twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Babli Bouncer Review బౌన్సర్‌గా తమన్నా ఆకట్టుకొందా? మధుర్ బండార్కర్ మ్యాజిక్ వర్కవుట్ అయిందా?

    |

    Rating:
    2.5/5
    Star Cast: తమన్నా భాటియా, అభిషేక్ బజాజ్, సాహిల్ వేద్
    Director: మధుర్ బండార్కర్

    నటీనటులు: తమన్నా భాటియా, అభిషేక్ బజాజ్, సాహిల్ వేద్, సౌరబ్ శుక్లా తదితరులు
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మధుర్ బండార్కర్
    రచన: అమిత్ జోషి, ఆరాధన దేబ్‌నాథ్, మధుర్ బండార్కర్
    నిర్మాత: వినీత్ జైన్, అమృతా పాండే
    సినిమాటోగ్రఫి: హిమ్మన్ ధమీజా
    ఎడిటింగ్: మనీష్ ప్రధాన్
    మ్యూజిక్: తనిష్క్ బగ్చీ, కరణ్ మల్హోత్రా
    బ్యానర్: స్టార్ స్టూడియోస్; జంగ్లీ పిక్చర్స్
    ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-09-23

     బబ్లీ బౌన్సర్ కథ ఇలా..

    బబ్లీ బౌన్సర్ కథ ఇలా..

    బాడీ బిల్డింగ్, బౌన్సర్లకు ప్రత్యేకమైన ప్రదేశంగా పేరున్న ఫతేపూర్ బేరీ గ్రామానికి చెందిన బబ్లీ (తమన్నా భాటియా) మగరాయుడిలా ఊర్లో జల్సాగా, ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరుగుతుంటుంది. తండ్రి (సౌరభ్ శుక్లా) కూతురును అల్లారు ముద్దుగా పెంచుతాడు. గారాభంగా పెరిగిన బబ్లీ షేహ్రీ బాబు (అభిషేక్ బజాజ్)తో ప్రేమలో పడుతుంది. అయితే పదో తరగతి పాస్ కానీ బబ్లీకి సొంతంగా తన కాళ్లపై ఆధారపడి బతికేలా బతకమని షెహ్రీ బాబు సలహా ఇస్తాడు. అయితే తన గ్రామానికి చెందిన కుక్కు (సాహిల్ వేద్) సహాయంతో ఢిల్లీలో బౌన్సర్ ఉద్యోగం సంపాదిస్తుంది.

    బబ్లీ బౌన్సర్ కథలో మలుపులు

    బబ్లీ బౌన్సర్ కథలో మలుపులు

    అయితే షెహ్రీ బాబుతో వన్ సైడ్ లవ్ ఎలాంటి మానసిక సంఘర్షణకు దారి తీసింది. లేడి బౌన్సర్‌గా మారడానికి కారణం ఏమిటి? పబ్‌లో లేడి బౌన్సర్‌గా చేరిన బబ్లీకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? పబ్‌లో రౌడీలు, గుండాలను బబ్లీ ఎదిరించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది? బబ్లీ ప్రేమ ప్రయత్నాలు ఫలించాయా? బబ్లీ పెళ్లి ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి. బబ్లీ తన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతి ప్రశంసలు అందుకొని.. అవార్డు గెలుచుకోవడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే బబ్లీ బౌనర్ సినిమా కథ.

    దర్శకుడు మధుర్ బండార్కర్ గురించి

    దర్శకుడు మధుర్ బండార్కర్ గురించి

    సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు రక్షణగా బౌన్సర్లు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అలాంటి ఉద్యోగం వెనుక ఎలాంటి కష్టాలు ఉంటాయనే కోణంలో ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ ఫన్నీగా కథను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మగ బౌన్సర్లు కాకుండా మహిళలు బౌన్సర్లుగా వస్తే వారి శారీరక, మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయో అనే విషయాన్ని దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు.

    మధుర్ ఎంచుకొన్న పాయింట్ మంచిదే కానీ.. కథను చెప్పే విషయంలో కంటెంట్ బలంగా లేకపోవడం ఈ సినిమా పెద్దగా ఆకట్టుకొన్నట్టు అనిపించదు. రొటీన్ లవ్ స్టోరి, గ్రామీణ ప్రాంతంలో ఉండే సంప్రదాయాలు, కథలో ప్రేక్షకుడిని థ్రిల్లింగ్‌కు గురిచేసే అంశాలు లేకపోవడంతో సాదాసీదా చిత్రమనే ఫీలింగ్ కలుగుతుంది. సాధారణ ప్రేక్షకుడు కూడా కథలో ఏం జరుగుతుందో అనే విషయం గ్రహించేలా సినిమా సాగుతుంది.

    తమన్నా ఫెర్ఫార్మెన్స్

    తమన్నా ఫెర్ఫార్మెన్స్

    మిల్కి బ్యూటీ తమన్నా భాటియా ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎన్నో రకాల పాత్రలను పోషించింది. గ్లామర్ తారగా, ఫెర్ఫార్మర్‌గా ఆకట్టుకొన్నది. సీనియర్ హీరోయిన్‌గా ఒక జోన్ నుంచి మరో జోనర్‌కు వచ్చి చేసిన ప్రయత్నమే బబ్లీ బౌన్సర్ మూవీ. అయితే నటిగా బబ్లీ క్యారెక్టర్‌లో సులభంగా దూరిపోవడమే కాకుండా తన రోల్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.

    ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించింది. క్లాస్, మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా.. గ్రామీణ యువతి అనే ఫీలింగ్‌ను స్క్రీన్ మీద కల్పించలేకపోయింది. మట్టిలో మాణిక్యం లాంటి పాత్రలో కూడా గ్లామర్ డాల్‌గానే కనిపించడం ఆ రోల్‌కు ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే ఫెర్ఫార్మెన్స్ పరంగా తమన్నా అదరగొట్టింది.

    టెక్నికల్ విభాగాల పనితీరు..

    టెక్నికల్ విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. తనిష్క్ బగ్చీ, కరణ్ మల్హోత్రా అందించిన పాటలు గ్రామీణ నేపథ్యం టచ్‌తో ఆకట్టుకొంటాయి.

    కొన్ని సన్నివేశాల్లో రీరీకార్డింగ్ బాగున్నది. ఇక పంజాబీ గ్రామీణ అందాలను హిమ్మన్ ధమీజా తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు. ఫైట్స్, యాక్షన్ సీన్ల చిత్రీకరణ బాగున్నాయి. ఆర్ట్, ఎడిటింగ్ తదితర విభాగాలు కథను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. స్టార్ స్టూడియోస్, జంగ్లీ బ్యానర్ నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    లేడీ బౌన్సర్ అనే కొత్త కాన్సెప్ట్‌తో మధుర్ బండార్కర్ రాసుకొన్న కథలో లవ్, యాక్షన్, ఎమోషన్స్ లాంటి అంశాలు కనిపిస్తాయి. అయితే ఈ అంశాలు తెరమీద పూర్తిస్థాయిలో పండలేకపోవడం ఈ సినిమాకు మైనస్. అయితే చాలా లోపాలను తమన్నా భాటియా తన పెర్ఫార్మెన్స్‌తో కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. సీఎం ప్రశంసలు అందుకోవడం వెనుక బలమైన, ఎమోషనల్ కారణం కనిపించదు.

    ఇలాంటి అంశాలు సినిమా తేలిపోయేలా చేసింది. అయితే లవ్ బ్రేకప్, బౌన్సర్లపై దాడి సంఘటనలు, వారి కష్టాలను సినిమాలో చెప్పే ప్రయత్నం జరిగింది. మధుర్ బండార్కర్ నుంచి మ్యాజిక్ ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. ఈ మూవీ డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఖాళీ సమయంలో ఈ సినిమాలోని తమన్నా ఫెర్ఫార్మెన్స్‌ను ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్
    తమన్నా భాటియా
    మ్యూజిక్, సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్
    డైరెక్షన్
    పేలవమైన కథ, కథనాలు
    అంతా ఊహించినట్టే జరగడం

    English summary
    Actress Tamannaah Bhatia's Babli Bouncer movie hits Disney Hotstar OTT on September 23rd, 2022 which is directed by popular Director Madhur Bhandarkar. Here is the Filmbeat Telugu's exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X