twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maestro Movie Review: అదరగొట్టిన తమన్నా.. నితిన్ ఎలా చేశాడంటే?

    |

    2.75/5

    ఏ భాషలోనైనా సినిమాగా రూపొంది మరో భాషలోకి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలంటే అది కత్తి మీద సామే. ఇక అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రాన్ని అప్పటికే ప్రేక్షకులు చూసి ఉండటం మూలన ఆ చిత్రాన్ని మళ్లీ రూపొందించి ఆడియెన్స్‌ను మెప్పించడం ఇంకా కష్టమనేది పలు సందర్భాల్లో ప్రూవ్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే లాంటి ప్రతిభావంతులు నటించిన అంధాధూన్ లాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేశారంటే ఇంకా ఆసక్తి పెరిగింది. థియేటర్ల మూసివేత సంక్షోభం కొనసాగుతున్నందున అంధాధూన్ రీమేక్ మ్యాస్ట్రో డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ ద్వారా మ్యాస్ట్రో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. నితిన్, తమన్నా, నభా నటేష్ ఇతర నటీనటులు ఏ మేరకు న్యాయం చేశారో తెలుసుకొందాం..

    మ్యాస్ట్రో కథ ఏమిటంటే..

    మ్యాస్ట్రో కథ ఏమిటంటే..

    చూపు ఉన్నా అంధుడిగా నటించే అరుణ్ ( నితిన్) సోఫి (నభా నటేష్)కు చెందిన పెడ్రో అనే రెస్టారెంట్‌లో పియానో వాయిస్తూ సంగీతం అందిస్తుంటాడు. కళ్లు లేకపోయినా అద్భుతమైన మ్యూజిక్‌ ప్రతిభ కలిగిన అరుణ్‌ ప్రేమలో సోఫి పడిపోతుంది. ఆ రెస్టారెంట్‌కు తరచు వచ్చే సినీ హీరో నరేష్ (వీకే నరేష్)ను అరుణ్ ఆకట్టుకొంటాడు. తన భార్య సిమ్రాన్ (తమన్నా భాటియా) పుట్టిన రోజున ప్రైవేట్ కన్సర్ట్‌‌ను ఏర్పాటు చేయాలని అరుణ్‌ను తన నరేష్ పిలుస్తాడు. అరుణ్ వచ్చే సరికి నరేష్ తన ఇంటిలో హత్యకు గురై ఉంటాడు. నరేష్ హత్యా ఘటన నేపథ్యంలో ఓ దశలో అరుణ్‌కు నిజంగానే చూపును కోల్పోతాడు.

    మ్యాస్ట్రోలో ట్విస్టులు

    మ్యాస్ట్రోలో ట్విస్టులు

    అరుణ్ అంధుడిగా ఎందుకు నటించాలని అనుకొంటాడు? సినీ హీరో నరేష్‌ను సొంత భార్య సిమ్రాన్ ఎందుకు హత్య చేసింది? నరేష్ హత్యను చూసిన అరుణ్ ఎలా స్పందించాడు. ఈ క్రమంలో అరుణ్ నిజంగానే అంధుడిగా మారారు? అరుణ్‌ను ఇష్టపడిన సోఫి అతడికి ఎందుకు దూరమైంది? నరేష్ హత్య కేసుతో సీఐ బాబీ (సేన్ గుప్తా)కి ఎలాంటి సంబంధం ఉంది? సీఐ బాబీ భార్య లక్కీగా శ్రీముఖి ఎలా నటించింది? వీకే నరేష్ కూతురు పవిత్రగా అనన్య నాగళ్ల ఆకట్టుకొన్నారా? సింగర్ మంగ్లీ తన పాత్రకు న్యాయం చేసిందా లాంటి ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మ్యాస్ట్రో చూడాల్సిందే.

    మ్యాస్ట్రో ఎలా ఉందంటే?

    మ్యాస్ట్రో ఎలా ఉందంటే?

    మ్యాస్ట్రో సినిమా విషయానికి వస్తే.. అంధాధూన్‌ చిత్రాన్ని మక్కీ కి మక్కీగా సీన్ బై సీన్ కాపీ కొట్టారనేది కాదనలేని వాస్తవం. టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే లాంటి టాలెంటెడ్ యాక్టర్ల సెట్ చేసిన టార్గెట్‌ను అందుకోవడం ఎవరికైనా కష్టమనేది మ్యాస్ట్రో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కథా బలాన్ని, అద్భుతంగా కథను నడిపిన విధానం పక్కన పెడితే నటీనటుల ప్రతిభ అంధాధూన్‌కు నెక్ట్స్ లెవెల్‌కు చేర్చిందనడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక అంధాదూన్ చ్రితంతో పోలికలు పక్కన పడితే.. నేరుగా ఈ సినిమాను చూసే వారికి మ్యాస్ట్రో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నితిన్, తమన్నా, నభా నటేష్, అనన్య నాగళ్ల మెప్పించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.

    దర్శకుడిగా మేర్లపాక గాంధీ

    దర్శకుడిగా మేర్లపాక గాంధీ

    ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ విషయానికి వస్తే.. ఎలాంటి సాహసానికి ఒడికొట్టకుండా హిందీ చిత్రంలో ఉండే ఫీల్‌ను కొనసాగించడానికి ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. అక్కడక్కడ తన మార్కును ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. రీమేక్‌ చిత్రాల్లో అసాధారణ పరిస్థితుల్లో తప్ప దర్శకుడు అద్భుతంగా చేశాడనే టాక్ రావడం కష్టం. ఈ సినిమా విషయంలో కూడా అలాంటి వాదననే మేర్లపాక గాంధీ మూటగట్టుకొన్నారని చెప్పవచ్చు. కథలోని ఆత్మను చెడగొట్టకుండా ఫీల్ అందించడానికి ప్రయత్నించడం దర్శకుడిగా అతడు సాధించిన విజయం అని చెప్పాలి.

    నితిన్ ఫెర్ఫార్మెన్స్ ఇలా..

    నితిన్ ఫెర్ఫార్మెన్స్ ఇలా..

    ఇక అరుణ్‌గా నితిన్‌ నటనలో కొంత మెచ్యురిటీ కనిపిస్తుంది. శాయశక్తులను ఉపయోగించి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కీలక సన్నివేశాల్లో పాత్ర పరంగా సానుభూతిని కొంత మేరకు కూడగట్టుకొన్నారని చెప్పవచ్చు. సినిమా సెకండాఫ్‌లో నితిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. క్లైమాక్స్‌లో పాత్రలోని నిజాయితీని పండించడంలో నితిన్ సఫలమయ్యారని చెప్పవచ్చు. ఆయుష్మాన్ ఖురానా టాలెంట్ చూసిన తర్వాత నితిన్‌ నుంచి ఆ రేంజ్‌ నటనను ఆశించడం కూడా తప్పే అవుతుంది.

     తమన్నా భాటియా విలనిజంతో

    తమన్నా భాటియా విలనిజంతో

    ఇక హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించాలనే కోరిక ఉన్న నటిగా తమన్నా భాటియా సిమ్రాన్ పాత్రలో కనిపించింది. తొలిసారి విలన్ షేడ్స్ పాత్రలో ఒదిగిపోయింది. కొన్ని కొన్ని సీన్లలో తమన్నా తన పాత్రకు న్యాయం చేసింది. ప్రియుడి కోసం భర్తను చంపిన పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నించింది. తన అభిమానులను సిమ్రాన్‌గా తమన్నా మెప్పిస్తుంది. వీకే నరేష్ హత్య జరిగిన సీన్, అలాగే నితిన్ ఇంటిలోని సన్నివేశాల్లో తమన్నా ఫెర్ఫార్మెన్స్ బాగుంది.

    నభ నటేష్, శ్రీముఖి, సింగర్ మంగ్లీ

    నభ నటేష్, శ్రీముఖి, సింగర్ మంగ్లీ

    ఇక నభా నటేష్ నటన పెద్దగా ఆకట్టుకొనే లేదు. కేవలం గ్లామర్ కోసమే నభాను వాడుకొన్నారా అనిపిస్తుంది. హిందీ చిత్రంలో కేవలం అందంతోనే కాకుండా అభినయంతో రాధిక మెప్పిస్తే.. తెలుగులో నభా ఆ రేంజ్‌ను అందుకోవడంలో విఫలమైంది అని చెప్పవచ్చు. ఇక పాత్ర నిడివి తక్కువైనా లక్కీగా శ్రీముఖి అదరగొట్టింది. లక్కీ పాత్రను గుర్తుండిపోయేలా చేసింది. సింగర్ మంగ్లీ కూడా తనకంటూ ఓ గుర్తింపు ను తెచ్చుకొనే పాత్రలో మెరిసింది. సేన్ గుప్తా కూడా ఫర్వాలేదనిపించాడు. నరేష్‌తో సహా మిగితా పాత్రల్లోని వారు తమ పరిధి మేరకు ఒకే అనిపించారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు..

    టెక్నికల్ విభాగాల పనితీరు..

    ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాకు వై యువరాజ్ సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్ణణ, పాత్రల మూడ్‌ను తెర మీద చూపించడంలో సినిమాటోగ్రఫి అనే అంశం కీలకంగా మారింది. లోకేషన్లకు అందంగా తెరకెక్కంచారు. మహతి సాగర్ అందించిన పాటల కంటే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ బాగుంది. కథను చాలా స్మూత్‌గా పరిగెత్తించేలా తన ప్రతిభను మరోసారి చాటుకొన్నారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి అంధాదూన్ కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే నిజాయితీతో కూడిన అటెంప్ట్ కొంత మేరకు సఫలమైందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా నటీనటుల ఎంపిక విషయం నిర్మాతల అభిరుచికి అద్దం పట్టింది.

    ఫైనల్‌గా మ్యాస్ట్రో ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా మ్యాస్ట్రో ఎలా ఉందంటే..

    కథ, కథనాలు, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ మ్యాస్ట్రో (అంధాదూన్ పోలికలను పక్కన పెడితే) చిత్రానికి బలంగా మారాయి. అయితే ఎమోషనల్‌ పాయింట్స్ తెరపైన కనిపించకపోవడం ఈ సినిమాకు ప్రధానంగా మైనస్ అనిచెప్పవచ్చు. హిందీ సినిమాను చూడని వారికి తప్పకుండా మ్యాస్ట్రో థ్రిల్లింగ్ ఉంటుంది. మంచి అనుభూతిని కూడా కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నితిన్ యాక్టింగ్, తమన్నా ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పైసా వసూల్ అనిచెప్పవచ్చు. శ్రీముఖి, సింగర్ మంగ్లీ, అనన్య నాగళ్ల ఈ సినిమాలో సర్‌ప్రైజింగ్ ఎలిమింట్‌గా కనిపిస్తాయి. అంధాదూన్ సినిమా చూడకపోతే ఇక ఆలస్యం ఎందుకు.. మ్యాస్ట్రోను చూసేయండి..

    Recommended Video

    Nithiin Vinayaka Chavithi Special Interview | Maestro Movie
    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు
    నటీనటులు: నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి
    దర్శకత్వం: మేర్లపాక గాంధీ
    కథ: శ్రీరాం రాఘవన్
    నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
    సినిమాటోగ్రఫి: వై యువరాజ్
    ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్
    మ్యూజిక్: మహతి స్వర సాగర్
    బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
    ఓటీటీ రిలీజ్: డిస్నీ+ హాట్ స్టార్
    రిలీజ్ డేట్: 2021-09-17

    English summary
    Bollywood movie Andhadhun remake hits the screens as Maestro. Nithiin, Tamannaah Bhatia, Nabha Natesh are in lead roles. Sreemukhi and Singer Mangli seen in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X