Swag Twitter Review: స్వాగ్ ట్విట్టర్ రివ్యూ.. శ్రీ విష్ణు హిట్టు కొట్టాడా?
యువ హీరో శ్రీ విష్ణు, సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్, యువ హీరోయిన్ దక్షా నగార్కర్, శరణ్య నటించిన చిత్రం స్వాగ్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రానికి రాజ రాజ చోర మూవీ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహించారు.
అచ్చ తెనుగు సినిమా అనే టైటిల్‌తో ఈ మూవీ అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతకు ముందెన్నడూ చూడని చిత్రం స్వాగ్. దర్శకుడు హసిత్ గోలి మంచి కాన్సెప్ట్‌ను మంచి స్క్రీన్ ప్లేతో ఎలాంటి లోపాలు లేకుండా తెరకెక్కించారు. నాలుగు విభిన్నమైన పాత్రలతో ఆ క్యారెక్టర్లకు తగినట్టుగా డబ్బింగ్ చెప్పి ఆకట్టుకొన్నారు. శ్రీ విష్ణు అద్బుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు అని నెటిజన్ పేర్కొన్నారు.
స్వాగ్ సినిమా చూశాను. శ్రీ విష్ణు తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు కలెక్షన్లతోపాటు అవార్డు కూడా రావడానికి అవకాశం ఉన్న సినిమా. హసిత్ గోలి తెలుగు సినిమాకు దొరికిన వరం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
స్వాగ్ ఫస్టాప్ చూశాను. మూవీ చాలా హిలేరియస్‌గా ఉంది. తెలుగులో ఓ కొత్త జోనర్. శ్రీ విష్ణు కంటెంట్ ఆఫ్ కింగ్. ఈ సినిమా నాకు బాగా నచ్చింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇది శ్రీ విషు గాడి సినిమా, ఇది హసిత్ గోలి సినిమా. ఇండియన్ సినిమాలో ఓ డేరింగ్ అటెంప్ట్. 5 డిఫరెంట్ టైమ్ లైన్‌లో ఐదు డిఫరెంట్ స్టోరీలతో హసిత్ గోలి అద్బుతంగా తెరకెక్కించారు. ఈ అచ్చ తెలుగు సినిమాను చూసి గర్వపడుతున్నాను అని ఓ నెటిజన్ అన్నాడు.
తెలుగులో అరుదుగా వచ్చే సినిమా కథ ఇది. హసిత్ గోలి రాసిని ఈ కథను ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకొంటారు. ప్రతీ పాత్రను శ్రీ విష్ణు అద్బుతంగా పోషించాడు. కమల్ హాసన్‌ను మరోసారి గుర్తు చేశాడు. ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
స్వాగ్ ఫస్టాఫ్ ఒకేలా ఉంది. సెకండాఫ్ ఎటో వెళ్లిపోతుంది. కానీ దర్శకుడు హసిత్ గోలిపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన నిరాశ పరచరనే అభిప్రాయం నాకు ఉంది. కాస్త వెయిట్ చేయండి.. పూర్తి రివ్యూ ఇస్తాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు మరోసారి మంచి చిత్రంతో వచ్చాడు. రాజ రాజ చోర తర్వాత నా ఫేవరేట్ కాంబో ఇది. ఈ సినిమా చూస్తే సీరియస్ కంటెంట్‌తో మంచి పాయింట్ ఉందనిపిస్తుంది. ఒకవేళ ఆ పాయింట్‌ను 2.30 గంటల్లో చెప్పగలిగితే మాత్రం వారి సక్సెస్‌ను ఎవరు కూడా ఆపలేరు. స్వాగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నా అని నెటిజన్ అన్నాడు.
స్వాగ్ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. దయచేసి ఎవరూ కూడా రివీల్ చేయవద్దు అని శ్రీవిష్ణు రిక్వెస్ట్ చేశారు. మంచి మూమెంట్స్ ఉంటాయి. అమెరికాలోనే కాకుండా యూఎస్, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది అని తెలిపారు.
స్వాగ్ సినిమా రిలీజ్ డేట్ కంటే ఒక రోజు ముందే అమెరికాలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్లు నార్త్ అమెరికాలో భారత కాలమానం అక్టోబర్ 3వ తేదీ రాత్రి ప్రారంభం అవుతాయి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండటంతో క్రేజీగా మారింది.


Click it and Unblock the Notifications











