twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Swathi Muthyam Review.. ఫుల్ ఫన్.. సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

    |

    Rating:
    3.0/5
    Star Cast: Bellamkonda Ganesh Babu, Varsha Bollamma, VK Naresh, Rao Ramesh, Vennela Kishore
    Director: Lakshman K Krishna

    నటీనటులు: వర్ష బొల్లమ్మ, బెల్లంకొండ గణేష్ బాబు, వెన్నెల కిషోర్, ప్రగతి, సురేఖవాణి, వీకే నరేష్, సుబ్బరాజు, గోపరాజు రమణ, దివ్య శ్రీపాద, శివన్నారాయణ, హర్షవర్ధన్ తదితరులు
    రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కే కృష్ణ
    నిర్మాత: నాగవంశీ సూర్యదేవర
    మ్యూజిక్: సూర్య
    ఎడిటింగ్: నవీన్ నూలి
    ఆర్ట్: అవినాష్ కోల్ల
    బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా
    రిలీజ్ డేట్: 05-10-2022

    స్వాతిముత్యం కథ ఏమిటంటే?
    పిఠాపురం పట్టణానికి చెందిన బాలమురళీకృష్ణ అలియాస్ బాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లిదండ్రుల చాదస్తం కారణంగా పెళ్లి కుదరక ఇబ్బంది పడుతుంటాడు. ఓ పెళ్లిచూపుల్లో భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ను చూసి ప్రేమలో పడుతాడు. రకరకాల సమస్యలను దాటుకొని వారి ప్రేమ.. పెళ్లీ పీటల వరకు వస్తుంది. పెళ్లికి కొద్ది గంటలకు ముందు.. శైలజ (దివ్య శ్రీపాద) అనే యువతి ఓ తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి.. ఈ బాబు నీ కుమారుడు అని బాల చేతిలో పెడుతుంది.

    స్వాతిముత్తం సినిమాలో ట్విస్టులు
    పెళ్లికి కొద్దిగంటల ముందు తన జీవితంలో చోటు చేసుకొన్న సమస్య కారణంగా బాల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇంతకు శైలజ ఎవరు? శైలజ తీసుకొచ్చిన బిడ్డ ఎవరు? శైలజ తీసుకొచ్చిన బాబు నిజంగా బాలాకు పుట్టిన బిడ్డేనా? కాబోయే భర్తకు ముందే బిడ్డ ఉన్నాడనే విషయం తెలిసిన భాగ్యలక్ష్మి పరిస్థితి ఏమిటి? తమ అల్లుడికి పెళ్లికి ముందే బిడ్డ ఉందని తెలిసిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు (సురేఖవాణి, నరేష్), పెదనాన్న (గోపరాజు రమణ) రియాక్షన్ ఏమిటి? పెళ్లికి ముందే తమ కొడుకు బిడ్డను కన్నాడని తెలిసిన బాలా తల్లిదండ్రులు (ప్రగతి, రావు రమేష్) పరిస్థితి ఏమిటి? శైలజకు వచ్చిన కష్టానికి ఎలాంటి పరిష్కారం లభించింది? కాబోయే భర్త విషయంలో భాగ్యలక్ష్మి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? చివరకు బాల, భాగ్యలక్ష్మి ప్రేమ పెళ్లిపీటలకు ఎక్కిందా? అనే ప్రశ్నలకు సమాధానమే స్వాతిముత్యం సినిమా కథ.

    Swathi Muthyam

    ఫస్టాఫ్ కొంత స్లోగా..
    యుక్తవయసులోనే ఉద్యోగం సంపాదించిన బాలమురళీకృష్ణ పెళ్లి చేసుకోవడానికి తంటాలు పడే అంశంతో కథ మొదలవుతుంది. తొలి 30 నిమిషాలు సినిమా స్లోగా సాగుతూ.. సాగదీసినట్టు అనిపిస్తుంది. బాలా, భాగ్యలక్ష్మి ప్రేమ పకాన పడిన తర్వాత కథలో వేగం పుంజుకొంటుంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించి.. వివాహ గడియలు సమీపిస్తున్న సమయంలో శైలజ ఎంట్రీతో కథ కంప్లీట్ టర్న్ తీసుకొంటుంది. ఫస్టాఫ్‌లో చిన్న ట్విస్టుతో ముగియడమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాల పెంచుతుంది.

    సెకండాఫ్.. హిల్లేరియస్ కామెడీ
    సెకండాఫ్‌లో పెరిగిన అంచనాలకు తగినట్టే.. వేగవంతమైన స్క్రీన్ ప్లే.. నటీనటులు ఫెర్ఫార్మెన్స్ సినిమాను పరుగులు పెట్టిస్తుంది. అమాయకత్వంతో కూడిన గణేష్ నటన, ఎమోషనల్‌గా వర్ష బొల్లమ క్యారెక్టర్ల చుట్టూ.. గోపరాజు రమణ, నరేష్, రావు రమేష్, వెన్నెల కిషోర్, శివన్నారాయణ, సుబ్బరాజు పాత్రలు చేసిన వినోద అల్లరి కథకు, సినిమాకు బలంగా మారింది. వర్ష బొల్లమ్మ (భాగ్యలక్ష్మి) హాస్పిటల్‌కు వెళ్లిన సీన్‌తో సినిమా ఫుల్లుగా భావోద్వేగాలకు గురిచేస్తుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కుదిపేస్తాయి. ఓవరాల్‌గా చిరునవ్వుతో, కొంత భారమైన హృదయంతో ప్రేక్షకుడు వచ్చేలా స్వాతిముత్యం ముగుస్తుంది. నూతన దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణ ప్రతిభకు ఈ సినిమా సాక్ష్యంగా నిలిచింది.

    తొలి చిత్ర హీరోగా గణేష్
    నటీనటుల విషయానికి వస్తే.. బెల్లంకొండ గణేష్ బాబు.. హీరోగా ఎంట్రీ ఇస్తూ.. భారీ అంచనాలు తనపై పెట్టుకొకుండా.. ఫీల్‌గుడ్ క్యారెక్టర్‌తో కెరీర్‌ను మొదలపెట్టడం మంచి నిర్ణయంగా కనిపిస్తుంది. మాస్ ఫైట్లు, ఫారిన్‌లో పాటలు.. పంచ్ డైలాగ్స్ జోలికి పోకుండా.. స్వచ్ఛమైన తెలుగు కథను ఎంచుకోవడం గణేష్ ఫ్యూచర్ ఎజెండా ఏమిటో స్పష్టం చేసింది. అమాయకత్వం, నిజాయితీతో కూడిన బాల పాత్రలో గణేష్ ఒదిగిపోయాడు. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్లలో ఎక్స్‌ప్రెషన్స్ బాగా పలికించాడు. కొన్నిసార్లు నటనపరంగా కొంత తడబాటు కనిపించింది. అయితే తొలి సినిమాతో మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ చూపించడం గణేష్ కెరీర్‌కు పాజిటివ్‌గా మారింది.

    వర్ష బొల్లమ్మ మరోసారి ఎమోషనల్ పాత్రతో
    మిగితా పాత్రల విషయానికి వస్తే.. వర్ష బొల్లమ్మ సెకండాఫ్‌ను తన భుజాలపై మోసిందని చెప్పవచ్చు. సింపుల్, సెన్సిబుల్‌ పాత్రలో వర్ష ఒదిగిపోయింది. సినిమా చివరి 30 నిమిషాల్లో తన ఫెర్ఫార్మెన్స్‌తో కథను, కథలోని ఎమోషన్స్ తనవైపుకు తిప్పుకొన్నది. ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే.. గోపరాజు రమణ పాత్ర సినిమాకు అత్యంత బలం.. తనదైన శైలిలో మంచి హాస్యాన్ని పండించాడు. వీకే నరేష్ గమ్మత్తైన ఎక్స్‌ప్రెషన్స్‌తో విభిన్నమైన కామెడీని పండించాడు. విలక్షణమైన నటనతో రావు రమేష్ మరోసారి చెలరేగిపోయాడు. తనదైన మేనరిజమ్స్, యాస, భాష, హావభావాలతో సినిమాకు హైలెట్‌గా నిలిచాడు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హర్షవర్ధన్ పండించిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమాలోని అన్ని పాత్రలు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌గా నిలిచాయి.

    Swathi Muthyam

    టెక్నికల్ అంశాల గురించి
    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మార్చింది. సెకండాఫ్‌లో మాంటేజ్ సాంగ్స్ బాగున్నాయి. సూర్య అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. కలర్ ప్యాటెర్న్ సినిమాను మరింత రిచ్‌గా మార్చేసింది. నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది. మిగితా విభాగాల పనితీరు కూడా బాగుంది.

    ఫైనల్‌గా స్వాతిముత్యం గురించి
    వీర్యదానం అనే ఎమోషనల్ పాయింట్ చుట్టూ కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలతో అల్లుకొన్న చిత్రం స్వాతిముత్యం. మన ఇంటిలో జరిగే సంఘటనలు.. మన కుటుంబంలో ఉండే మనుషుల మధ్య సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ సెకండాఫ్‌లో కథను డీల్ చేసిన విధానం..కథను నడిపించిన తీరు.. పాత్రలను డిజైన్ చేసిన తీరు సినిమాను సక్సెస్ బాటలో నడిపించడానికి దోహదపడ్డాయి. పండుగ సమయంలో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వినోదాన్ని ఆస్వాదించానికి ఆస్కారం ఉన్న చిత్రం స్వాతిముత్యం.

    బలం, బలహీనతలు
    ప్లస్ పాయింట్స్
    నటీనటుల పెర్ఫార్మెన్స్
    కథ, కథనాలు
    ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
    డైరెక్టర్ టేకింగ్

    మైనస్ పాయింట్స్
    ఫస్టాఫ్‌‌లో స్లో నేరేషన్

    English summary
    Actress Varsha Bollamma is coming with Swathi Muthyam movie on October 5th. Here is the Telugu filmibeat's Exclusive Review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X