Taxi Review ఆసక్తిగా సాగే సైంటిఫిక్ థ్రిల్లర్.. ట్యాక్సీని యువ హీరో, దర్శకుడు నడిపించారంటే?

నటీనటులు: వసంత్ సమీర్ పిన్నమరాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు
దర్శకత్వం: హరీష్ సజ్జా
నిర్మాత: హరిత సజ్జా
సంగీతం: మార్క్ k రాబిన్
సినిమాటోగ్రఫి: ఉరుకుండారెడ్డి
వీఎఫ్ఎక్స్: ఆనంద్ పల్లకి
ఎడిటర్: టీసీ ప్రసన్న
బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్
రిలీజ్ డేట్: 2023-03-10

Taxi Telugu movie Review and Rating

నిజాయితీపరుడైన ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్మమరాజు) యువ శాస్త్రవేత్త. తన ప్రయోగాలతో దేశానికి మేలు చేయాలని లక్ష్యంతో ఉంటాడు. తన ప్రయోగాల ద్వారా బంగారు నిల్వలను కనిపెట్టే ఖరీదైన కాలిఫోర్నియం 252 అనే మెటల్‌ను కనుగొంటాడు. బంగారు నిల్వలను గుర్తించే ఖనిజాన్ని కనిపెట్టిన ఈశ్వర్ గురించి తెలుసుకొన్న రాజకీయ నేతలు, మైనింగ్ మాఫియా రంగంలోకి దిగుతుంది. ఇదిలా ఉంటే.. ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) స్వయంగా సొంత సంస్థను స్థాపించి ఎదగాలనే యువకుడు ఆర్థిక కష్టాలు ఎదురై జీవితం సమస్యల్లో పడుతుంది. ఇలా వేర్వేరు సమస్యలతో పోరాడుతున్న ఉజ్వల్, ఈశ్వర్ ఒకే క్యాబ్‌లో ప్రయాణించాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఈ ఇద్దరిపై మాఫియా ఎటాక్‌కు ప్లాన్ చేస్తారు.

దేశాభివృద్ది కోసం ఈశ్వర్‌ చేసిన ప్రతిపాదనలపై గనులశాఖా మంత్రి ఎలా సందించారు. ఈశ్వర్‌పై వచ్చిన నేరారోపణలు ఏమిటి? ఏ పరిస్థితుల్లో ఈశ్వర్ భార్య అదృశ్యమవుతుంది? హ్యాకర్ ఉజ్వల్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? దేశం కోసం తన ప్రయోగాలు ఉపయోగపడాలని అనుకొన్న ఈశ్వర్ ప్లాన్స్ వర్కవుట్ అయ్యాయా? మాఫియా దాడులను ఈశ్వర్ ఎలా ఎదుర్కొన్నాడు? క్యాబ్‌లో ప్రయాణించిన నలుగురు పరిస్థితి ఏమైంది? చివరకు ఈశ్వర్, ఉజ్వల్ తమ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు అనే ప్రశ్నలకు సమాధానమే ట్యాక్సీ సినిమా కథ.

బంగారు నిల్వలను గుర్తించే మెటల్‌ కనిపెట్టడం, అలాగే ఎథికల్ హ్యార్ అనే రెండు టెక్నికల్ అంశాల చుట్టు యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలు జోడించి దర్శకుడు హరీష్ సజ్జా చేసిన కథా ప్రయోగాన్ని అభినందించదగిన విషయం. అయితే కథలో రకరకాల ట్విస్టులు, మలుపులు విషయంలో దర్శకుడు కాస్త తడబాటు పడినట్టు అనిపిస్తుంది. కానీ కథను, పాత్రలను డిజైన్ చేసిన విధానం చూస్తే అనుభవం ఉన్న డైరెక్టర్‌లా కనిపిస్తాడు. కథ, కథనాలు డీల్ చేసిన విధానం అతడి ప్రతిభకు అద్దం పట్టింది. ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్ టైటిల్ వరకు కథను నడిపించిన విధానం చూస్తే భవిష్యత్‌లో మంచి డైరెక్టర్ అవుతాడనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే..ఈశ్వర్ పాత్రలో వసంత్ సమీర్ అద్బుతంగా ఫెర్ఫార్మ్ చేశారు. నటన విషయంలో కొత్తవాడు అనే ఫీలింగ్‌ కలగనీయకుండా పరిణితి కూడిన నటనను ప్రదర్శించాడు. యాక్షన్ సీన్లలో స్టంట్స్ చేసిన విధానం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. డైలాగ్ డెలివరీ విషయంలో ఫర్‌ఫెక్షన్ బాగుంది. సూర్య శ్రీనివాస్ ఉజ్వల్‌గా బాగా నటించాడు. ఎథికల్ హ్యాకర్ పాత్రలో ఒదిగిపోయాడు. సౌమ్య మీనన్ హీరోయిన్‌గా తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు.

యాక్షన్, థ్రిల్స్, సస్పెన్స్‌తో సైంటిఫిక్ అంశాలు మేలవించిన చిత్రం ట్యాక్సీ. దర్శకుడ హరీష్ ప్రతిభ, నటీనటుల ప్రతిభ, ముఖ్యంగా వసంత్ సమీర్ సినిమా భారాన్ని మోసిన విధానం ఈ సినిమాకు ఫీల్‌గుడ్ అంశాలుగా మారాయి. అక్కడక్కడ సాగదీసినట్టు అనిపిస్తుంది. నిర్మాత హరిత సజ్జా అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను హైస్టాండర్డ్‌లో ఉంచింది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను, యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రాలను ఆదరించే వారికి నచ్చుతుంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. టెక్నికల్ కథాంశంతో రూపొందిన సినిమాకు మ్యూజిక్ ప్రధానమైన అంశం. అయితే ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ అందించిన మ్యూజిక్ బాగుంది. పలు సన్నివేశాలను తన రీరికార్డింగ్‌తో బాగా ఎలివేట్ చేశారు. ఉరుకుండా రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. శ్రీధర్ డిజైన్ చేసిన ఫైట్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. డైలాగ్స్ కూడా కథ, కథనాలు, పాత్రలు, సందర్బోచితంగా ఉంటూ అక్కడ బ్రహ్మండంగా పేలాయి.

సైంటిఫిక్ అంశాలతో యాక్షన్, సస్సెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ట్యాక్సీ. యువ నటీనటులు, దర్శకుల ప్రతిభ ఈ సినిమాకు బలంగా మారింది. కొన్ని చోట్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ సైంటిఫిక్, హ్యాకింగ్ లాంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. థ్రిల్లర్, సస్పెన్స్, యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X