twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వామి - సమీక్ష

    By Staff
    |

    Swamy
    చిత్రం: స్వామి
    నటీనటులు: హరికృష్ణ, మీనా, ఆమని, ఉమ,
    రాజీవ్‌ కనకాల, జయప్రకాష్‌రెడ్డి, చలపతిరావు, మోహన్‌రాజ్‌ తదితరులు
    సంగీతం: కీరవాణి
    కథ, మాటలు: పోసాని కృష్ణమురళి
    నిర్మాత: ఆర్‌.కె.భగవాన్‌, తేజ
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఆర్‌.ప్రతాప్‌

    హరికృష్ణ 'సీతయ్య', 'టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌'లాంటి అట్టర్‌ఫ్లాఫ్‌ చిత్రాల తర్వాత మరో సాధారణ చిత్రాన్నే అందించాడు. గుంటూరులో జరిగిన ఓ నిజమైన ఘటన ఆధారంగా కథ రూపొందించినట్లు పోసాని కృష్ణమురళి ప్రకటించినప్పటికీ, ఆయన ట్రేడ్‌మార్క్‌ ఛీఫ్‌ డైలాగ్స్‌, రోటీన్‌ కథనంతోనే సినిమా సాగింది. హరికృష్ణ భావావేశాల ప్రదర్శన బాగానే ఉన్నా, ఆయన నటనకు ఊతం ఇచ్చే కథ, కథనం లేదు. పగ, ప్రతీకారం అనే ఫార్మూలా కథకు చెల్లెలు సెంటిమెంట్‌, భర్త చెల్లెలను పెంచడం కోసం భార్య (మీనా) తన గర్భాశయాన్ని తొలగించుకోవడం వంటి దృశ్యాలు మరీ తమిళ సినిమాల మాదిరి రోటీన్‌ పద్దతి. మరీ నాసిరకం సినిమా ఇది.

    వేణుగోపాల స్వామి ముద్దుగా స్వామి (హరికృష్ణ) రైస్‌ మిల్‌ యజమాని. ఆయనకు ఇద్దరు కవల చెల్లెల్లు(ఉమ). వీరిని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో స్వామి భార్య(మీనా) తన గర్భాశయాన్ని తొలగించుకొంటుంది. మెడికల్‌ కాలేజ్‌లో చదువుతోన్న సీత(ఉమ)ని హౌస్‌ సర్జెన్‌ చేస్తోన్న ఆనంద్‌(రాజీవ్‌ కనకాల) ప్రేమిస్తున్నట్లు నమ్మించి, ఆమెను మోసగించి అనుభవిస్తాడు. సీత సోదరి (మళ్ళీ ఉమనే)తో కూడా అదే నాటకం ఆడాలని ప్రయత్నించి విఫలమవుతాడు. తన ప్లాన్‌ బయటపడడంతో, వారిద్దరిని వేటాడి కిరాతకంగా చంపేస్తాడు. స్వామి దంపతులు దీంతో షాక్‌కు గురై, న్యాయం కోసం పోరాడి విఫలమవుతారు. అప్పుడు స్వామి తన 'విశ్వరూపాన్ని' ప్రదర్శించి, ఆనంద్‌, ఆయన తండ్రి (జయప్రకాష్‌ రెడ్డి), ఇంకా ఇతరులను చంపి కక్ష తీర్చుకోవడం మిగతా కథ..

    హరికృష్ణ ఆవేశపూరితమైన నటన బాగానే ఉంది. కానీ ఆయన డైలాగ్స్‌ నాసిరకంగా ఉన్నాయి. పోసాని రూపొందించిన ఈ కథ ప్రస్తుతానికి టాపికల్‌ అనే చెప్పాలి (శ్రీలక్ష్మి, మనోహర్‌ కేసు ఉదంతం నేపథ్యంలో). కానీ ఆయన ప్రతిదాన్ని 'అతి' చేయడం మానుకోవడం మంచిది. అంత 'అతి'ని తట్టుకోవాలంటే సామాన్య ప్రేక్షకులకు చాలా నిబ్బరం కావాలి. మీనా ఓకే. ఆమని పాత్ర స్వల్పం. కీరవాణి సంగీతం మోస్తారుగానే ఉంది. వి. ఆర్‌.ప్రతాప్‌ మరోసారి విఫలమయ్యాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X