Suzhal Season 2 Review: సుడల్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

వెబ్ సిరీస్: సుడల్ 2 సీజన్
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, కథిర్, లాల్, శరవణన్, అమిత్ భార్గవ్, గౌరీ జ ీ కిషన్, మంజిమా మోహన్ తదితరులు
రచన, క్రియేషన్: పుష్కర్, గాయత్రి
దర్శకత్వం: సార్జున్ కేఎం
మ్యూజిక్: సామ్ సీఎస్
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
సినిమాటోగ్రఫి: అబ్రహం జోసెఫ్
ప్రొడక్షన్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్: 2025-02-28

సోదరి మృతికి కారణమైన గుణను హత్య చేసిన కేసులో నందిని (ఐశ్వర్య రాజేశ్) జైలులో శిక్ష అనుభవిస్తుంటుంది. ఆమెను కేసు నుంచి తప్పించడానికి ఇన్‌స్పెక్టర్ చక్రి (కథిర్), లాయర్ చెల్లప్ప (లాల్) ప్రయత్నిస్తుంటారు. కేసు నుంచి నందిని బయటపడుతుందని భావిస్తుండగా లాల్ అనూహ్యంగా హత్యకు గురవుతాడు. లాల్ హత్య కేసు విచారణ బాధ్యతను చక్రీకి పోలీస్ డిపార్ట్‌మెంట్ అప్పగిస్తుంది.

Suzhal  The Vortex Web Series Review in Telugu  Aishwarya Rajesh steals the Show

చెల్లప్ప అనుమానాస్పద మరణం వెనుక ఉన్నది ఎవరు? చక్రీ విచారణ ఎలా కొనసాగించాడు? చెల్లప్ప గదిలో ఉన్న ముత్తు (గౌరీ జీ కిషన్)ను పోలీసులు ఏం చేశారు? చెల్లప్ప హత్యతో మరో ఏడుగురు అమ్మాయిలకు సంబంధం ఉందా? లాయర్ చెల్లప్ప హత్యకు గురయ్యాడని తెలిసిన నందిని ఎలా రియాక్ట్ అయింది? చెల్లప్పను హత్య చేసింది ఎవరు? జైలు నుంచి నందిని బయటపడిందా? అనే ప్రశ్నలకు సమాధానమే సుడల్ 2 సీజన్ వెబ్ సిరీస్ కథ.

జైలులో శిక్ష అనుభవిస్తున్న నందిని కోణంలో వెబ్ సిరీస్‌ ప్రారంభమవుతుంది. కోర్టులో చెల్లప్ప, చక్రీ చేసే ప్రయత్నాలు, ఈ కేసు వాదనల నేపథ్యంగా సాగుతుంది. అయితే చెల్లప్ప హత్య వెబ్ సిరీస్ కథ మలుపు తిరుగుతుంది. చెల్లప్ప మరణానికి కారణాలు ఏమిటనే కోణంలో పోలీసుల దర్యాప్తు, అనుమానితులపై కన్నేసి దర్యాప్తు సాగించడం మొదలవుతుంది. కొద్ది రోజుల్లోనే జైలు నుంచి రిలీజ్ అవుతానని అనుకొంటున్న నందిని చెల్లప్ప మరణ వార్తతో మరింత దిగాలుపడిపోతుంది. సీజన్ 2 కావడంతో సీజన్ 1 సన్నివేశాలను, ఆ సీజన్‌లో ఏం జరిగిందనే విషయాలను వివరంగా చెప్పడం వల్ల కొంత బోరింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఫ్రెష్‌గా చూస్తున్న వారికి కొత్త అనుభూతికి గురి చేస్తుంది.

వెబ్ సిరీస్ కావడంతో సుడల్ 2లో కూడా ఎక్కువ డీటైయిలిటీ ఉంటుంది. కాకపోతే ట్విస్టులతో సాగే కథనం కారణంగా మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. దర్శక ద్వయం బ్రహ్మ, సర్జన్‌లు కథ చెప్పిన విధానం, మహిళా జైలులో జరిగే తతంగాన్ని వారు చెప్పిన విధానం ఆసక్తిని పెంచుతుంది. జైలులో నిందితుల అవస్థలు, ఖైదీలతో పోలీసులు వ్యవహరించే తీరు, వివక్ష, వేధింపులు చాలా వివరంగా చూపించే ప్రయత్నం చేయడం ఈ సీజన్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది. 8 మంది మహిళల చుట్టూ కథను దర్శకులు మరింత ఆసక్తిగా తెరకెక్కించారని చెప్పవచ్చు.

నందినిగా ఐశ్వర్య రాజేష్ ఫెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకు తగినట్టుగా ఆహార్యం, బాడీ లాంగ్వేజ్‌ను ఒంటికి పట్టించుకొని నటించారు. కథిర్‌తో ఉన్న సన్నివేశాల్లో డ్రామాను బాగా ఎలివేట్ చేశారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. కథిర్, శరవణన్, లాల్ తమ పాత్రల పరిధి మేరకు రాణించి ఈ వెబ్ సిరీస్‌కు బలంగా మారారు. ఇతర పాత్రల్లో నటించిన వారందరూ తన రోల్స్‌కు న్యాయం చేశారు.

ఈ వెబ్ సిరీస్‌కు సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణ. పలు సన్నివేశాలను ఇంటెన్స్‌గాను, ఎమోషనల్‌గా మార్చి బాగా ఎలివేట్ చేశాడు. ఇక అబ్రహం జోసెఫ్ చిత్రీకరించిన సన్నివేశాలు అత్యంత సహజ సిద్దంగా ఉన్నాయి. జైలులో ఖైదీలు, పోలీసుల మధ్య ఉండే వాతావఱణం, జాతర సన్నివేశాలు చిత్రీకరణ బాగుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సుడల్ సీజన్ 1 అన్ని వర్గాలను, అన్ని భాషల ప్రేక్షకులను ఆలరించింది. పాత్రలను డిజైన్ చేసిన విధానం.. సన్నివేశాల రూపకల్పన భారీ బడ్జెట్ సినిమాను తలపించేలా ఉంటాయి. ఐశ్వర్య రాజేశ్, కథిర్, లాల్ తదితరుల నటన సిరీస్‌కు ప్రాణంగా నిలిచింది. తగినంత సమయం చూసుకొని ఒకే స్ట్రెచ్‌లో వెబ్ సిరీస్ చూస్తే.. థ్రిల్లింగ్, ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ను మిస్ చేసుకొంటే.. మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను కోల్పోయినట్టే. కాబట్టి తీరిక వేళలో ఈ వెబ్ సిరీస్‌పై కన్నేయండి..

More from Filmibeat

Read more about: aishwarya rajesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X