Swag Movie Review: స్వాగ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
టైటిల్: స్వాగ్ మూవీ రివ్యూ
నటీనటులు: శ్రీ విష్ణు, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, రీతూ వర్మ, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు
రచన, దర్శకత్వం: హసిత్ గోలి
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
మ్యూజిక్: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: జీఎం శేఖర్
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
రిలిజ్ డేట్: 2024-10-04
పోలీస్ ఆఫీసర్ అయిన భవభూతి (శ్రీ విష్ణు) తన భార్య (మీరా జాస్మిన్) కు పిల్లలు పుట్టకుండా అడ్డుకొంటుంటాడు. దాంతో అతడిని విడిచి వెళ్లిపోతుంది. తాను అమితంగా ప్రేమించే భార్య వెళ్లిపోవడంతో ఓ రకమైన డిప్రెషన్‌లో వెళ్లిపోతాడు. అలాంటి సమయంలో శ్వాగనిక వంశానికి వారసుడు కావడం వల్ల వారికి సంబంధించిన సంపదను సొంతం చేసుకోవాలనే లెటర్ వస్తుంది. అది చాలా ఉత్తేజంగా అనిపించడంతో తన వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వెళితే.. అక్కడ తాము కూడా వారసులమంటూ కొందరు వస్తారు.

భవభూతి ఎందుకు తన భార్యకు పిల్లలు కనకుండా గర్బస్రావం చేయించే నీచమైన పనికి ఒడిగడుతాడు? శ్వాగనిక వంశంలో ఏం జరిగింది? వారి వారస్వత్వ సంపదకు దూరం చేసే శాపం ఏమిటి? 1551లో రాణి వింజామర ఆధిపత్యం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? రాణి నుంచి భర్త భవభూతి (శ్రీ విష్ణ)) అధికారాన్ని చేజిక్కించుకొన్నాడు? యయాతి (శ్రీ విష్ణు) ఎవరు? యయాతికి కుటుంబ నియంత్రణ పాటించకుండా ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు? చివరకు తాను చేసిన తప్పుడు పనులకు భవభూతి స్వయంగా ఎలాంటి శిక్షను విధించుకొన్నాడు? సింగ (శ్రీ విష్ణు), అనుభూతి (రీతూ వర్మ) ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే శ్వాగ్ సినిమా కథ.
16వ శతాబ్దంలో మాతృస్వామ్యాన్ని నిలబెట్టాలనే వింజామర వంశానికి చెందిన రాణి తన పురుషులను నీచంగా చూడటం, పుట్టిన మగ పిల్లల్ని చంపడమే ఒక ఎమోషనల్ పాయింట్‌తో కథను అద్బుతంగా హసిత్ గోలి ఆలోచించాడు. అయితే అలాంటి పాయింట్‌ను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. కానీ పూర్తిస్థాయిలో ఆ సినిమా కథను తెర మీద క్లారిటీగా చెప్పడంలో మిస్ అయ్యాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో సింగ పాత్ర యూట్యూబర్ పాత్రతో ఫన్ క్రియేట్ చేసి.. ఇంటర్వెల్ వరకు మంచి ఎమోషనల్ పాయింట్‌తో అసలు కథలోకి వెళ్లాడం కొంత పాజిటివ్ అనిపిస్తుంది.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. వారసత్వ సంపదకు సంబంధించిన కాన్‌ఫ్లిక్ట్‌కు వచ్చే సరికి దర్శకుడు తడబాటుకు గురయ్యాడు. సింగ, భవభూతి, అనుభూతి, యయాతి పాత్రలన్నీ జొప్పించడంతో కథలో ఏం జరుగుందో అర్ధం కాని పరిస్థితితో కన్‌ఫ్యూజన్ ఎక్కువగా క్రియేట్ అయిందనిపిస్తుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సినిమా వరకు నడిపించిన డ్రామా హృదయాన్ని కట్టిపడేస్తుంది. ఆడ, మగ, ట్రాన్స్‌జెండర్ అనే తేడా లేకుండా మనం మనుషులం అని చెప్పిన పాయింట్ ఈ సినిమాకు మంచి జస్టిఫికేషన్, ఓ సందేశంగా ఉంటుంది.
రాజా భవభూతి, రికార్డింగ్ డ్యాన్సర్ యయాతి, ఇన్స్‌పెక్టర్ భవభూతి, యూట్యూబర్ సింగ పాత్రలతోపాటు భావోద్వేగానికి గురిచేసే మరో పాత్రలో శ్రీ విష్ణు చెలరేగిపోయాడు. ఐదు పాత్రలను డిఫరెంట్‌గా నటించడంతోపాటు పాత్రలకు తగినట్టు యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలవరీతో కింగ్ ఆఫ్ కంటెంట్ అనిపించుకొన్నాడు. ఈ సినిమాకు శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు.

ఇక శ్వాగ్ సినిమాతో మీరా జాస్మిన్ అద్బుతంగా నటించడమే కాకుండా ఆ క్యారెక్టర్ ద్వారా ఎమోషన్‌కు గురి చేస్తుంది. మీరా జాస్మిన్ పాత్ర ఈ సినిమాకు మరో ఎత్తు.. అలాగే రీతూ వర్మ కూడా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో తన సత్తా ఏమిటో చూపించింది. ఇక దక్ష నగార్కర్ గ్లామర్‌పరంగా రాణిస్తే..శరణ్య ప్రదీప్ సూపర్బ్ పాత్రతో అందర్నీ కట్టిపడేస్తుంది. సునీల్, రవిబాబు, గోపరాజు పాత్రలు కూడా సినిమాకు అత్యంత బలంగా మారాయి. రవిబాబు తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందారనే చెప్పాలి. మిగితా పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు కూడా అద్బుతంగా తెరపైన కనిపించారు.
ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకు వివేక్ సాగర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు సన్నివేశాలకు గ్రాండియర్‌గా ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని ముందే క్లియర్ చేసుకొంటే ఇంత కన్‌ఫ్యూజన్ ఉండేది కాదేమో అనిపించింది. ఎప్పటీలానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మంచి నిర్మాణ విలువలను పాటించింది. టీజీ విశ్వప్రసాద్ అభిరుచికి అద్దం పట్టేలా ఈ సినిమా ఉంది.



Click it and Unblock the Notifications











