదే పదే లేచి వెళ్ళాలనిపిస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X