twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యమ నీరసం... ( 'యమలీల 2' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5
    అద్బుతాలు ఒక్కసారే జరుగుతాయి. వాటిని రిపీట్ చేయటం కష్టం... అలాగే... సీక్వెల్స్ ...చాలా సార్లు ఒరిజనల్ కి ఈక్వెల్ గా కాదు కదా...దగ్గరకు కూడా వెళ్ళవు అని మరోసారి ప్రూవ్ చేయటానికి ఎస్వీ కృష్ణా రెడ్డి నిర్ణయించుకుని ఆ దిశగా గట్టిగా ప్రయత్నించినట్లున్నారు. ఓ హాస్యనటుడిని హీరోగా మార్చి, యమ ఫార్ములాతో మాయ చేసిన ఘనత ఎస్వీ కృష్ణారెడ్డిది. అలీ హరోగా ప్రమోషన్‌ దక్కించుకొన్న 'యమలీల' ఎంత సందడి చేసిందో మనకందరికీ గుర్తే. ఇప్పుడు ఆ చిత్రానికి రెండో భాగం 'యమలీల 2' అంటూ సిద్దం చేసారు. అయితే ఒరిజనల్ లో ఉన్న మ్యాజిక్ ఇక్కడ వర్కవుట్ కాలేదు. 'యమలీల' కి స్ట్రాంగ్ కామెడీ, రేసీ గా ఉండే స్క్రీన్ ప్లే ప్లస్ అయితే ఇక్కడ అవే మైనస్ అయ్యాయి. అయితే అక్కడక్కడా కొన్ని జోకులు పేలటం, గ్రాఫిక్స్ ప్లస్ అయ్యాయి.

    యమలీల లాగేనే... చిత్ర గుప్తుడు(బ్రహ్మానందం) మరోసారి భవిష్యవాణిని యముడుతో మానససరోవరానికి వచ్చినప్పుడు పోగొట్టుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాల మేరకు...ఆ పుస్తకాన్ని వెతకటానికి భూలోకానికి బయిలుదేరతారు. ఈ లోగా ఆ పుస్తకం హీరో క్రిష్(సతీష్)కు దొరుతుంది. లుకేమియా కాన్సర్ మీద రీసెర్చ్ చేస్తున్న అతను ...సంజీవిని మూలికలు కోసం అక్కడకి వచ్చి ఉంటాడు. పుస్తకం దొరికిన అతను ఆ పుస్తకంలో తన భవిష్యత్ చూసి షాక్ అవుతాడు. ఆ పుస్తకం అతని వద్ద నుంచి యముడు, చిత్ర గుప్తుడు సంగ్రహించాలని చూస్తారు. మరో ప్రక్క స్టెఫిన్స్(ఆషిష్ విద్యార్ధి) తన స్టెఫిన్స్ ఫార్మిటికల్స్ కంపెనీ కోసం హీరో చేస్తున్న రీసెర్చ్ ఫలితం కోసం వెనక పడుతూంటాడు. అసలు హీరో కాన్సర్ పై రీసెర్చ్ ఎందుకంత సీరియస్ గా చేస్తున్నాడు... ఇందులో హీరోయిన్ ఆనంది (దియా నికోలస్) పాత్ర ఏమిటి...చివరకు ఏమైందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    వంకాయకూర బాగుంది అన్నారు కదా అని ...దాన్నే దాచి రెండో రోజు కూడా అదే వడ్డిస్తే కష్టం కదా..అదే పరిస్ధితి ఈ సీక్వెల్ కీ దాపురించింది. వాస్తవానికి యమలీల వచ్చిన నాటి ప్రేక్షకులుకు ఇప్పటి ప్రేక్షకులకు చాలా మార్పు వచ్చేసింది. అయితే ఎస్పీ కృష్ణా రెడ్డి మాత్రం మారలేదు. ఆయన కదా మారలేదు. యమలీలలో భవిష్యవాణి పుస్తకం...ఆలికి దొరుకుతుంది...తర్వాత ఏమయ్యింది..తల్లి సెంటిమెంట్ తో నడిస్తే...ఇక్కడ చిత్ర గుప్తుడు స్వయంగా భవిష్యవాణిని హీరోకు ఇస్తే అతన్ను దాన్ని పట్టుకుని జంప్ అవుతాడు. అక్కడ నుంచి అతన్ని వెతకటం... పాప సెంటిమెంట్...పెద్ద తేడాలేదు. జోకులు కూడా అప్పటివే కొన్ని రిపీట్ చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసారు. దాంతో కథలో ఆసక్తిలేకుండా పోయింది.

    దేవాంతుడు సినిమాని మళ్లీ అదే ఎన్టీఆర్ తో యమగోల అని చేసినప్పుడు చాలా మార్పులు చేసారు. కేవలం కాన్సెప్టు తీసుకుని అద్బుతంగా పండించారు. దాంతో అదే హీరో చేసినా ఘన విజయం సాధించింది. అంటే కాలంతో పాటు మారిన ప్రేక్షకులు అణుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అప్పటి సినిమా పెద్దలే గమనించి, ఆ యమగోల అప్పటి సామాజిక పరిస్ధితులను,రాజకీయాలను సైతం చొప్పించి యమలోకంలో గోల గోల చేసి అద్బుతం అనిపించారు. యమలీల సీక్వెల్ కు అది మిస్సైంది. ఎస్వీ కృష్ణా రెడ్డి తన మ్యాజిక్ ని పూర్తిగా కోల్పోయారు అని చెప్పలేం కానీ..ఆయన మ్యాజిక్ ఇప్పటి తరానికి ఇంకా అప్ డేట్ కావాల్సి ఉంది అనిపించింది.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

    ప్లస్ లు...

    ప్లస్ లు...

    ఈ సినిమాకు అందరూ ఊహించినట్లుగానే మోహన్ బాబు, బ్రహ్మానందం ప్లస్ అయ్యారు. దర్శకుడు వారినే బ్యాంకింగ్ చేసుకుని రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగానే వర్కువుట్ అయ్యాయి. అయితే యమదొంగ రేంజి కామెడీని ఆశించవద్దు. అలాగని వీళ్లు కూడా లేకపోతే ఈ అవుట్ డేటెడ్ కాన్సెప్టుని చివరి వరకూ భరించటం కష్టం.

    పెద్ద మైనస్

    పెద్ద మైనస్

    హీరో,నిర్మాత అయిన కె.వి సతీష్ లో నటించాలన్న ఉత్సాహం ఉంది కానీ నటన లేదనిపించింది. అతను ఇదే ఫీల్డులో కొనసాగాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకుని రావాలి. లేకపోతే ఇలాంటి సినిమాలే నాలుగైదు తీసి...వాటినే ట్రైనింగ్ అనుకోవాలి..అంతేకానీ జనాలు చూడాలనుకోకూడదు.

    పెద్దగా పట్టించుకోలేదు..

    పెద్దగా పట్టించుకోలేదు..

    యమలీల లో ఇంద్రజ స్క్రీన్ సమయం ని సగం ఆక్రమిస్తుంది. అదే ఇక్కడ హీరోయిన్ కు అసలు సీన్లు లేవా, లేక ఎడిటింగ్ ఎత్తి పడేసారా అనే డౌట్ వచ్చేలా అసలు ప్రాధాన్యత లేకుండా సాగుతాయి. సదా ఐటం సాంగ్ మాత్రం కాస్త హాట్ గా ఉంది.

    సెకండాఫ్ కొట్టేసింది..

    సెకండాఫ్ కొట్టేసింది..

    ఈ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్ చెప్పాలంటే సెకండాఫ్ అని చెప్పాలి. అలాగే సాంగ్ ల ప్లేస్ మెంట్ కూడా దారుణంగా ఉంది. దానికి తోడు చాలా స్లోగా నడిచే నేరేషన్. పాతకాలంనాటి ట్విస్ట్ లుతో నీరసం తెప్చించింది. ఫస్టాఫ్ లోనూ కొంత బలవంతపు కామెడీ చేయించినా ఓకే అనుకున్నా సెకండాఫ్ ఇబ్బందిపెట్టేసారు. దానికి తోడు ట్విస్ట్ రివీల్ అయ్యాక కథనం చాలా ప్రెడిక్టుబుల్ గా ఉంది. మోహన్ బాబు కూడా ఏమీ చెయ్యలేని పరిస్దితి.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    VFX వర్కు బాగుంది. అలాగే హిమాలయాలను కూడా అద్బుతంగా చూపించారు. గ్రాఫిక్స్ లో సదా సాంగ్ కూడా బాగుంది. అయితే కేవలం గ్రాఫిక్స్ చూడటానికే ఎవరూ వెళ్లరు కదా అని అడగొద్దు.

    సంగీతం

    సంగీతం


    గతంలో ఎస్వీ కృష్ణా రెడ్డి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడంత సీన్ లేకపోయినా..బాగున్నాయి.

    కెమెరా,ఎడిటింగ్

    కెమెరా,ఎడిటింగ్

    కెమెరా వర్కు బాగుంది. అయితే ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మోహన్ బాబు, బ్రహ్మానందం మధ్య రాసిన డైలాగులు సైతం బాగా నవ్వించాయి. పాత్రలకు తగిన డైలాగులు రాయించుకున్నారు.

    ఎవరెవరు..

    ఎవరెవరు..



    బ్యానర్: క్రిస్వీ ఫిలిమ్స్‌
    సినిమా: యమలీల-2
    నటీనటులు:మోహన్‌బాబు, డాక్టర్ కేవీ.సతీష్(తొలిపరిచయం), దియా నికోలస్(తొలి పరిచయం), బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సదా, నిషాకొఠారి, ఆశిష్‌విద్యార్థి, తాగుబోతు రమేష్ తదితరులు
    కెమెరా: శ్రీకాంత్ నారోజ్,
    మాటలు: గంగోత్రి విశ్వనాథ్, భవానీ ప్రసాద్,
    ఎడిటింగ్:గౌతంరాజు,
    నిర్మాత:ఆశా సతీష్,
    కథ, స్క్రీన్‌ప్లే,సంగీతం,దర్శకత్వం: ఎస్‌వి.కృష్ణారెడ్డి
    విడుదల తేదీ: 28 నవంబర్, 2014
    ----------

    ఫైనల్ గా ఎస్వీ కృష్ణారెడ్డి, యమలీల సీక్వెల్ అంటే జనం ఆశించేది ఏమీటి ...క్లీన్ కామెడీ..కూసింత సెంటిమెంట్ అంతే. అయితే కామెడీ క్లీన్ గానే ఉంది కానీ...క్లీన్ చేసేస్తే మిగిలినట్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంది. అదీ అవుట్ డేటెడ్ గా. కామెడీకు ప్రత్యేకమైన ఛానెల్స్, జబర్ధస్త్ వంటి పోగ్రామ్ లు వచ్చాక ఆ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అలరించటం కష్టమే.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)


    ఫైనల్ గా ఎస్వీ కృష్ణారెడ్డి, యమలీల సీక్వెల్ అంటే జనం ఆశించేది ఏమీటి ...క్లీన్ కామెడీ..కూసింత సెంటిమెంట్ అంతే. అయితే కామెడీ క్లీన్ గానే ఉంది కానీ...క్లీన్ చేసేస్తే మిగిలినట్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంది. అదీ అవుట్ డేటెడ్ గా. కామెడీకు ప్రత్యేకమైన ఛానెల్స్, జబర్ధస్త్ వంటి పోగ్రామ్ లు వచ్చాక ఆ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అలరించటం కష్టమే.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Director S.V. Krishna Reddy is all set to make a comeback to movies through Yamaleela 2, which is released today with divide talk. Yamaleela 2 is a fantasy drama, inspired by his own earlier movie Yamaleela (1994). This socio-fantasy film stars Dr. K. V. Satish, DiahNicolas, Dr. M Mohan Babu, Dr. Brahmanandam, etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X