For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘తారామణి’ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: ఆండ్రియా, అంజలి, వసంత్ రవి, అళగమ్ పెరుమాల్, నివాస్ అదితన్
  Director: రామ్

  కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోతుంది. ఇప్పుడంతా రోటీన్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిపోయి కంటెంట్ బేస్డ్ చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. అందుకు తగిన విధంగానే ఫిల్మ్ మేకర్స్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుత జనరేషన్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తమ కథలతో యువతకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా తాజాగా వచ్చిన చిత్రమే 'తారామణి'. 2017లో తమిళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అయిందో ఓ లుక్కేద్దాం.

  కథ విషయానికొస్తే...

  కథ విషయానికొస్తే...

  ప్రభురాజ్(వసంత్ రవి) తన తండ్రి కోరిక మేరకు చెన్నై వచ్చి ఓ కాల్ సెంటర్ ఉద్యోగంలో చేరతాడు. అక్కడే అతడికి తన ఆఫీస్ ఎదురుగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న సాంప్రదాయ బద్దంగా ఉండే సౌమ్య(అంజలి) పరిచయం అవుతుంది. ఆమెను సిన్సియర్‌గా ప్రేమించిన ప్రభు అడిగిన వెంటనే ఆమె అమెరికా వెళ్లడానికి రూ. 3 లక్షలు సహాయం చేస్తాడు. అయితే ఆ డబ్బుతో అమెరికా వెళ్లిన సౌమ్య కొన్ని పరిస్థితుల కారణంగా అక్కడే ఉండిపోయి డబ్బు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ప్రభు ప్రేమను కాదని యూఎస్ఏలో ఉండే తెలుగు వ్యక్తిని పెళ్లాడుతుంది.

  ఆల్థియా రాకతో కథ కొత్త ములుపు

  ఆల్థియా రాకతో కథ కొత్త ములుపు

  లవ్ ఫెయిల్యూర్‌తో భారీగా గడ్డం పెంచుకుని పిచ్చోడిలా తయారైన ప్రభుకు... భర్తతో విడిపోయి ఒక బాబు ఉన్న మోడ్రన్ ఉమెన్ ఆల్థియా జాన్సన్‌(ఆండ్రియా)తో పరిచయం ఏర్పడుతుంది. ముందు స్నేహంగా మొదలైన వీరి రిలేషన్ ఆపై ప్రేమగా మారుతుంది, ఇద్దరూ సహజీవనం చేస్తుంటారు.

  సమాజం దృష్టిలో తిరుగుబోతుగా...

  సమాజం దృష్టిలో తిరుగుబోతుగా...

  మోకాళ్ల పై వరకు స్కర్టులు వేయడం, మగాళ్లతో క్లోజ్‌గా మూవ్ అవ్వడం, సిగరెట్లు కాల్చడం, మందు కొట్టడం లాంటి అలవాట్లతో సమాజం దృష్టిలో ఆల్థియా తిరుగుబోతు(బిచ్)గా ముద్ర పడుతుంది. మరి ఆల్థియా నిజంగానే తప్పుడు మనిషా? ఆమె జీవితంలోకి ప్రభురాజ్ ఎంటరైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? సౌమ్య చేతిలో మోసపోయిన ప్రభురాజ్ ఆల్థియా విషయంలో ఎలాంటి ప్రవర్థించాడు? సౌమ్య అతడికి ఎందుకు దూరమైంది? అనేది తర్వాతి కథ.

  పెర్ఫార్మెన్స్ పరంగా...

  పెర్ఫార్మెన్స్ పరంగా...

  పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.... ప్రభురాజ్ పాత్రలో వసంత్ రవి బాగా నటించాడు. పాత్రకు పర్ఫెక్టుగా సూటయ్యే విధంగా ఉన్న అతడి రూపం కూడా మరింత ప్లస్ అయింది. మోడ్రన్ అమ్మాయి ఆల్థియా పాత్రలో ఆండ్రియా పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది. సినిమా మొత్తం మీద ఆమె పాత్రే హైలెట్ అని చెప్పొచ్చు, ఇటు అందం పరంగా, నటన పరంగా ఆకట్టుకుంది. అంజలి చిన్న(అతిథి) పాత్రలో నటించింది. పెర్ఫార్మెన్స్ పరంగా ఆమెకు పెద్ద స్కోప్ లేదనే చెప్పక తప్పదు. ఇతర పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపించారు.

  టెక్నికల్ అంశాల పరంగా...

  టెక్నికల్ అంశాల పరంగా...

  యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగా ఉండటంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఫీల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫర్వాలేదు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. టెక్నికల్ అంశాల పరంగా, నిర్మాణ విలువలు సంతృప్తి కరంగా ఉన్నాయి

  కథ ఎలా ఉందంటే...

  కథ ఎలా ఉందంటే...

  ఈ జనరేషన్లో ప్రేమికుల మధ్య రిలేషన్ ఎలా ఉంది? ఒక వేళ వారు విడిపోతే ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ లేదా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనం ఎంతగానో నమ్మే వ్యక్తులు మనతో నిజయితీగా ఉంటున్నారా? మంచి వారు ఎవరు? చెడ్డ వారు ఎలా ఉంటారు? అనే అంశాలను బేరీజు వేస్తూ రియాలిటీకి దగ్గరగా కథను నడిపించే ప్రయత్నం చేశారు.

  స్క్రీన్ ప్లే సాగిన తీరు ఇలా...

  స్క్రీన్ ప్లే సాగిన తీరు ఇలా...

  స్క్రీప్లే నడించిన విధానం ఫర్వాలేదనే విధంగా ఉంది. కొన్ని చోట్ల సినిమాను లాగినట్లు, మరికొన్ని చోట్ల అనవసర విషయాలు సినిమాలో జొప్పించిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడ తప్ప మరీ అంత పెద్ద బోరింగ్ అనే విధంగా అయితే ఏమీ లేదు. అయితే కథ నేరేట్ చేసిన విధానం కాస్త సంక్లిష్టంగా ఉండటంతో జనాలకు అంత తొందరగా ఎక్కక పోవచ్చు. ఇలాంటి డౌట్ దర్శకుడికి వచ్చే బ్యాగ్రౌండ్ వాయిస్ ద్వారా కథను స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు.

  ప్లస్, మైనస్ పాయింట్స్

  ప్లస్, మైనస్ పాయింట్స్

  సినిమా కథ

  ఆండ్రియా
  మ్యూజిక్

  మైనస్ పాయింట్స్

  సంక్లిష్టంగా ఉన్న స్క్రీన్ ప్లే
  సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు

  చివరగా...

  చివరగా...

  ‘తారామణి' కాస్త విభిన్నమైన ప్రేమ కథ. ఈ జనరేషన్లోని వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం బావుంది. అయితే యువతకు కథ ఏ మేరకు నెక్ట్ అవుతుంది? అనేదానిపై విజయం అధారపడి ఉంటుంది.

  నటీనటులు, తెర వెనకb

  నటీనటులు, తెర వెనకb

  సమర్పణ: జె.ఎస్. కె. ఫిలిం కార్పొరేషన్

  బేనర్: డి.వి.సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్
  తెలుగులో నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి.వెంకటేష్
  దర్శకత్వం: రామ్
  సంగీతం: యువన్ శంకర్ రాజా
  సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
  ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
  తెలుగు రిలీజ్ డేట్: సెప్టెంబర్ 6, 2019

  English summary
  Taramani movie Review and Rating. Taramani written and directed by Ram. The film features Andrea Jeremiah, Vasanth Ravi and Adrian Knight Jesly in the lead roles, with Anjali appearing in an extended cameo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X