twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నరికేస్తున్న... నందీశ్వరుడు(రివ్యూ)

    By Srikanya
    |

    సంస్థ: ఎస్‌ఆర్‌బి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ అండ్‌ కె.ఎఫ్‌.సి
    నటీనటులు: తారకరత్న, జగపతిబాబు, షీనా, సుమన్‌, అజయ్‌, రాజీవ్‌ కనకాల, నాగినీడు, ఎమ్మెస్‌నారాయణ, సీత తదితరులు.
    సంగీతం: పార్ధు
    మాటలు: పరుచూరి బ్రదర్స్
    నిర్మాత: కోట గంగాధర్‌రెడ్డి, సేగు రమేష్‌బాబు
    దర్శకుడు: శ్రీను యరజాల

    తారకరత్నకు స్ట్రైయిట్ కథలే కాదు రీమేక్ లు కూడా కలిసిరావటం లేదని తేలిపోయింది. కన్నడ చిత్రం డెడ్లీసోమ రీమేక్ తో, తన బాబాయ్ సింహా గెపట్ తో ఆయనకు అనుకున్న నందీశ్వరుడు టైటిల్ తో రంగంలోకి దిగాడు. అయితే రిజల్ట్ ఎప్పటిలాగే తిరగబడింది. కత్తులు, నరకేయటం, రక్తం నమ్ముకున్నా దానికి బేస్ గా ఉండాల్సిన కథ, కథనం నీరసంగా ఉండటంతో ఫలితం లేకపోయింది. దానికితోడు తారకరత్న మొహంలో భావోద్వేగాలు సీన్స్ కు తగ్గట్లు పలకకపోవటంతో తేలిపోయాయి.

    పోలీస్ అవ్వాలనే జీవితాశయంతో ఉన్న నందు (తారకరత్న) ఆవేశపరుడు. అనుకోని పరిస్దితుల్లో పెద్ద దాదా తమ్ముడు బాబా (అజయ్)తో గొడవ పడి జైలుకు వెళ్తాడు. జైలునుంచి వచ్చాక చదవు కొండక్కెటంతో జనం కోసం బ్రతకాలని మీసం తిప్పి నందీశ్వరుడుగా మారి, తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై తిరగబడతాడు. అతన్ని అంతమొందించడానికి కొంతమంది రాజకీయ నాయకులు, గూండాలు కలిసి పోలీస్‌ అధికారి ఈశ్వర ప్రసాద్‌ (జగపతిబాబు)ని అతనిపైకి ఉసిగొల్పుతారు. మరో ప్రక్క రేడియో జాకీ ప్రగతి (షీనా)తో ప్రేమ నడుపుతూంటాడు. ఈశ్వరప్రసాద్ ..నందుని అణిచేసాడా...ప్రేమ కథ ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    పూర్తి యాక్షన్ చిత్రంగా రూపొందించాలనే తపనతో దర్శకుడు ఈ చిత్రాన్ని హీరో నరికే జనం రక్తంతో తడిసిముద్దై పోయేలా చేసాడు. దాంతో హీరోకి లక్ష్యం అంటూ ఏమి లేని కథగా మారి, సైడ్ క్యారెక్టర్ గా ప్రవేశించే జగపతిబాబుకే లక్ష్యం ఉండేలా మారింది. దాంతో హీరో అడ్డు అదుపూ లేకుండా చేసుకుంటూ పోయే నరమేథానికి సగటు ప్రేక్షకుడు షాక్ అయ్యే పరిస్ధితి ఏర్పడింది. ఇక దీనికి తోడు దర్శకుడు కూడా పెద్దగా గ్రిప్పింగ్ గా సినిమా తీయలేకపోయాడు. సినిమానే ఇలా ఉన్నప్పుడు మనమేం చేస్తాం అనుకున్నారో ఏమో కానీ పరుచూరి బ్రదర్శ్ కూడా తమ కలాన్ని ఝులిపించలేకపోయారు. సాంకేతికంగా మిగతా డిపార్టమెంట్ లు గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. బిందాస్ తో పరిచయమైన హీరోయిన్ షీనా .. కథకు ఉపయోగపడకపోగా అడ్డంగా మారింది. అందులోనూ ఆమె తారకరత్న ప్రక్కన ఆనలేదు. ఉన్నంతలో తారకరత్న డాన్స్ బాగా చేసాడు.

    ఫైనల్ గా మంచి దర్శకుడు పడితే గానీ తారకరత్న కెరీర్ ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని స్పష్టంగా చెప్పిన చిత్రంగా నందీశ్వరుడుతయారైంది. తారకరత్న కాస్త సేఫ్ జోన్ లో వినోద ప్రధానమైన కథలు ఎంచుకుంటే విజయం సాధిస్తాడనిపిస్తుంది. నందీశ్వరుడు మాత్రం అతని కెరీర్ కే కాదు.. చూసినవారికి ఇబ్బంది కలిగించే చిత్రం.

    English summary
    Tarakaratna's Nandeeswarudu film released with negative talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X