Takkar movie Review ఆడియెన్స్‌కు టక్కర్.. ట్రాక్ తప్పిన సిద్దార్థ్

Rating:
2.5/5

నటీనటులు: సిద్దార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్, యోగిబాబు, మునిష్ కాంత్, ఆర్జే విగ్నేశ్వర్ తదితరులు
రచన, దర్శకత్వం: కార్తీక్ జీ క్రిష్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
సహ నిర్మాత: వివేక్ కుచిబొట్ల
మ్యూజిక్: నివాస్ కే ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వంచినాథన్ మురుగేషన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్షన్: ఉదయ కుమార్ కే
స్టంట్స్: దినేష్ కాశీ
రిలీజ్ డేట్: 2023-05-26

పేద కుటుంబానికి చెందిన గుణశేఖర్ (సిద్దార్థ్) జీవితంలో అనునిత్యం ఫ్రస్టేషన్‌తో ఉంటాడు. బాగా డబ్బు సాధించాలనే ఏకైక కోరికతో ఊరు విడిచి వైజాగ్ వెళ్తాడు. రకరకాల ఉద్యోగాలు చేస్తూ అవమానాలకు గురి అవుతాడు. డ్రైవర్‌గా పనిచేసే గుణ అనుకోని పరిస్థితుల్లో కిడ్నాప్, మాఫియా ముఠాతో ఎదురు పడాల్సి వస్తుంది. అలాంటి క్రమంలో కిడ్నాప్ గురైన లక్కీ (దివ్యాంశ కౌశిక్)ను కలుసుకొంటాడు. ఆమెతో కలిసి గమ్యం లేని ప్రయాణం చేస్తుంటాడు.

Takkar movie Review and Rating: Siddharth fails to impress as action hero

డబ్బు సంపాదించాలనే కోరికతో ఉన్న గుణశేఖర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? రకరకాల ఉద్యోగాలు చేసిన ఆయనకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. లక్కీ కలిసిన తర్వాత గుణశేఖర్ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? లక్కీతో గుణశేఖర్ ప్రయాణం ఎలా సాగింది. లక్కీతో ప్రయాణం తర్వాత డబ్బు సర్వస్వం అనే అభిప్రాయం మారిందా? కిడ్నాప్ గురైన లక్కీని కాపాడడా? లేదా డబ్బు కోసం కిడ్నాపర్లకు పట్టించాడా? లక్కీకి గుణ తన ప్రేమను చెబితే ఒప్పుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానమే టక్కర్.

పేదరికంతో బాధపడే హీరో ఫ్రస్టేషన్‌ను నేటి యూత్‌‌కు కనెక్ట్ అయ్యేలా పాయింట్‌ను బాగానే రాసుకొన్నాడు. అయితే హీరోను కారు డ్రైవర్ సీట్లో కూర్చోపెట్టి ట్రాక్ మిస్సయ్యేలా చేశాడని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే‌ను పక్కాగా రాసుకోవడంలో కార్తీక్ జీ క్రిష్ తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. చాలా కొన్ని చోట్ల ప్రేక్షకుడిని ఆకట్టుకొనేందుకు ప్రయత్నించాడు. కానీ ఓవరాల్‌గా ఆయన కథ చెప్పే తీరు చాలా కన్‌ఫ్యూజన్ కనిపించింది. యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరి చెప్పాలనుకొన్నాడా? లేదా ఇంకేదైనా చెప్పాలని ప్రయత్నించడా? అనే అర్ధం కాని పాయింట్‌గా కనిపిస్తుంది.

Takkar movie Review and Rating: Siddharth fails to impress as action hero

ఇక కథ, కథనాలను పక్కన పెడితే.. కనీసం బ్యాలెన్స్‌గా, మీనింగ్‌ఫుల్‌గా క్యారెక్టర్లను రాసుకోకపోవడం వల్ల తెర మీద తేలిపోయాయి. ఏ ఒక్క క్యారెక్టర్ బలంగా లేకపోవడం, ప్రేక్షకుడిని కనీసం కనెక్ట్ అయ్యేలా రాసుకోలేకపోవడం ప్రధానమైన లోపం. సిద్దార్థ్‌ను యాక్షన్ హీరోగా సరిగా డిజైన్ చేయలేకపోవడం వల్ల బేసిక్‌గా అక్కడే సినిమా దారితప్పిందనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే దివ్యాంషా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. యోగిబాబు కొంత నవ్వించే ప్రయత్నం చేశాడు. అభిమన్యు సింగ్ విలన్‌గా నవ్వించలేకపోయాడు. అలాగని భయపెట్టలేక కూడా పోయాడు. మిగితా క్యారెక్టర్లు తెలుగు ప్రేక్షకులకు కనీసం పరిచయం కూడా లేని వారే. దాంతో ఈ సినిమా ఏ కోశాన కూడా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.

Takkar movie Review and Rating: Siddharth fails to impress as action hero

సాంకేతిక విషయాలకు వస్తే.. నివాస్ కే ప్రసన్న అందించిన మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు కూడా ఒకే అనిపించేలా ఉన్నాయి. సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల బీజీఎం కూడా ఆకట్టుకోలేకపోయింది. మురుగేషన్ సినిమాటోగ్రఫి బాగుంది. రోడ్ జర్నీని ఆసక్తికరంగా చిత్రీకరించాడు. జీఏ గౌతమ్ ఇంకా తన కత్తెరకు పదును పెట్టాల్సి ఉందనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కథ కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే మంచి లవ్ స్టోరితో కూడిన రోడ్ జర్నీ మూవీ అయి ఉండేదనిపిస్తుంది.

Takkar movie Review and Rating: Siddharth fails to impress as action hero

లవ్, ఎమోషన్, యాక్షన్ తదితర అంశాలు కలబోసిన చిత్రం టక్కర్. తన ఇమేజ్‌కు భిన్నంగా సిద్దార్థ్ చేసిన అటెంప్ట్ బాగుంది. కానీ సరైన కథ, కథనాలతో ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటే హీరోగా మంచి ఫలితం ఉండేదనిపిస్తుంది. యూత్ ఫుల్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. దివ్యాంశ గ్లామర్ ఈ సినిమాలో జోష్ కలిగించే అంశం. అయితే ఎక్కువ ఆశించి వెళితే నిరాశ పడటానికి ఛాన్స్ ఉంది. సిద్దార్థ్‌ను అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మీ టేస్ట్‌కు తగిన సినిమానా? కాదా? అనేది తెలుసుకోవడానికి ఈ సినిమాను థియేటర్లలో చూసే ప్రయత్నం చేయండి.

మ్యూజిక్: నివాస్ కే ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వంచినాథన్ మురుగేషన్
ఎడిటర్: జీఏ గౌతమ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X