twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Suvarna Sundari Review థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సస్పెన్స్ డ్రామా.. జయప్రద, అంజలి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating: 2.5/5

    నటీనటులు: జయప్రద, సాయి కుమార్, పూర్ణ, సాక్షి చౌదరీ, కోటా శ్రీనివాసరావు, అవినాష్, సత్య ప్రకాశ్ తదితరులు
    దర్శకత్వం: సురేంద్ర మాదారపు
    నిర్మాత: ఎంఎల్ లక్ష్మీ
    సమర్పణ: ఎంవీకే రెడ్డి
    ఎడిటర్: ప్రవీణ్ పూడి
    సంగీతం: సాయి కార్తీక్
    సినిమాటోగ్రఫి: ఎల్లు మహంతి
    బ్యానర్: టీమ్ పిక్చర్స్
    రిలీజ్ డేట్: 2023-02-03

    వందల ఏళ్ల చరిత్ర కలిగిన త్రినేత్రి అమ్మవారి విగ్రహాన్ని ఓ రాజు ఆదేశాల మేరకు కంసాలి తయారు చేస్తాడు. రెండు కళ్లు మూసుకొని.. మూడో నేత్రం తెరుచుకొని ఉండటం ఆ విగ్రహం ప్రత్యేకత. ఆ విగ్రహం నిత్యం రక్తదాహాన్ని కోరుకొంటుంది. దాంతో ఆ ప్రాంతంలో వినాశనం తప్ప.. ప్రయోజనం ఉండదు. ఆ విగ్రహం కారణంగా అంజలి (పూర్ణ) తోపాటు లక్షలాది మంది బలైపోతారు.

    Suvarna Sundari Review

    త్రినేత్రి విగ్రహం రక్తదాహానికి కారణం ఏమిటి? కంసాలి అలాంటి విగ్రహాన్ని ఎందుకు తయారు చేశాడు? అలాంటి విగ్రహం వినాశానికి విశాలక్షి (జయప్రద) ఎందుకు అడ్డుకట్ట వేయాలని అనుకొంటుంది. ఈ కథలో సాక్షి (సాక్షి చౌదరీ)కి సంబంధమేమిటి? విగ్రహం చేసే రచ్చను అడ్డుకోవడానికి పోలీస్ అధికారి గుణ (సాయికుమార్) ఏం చేశారు? అనే ప్రశ్నలకు సమాధానమే సువర్ణ సుందరి సినిమా కథ.

    సువర్ణ సుందరి చిత్రం సస్పెన్స్‌, థ్రిల్లర్ అంశాలతోపాటు ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెకకింది. దర్శకుడు సురేంద్ర ఎంచుకొన్న పాయింట్.. దాని చుట్టు అల్లుకొన్న పాత్రలను ఆసక్తికరంగా కనిపిస్తాయి. సువర్ణ సుందరి విగ్రహం దుష్టశక్తిగా మారి చేసే విధ్వంసం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. ఫస్టాఫ్ ఎమోషనల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండి.. సెకండాఫ్‌లో ఆ విగ్రహం అలా బిహేవ్ చేయడానికి కారణమైన అంశాలను రివీల్ చేయడం బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది.

    సువర్ణ సుందరి సినిమాలో అంజలిగా పూర్ణ రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. ఫ్లాష్ బ్యాక్‌లో సంప్రదాయంగా, రెగ్యులర్ సీన్లలో ఆధునిక యువతిగా గ్లామర్‌తోపాటు ఫెర్ఫార్మెన్స్ ప్రదర్శించి ఆకట్టుకొన్నదని చెప్పవచ్చు. జయప్రద ఓ కీలకమైన పాత్రలో మరోసారి ఆకట్టుకొన్నది. తన అనుభవాన్ని రంగరించి సినిమాకు వెన్నుముకగా నిలిచింది. సాయికుమార్ తనదైన శైలిలో పోలీస్ ఆఫీసర్‌గా చెలరేగిపోయాడని చెప్పవచ్చు. కోట శ్రీనివాసరావు, నాగినీడు, అవినాష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు.

    సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ ఎట్రాక్షన్. మహంతి అందించిన సినిమాటోగ్రఫి తెర మీద కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ పలు సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సినిమాను క్రిస్పీగా ఉండటమే కాకుండా సీన్లు చకచకా సాగిపోతాయి. ఎంఎల్ లక్ష్మీ, ఎంవీకే రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    చారిత్రాత్మక బ్యాక్ డ్రాప్‌తో విజువల్ ఎఫెక్ట్స్‌ జోడించి చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ సువర్ణ సుందరి. విభిన్నమైన కథ, కథనాలు సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి. జయప్రద, అంజలి, సాక్షి చౌదరీ, సాయికుమార్ యాక్టింగ్ సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నించాయి. దాదాపు 40 నిమిషాలపాటు సాగే విజువల్ ఎఫెక్ట్స్ కొత్త అనుభూతిని కలిగిస్తాయి. చిన్న సినిమా అయినప్పటికీ.. భారీ బడ్జెట్ సినిమా చూశామనే థ్రిల్లింగ్ కలిగిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే తప్పుకుండా ప్రేక్షకుడు సంతృప్తికరంగా బయటకు వస్తారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

    English summary
    Actress Jayaprada, Anjali, Sakshi Chowdary, Sai kumars latest film is Suvarna Sundari. directrd MSN Surya. This film hits the screens on February 3rd. Here is the Telugu filmibeat's exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X