చూసి తప్పు చేయకు

By Staff

Tappuchesi Pappukoodu
-జలపతి
చిత్రం: తప్పుచేసి పప్పుకూడు
నటీనటులు: మోహన్‌ బాబు, శ్రీకాంత్‌, గ్రేసిసింగ్‌, రాధికా చౌదరి...
సంగీతం: కీరవాణి
మాటలు: మరుధూరి రాజా
నిర్మాత: మోహన్‌ బాబు
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి

కొందరు ఎన్ని సినిమాలు తీసినా, ముందుకు కదలలేరు. కాస్తా భిన్నంగా ఆలోచించలేరు. అలాంటి వారిలో మోహన్‌ బాబు ఒకరు. ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇంకా మూసకథలు, కథనాలతో కూడిన చిత్రాలు తీయడం మాత్రం మానలేదు. ఇదే పద్దతిలో తాజాగా మరో చిత్రం నిర్మించారు. అదే తప్పుచేసి పప్పుకూడు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం రూపొందించాలనే ప్రయత్నమే కానీ ఒక్క సీన్‌ లో కూడా కొత్తదనం లేకపోవడం...పాత సినిమాలన్నీ కలగలపి రూపొందించిన చిత్రంగా..కలగాపులగంగా రూపొందింది. ఫస్ట్‌ హాఫ్‌ లో దర్శకుడు, మాటల రచయిత ప్రేక్షకులు నవ్విస్తున్నామని అనుకొని ఉంటారు. కానీ వారికి తప్ప ప్రేక్షకులకు మాత్రం నవ్వు రాదు. సెకండ్‌ హాఫే కాస్తా నయం.

మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ సిట్వువేషనల్‌ కామెడీ రూపొందించడంలో దిట్ట. ఆయన తయారుచేసిన ఈ కథను మనం ఎన్నో సార్లు చూశాం. పాత కథ, అవే పాత సన్నివేశాలున్నప్పుడు ప్రేక్షకులకు నవ్వు ఎలా వస్తుంది. ఇందులో మోహన్‌ బాబు చేసే తప్పులకు రోటీన్‌ సినిమా ఫ్లాష్‌ బ్యాక్‌ ఒకటి ఉంచారు. ఇంట్లో అక్క, చెల్లిని పోషించాల్సిన బాధ్యత, మంచం పట్టిన అమ్మ...అప్పులు..జాబ్‌ లేకపోవడం...ఇలాంటి సుత్తి సమస్యల్లో ఉన్న మోహన్‌ బాబు తప్పక తప్పులు చేస్తాడు.

కానీ హీరో కాబట్టి మధ్య మధ్యలో తప్పు 'ఏ అవసరంలో చేస్తున్నానో' చెప్పుతుంటాడు. ఇలాంటి తప్పుల తడకలతో రూపొందింది ఈ చిత్రం. చాలా కాలం తర్వాత దర్శకత్వం చేపట్టిన ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి - 'పాత కాలపు స్టైల్‌' ఇంకా వీడలేదని మరోసారి నిరూపించుకున్నాడు. కీరవాణి సంగీతం, జయరాం ఫోటోగ్రఫీ పెద్ద ప్లస్‌ పాయింట్స్‌.

మోహన్‌ బాబు అమెరికా వెళ్తున్నాని ఇంట్లో చెప్పి ముంబై వస్తాడు- జాబ్‌ వెతుక్కుంటూ. అక్కడ మోసాలు చేస్తూ బతుకుతున్న మోహన్‌ బాబు ఫ్రెండ్‌ శ్రీకాంత్‌ కలుస్తాడు. బతకడానికి తప్పులే చేయాలని చెప్పి శ్రీకాంత్‌, మోహన్‌ బాబును తన రూట్‌ లోకి లాగి, ఓ బ్యాంక్‌ దోపిడి చేయిస్తాడు. ఈ బ్యాంక్‌ దోపిడి చేయించింది - కోట శ్రీనివాస్‌ రావు, ఆయన చస్కామస్కా రాధికాచౌదరి. కానీ రాధికా చౌదరి ప్లేట్‌ ఫిరాయించి, కోట పేరు పోలీసులకు చెప్పుతుంది. జైల్లో పడ్డ కోట, ఆ డబ్బు ఎక్కడ దాచాడో..తన లాయర్‌ బ్రహ్మనందానికి చెప్పుతాడు. బ్రహ్మనందాన్ని మచ్చిక చేసుకొని ఆ డబ్బు కొట్టేసేందుకు రాధికా ప్రయత్నిస్తుంటుంది.

మరోవైపు, మాజీ సంస్థానాధీశుడు ఒకరు ముంబైలో ఉంటాడు. అతను తెలుగువాడే. గుడ్డివాడు. ముసలివాడు. ఆయన మనవడు అమెరికా నుంచి వస్తాడని భ్రమలో బతుకుతుంటాడు. ఆ మనవడి ప్లేస్‌ లో శ్రీకాంత్‌, మోహన్‌ బాబులు అడుగుపెడుతారు. డబ్బు కాజేయాలని అనుకుంటుండగా, వీరి ప్లాన్స్‌ ను చెదరగొట్టేందుకు అమెరికా నుంచి ఆమె మనవడి కాబోయే భార్య గ్రేసి సింగ్‌ అడుగుపెడుతుంది. గ్రేసి సింగ్‌ వీరి బండారం ఎలా బయటపెడుతుందనేది మిగతా కథ.

గ్రేసిసింగ్‌ పాత్ర చాలా స్వల్పం. కానీ బాగా చేసింది. కాకపోతే, గ్రేసి మోహన్‌ బాబు ప్రేమలో ఉన్నట్టుండికి పడుతుందో మాత్రం మన మట్టిబుర్రకు అర్థం కాదు. శ్రీకాంత్‌, మోహన్‌ బాబులు సాధారణంగా చేశారు. ఈ సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాలు మూడు- సంగీతం, ఫోటోగ్రఫీ, కళా దర్శకత్వం. కీరవాణి అందించిన పాటల కన్నా రీరికార్డింగ్‌ చాలా బాగుంది. గోపాల..గోపాల..పాట కూడా బాగున్నా, 'బృందావనం..' అనే భక్తి గీతం ఎక్సెలెంట్‌. కళాదర్శకుడు శ్రీనివాస్‌ రాజు తన సెట్స్‌ తో రిచ్‌ నెస్‌ తీసుకొస్తే, జయరాం స్క్రీన్‌ కు కొత్త అందాలను తీసుకొచ్చాడు. చూడకుండా వదిలెయ్యచ్చు ఈ సినిమాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X