twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాక్సీవాలా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Vijay Devarakonda's Taxiwala Movie Review టాక్సీ వాల సినిమా రివ్యూ

    Rating:
    3.0/5
    Star Cast: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళివిక నాయర్, సిజ్జు, మధునందన్
    Director: రాహుల్ సంక్రిత్యన్

    గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్‌తో సూపర్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ నోటా రూపంలో ఝలక్ తిన్నాడు. టాక్సీవాలా సినిమాతో హిట్ కొడుదామనుకొన్న నేపథ్యంలో సినిమా మొత్తం ఇంటర్నెట్‌లో పైరసీకి గురై మరో షాకిచ్చింది. ఇలాంటి సమయంలో వచ్చిన టాక్సీవాలా చిత్రం ఎలాంటి రెస్పాన్స్‌ను సంపాదించుకొన్నది. విజయ్ ఖాతాలో హిట్ పడిందా? ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా ఎలా ఆకట్టుకొన్నారు. కొత్త దర్శకుడు రాహుల్ రెండో సినిమాతో సక్సెస్ కొట్టాడా అని తెలుసుకోవాలంటే టాక్సీవాలా కథలోకి వెళ్లాల్సిందే.

    టాక్సీవాలా మూవీ కథ

    టాక్సీవాలా మూవీ కథ

    శివ (విజయ్ దేవరకొండ) డిగ్రీ చేతబట్టుకొని తిరిగే ఓ నిరుద్యోగి. బాబాయ్ (మధునందన్) అనే స్నేహితుడు అండతో హైదరాబాద్‌లో కాలం వెళ్లదీస్తుంటాడు. డబ్బు సంపాదన కోసం ఎన్ని ఉద్యోగాలు చేసిన నచ్చకపోవడంతో చివరికి క్యాబ్ నడుపాలని నిర్ణయించుకొంటాడు. అన్న, వదిన (రవి ప్రకాశ్, కల్యాణి) అందించిన సహాయంతో ఓ పాత కారు కొనుకొంటాడు. కారులో దెయ్యం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొంటాడు.

     టాక్సీవాలాలో ట్విస్టులు

    టాక్సీవాలాలో ట్విస్టులు

    కారులోనే దెయ్యం ఎందుకు ఉండాల్సి వచ్చింది? శివకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనకు ఎదురైన ఇబ్బందుల్లో ప్రియురాలి అను (ప్రియాంక జవాల్కర్) ఎలా అండగా నిలిచింది? శిశిర (మాళవిక నాయర్) పాత్రేంటి? సిజ్జు, ఉత్తేజ్ పాత్రలేంటి? యమున ఎలాంటి పాత్రలో కనిపించింది? చివరకు తనకు ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనే ప్రశ్నలకు సమాధానమే టాక్సీవాలా చిత్రం.

     ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఉద్యోగం కోసం శివపడే తంటాలతో ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. సరదా సన్నివేశాలు, ఆరోగ్యకరమైన హాస్యంతో సినిమా హ్యాపీగా సాగుతుంటుంది. ఇక కథలో శివ ముందు సమస్యను పెట్టి సినిమా పెట్టడం ద్వారా ఆసక్తి పెరుగుతుంది. కారు కొనడం కోసం వదిన చేసిన గొప్ప సహాయం ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారుతుంది. ప్రథమార్థం ముగింపులో మంచి హెవీ సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేయ్యడంతో ఫస్టాఫ్ వెరీ పాజిటివ్‌గా ముగుస్తుంది.

    సెకండాఫ్‌ అనాలిసిస్

    సెకండాఫ్‌ అనాలిసిస్

    ఇక సెకండాఫ్‌లో కథను ఎలా తీసుకెళ్తాడో అనే అనుమానంతో లోనికి వెళ్లిన ప్రేక్షకుడికి ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ (ఓ ఆత్మ మరో ఆత్మతో మాట్లాడటం) అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుడిలో ఆసక్తిని రేపడం జరుగుతుంది. ఆస్ట్రాల్ ప్రొజెక్షన్ పాయింట్‌పై తొలుత కన్‌ఫ్యూజన్ ఏర్పడిన.. అందుకు బలంగా ఓ సబ్ ప్లాట్‌ను ప్రేక్షకుడి ముందుకు తీసుకురావడంతో థ్రిల్లింగ్ మొదలవుతుంది. చివరకు రెగ్యులర్ డ్రామాగా మలుస్తాడా అనే మరో సందేహానికి ఓ భావోద్వేగమైన పాయింట్‌తో కథను సుఖాంతం చేయడం జరుగుతుంది. ఓ నమ్మశక్యం కాని పాయింట్‌ను ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా నమ్మకం కలిగించే విధంగా చెప్పిన తీరుతోనే సినిమా సక్సెస్ బాట పట్టిందని చెప్పవచ్చు.

    దర్శకుడు రాహుల్ గురించి

    దర్శకుడు రాహుల్ గురించి

    మలి చిత్ర దర్శకుడిగా రాహుల్ సంక్రిత్యన్ ఛాలెంజింగ్ పాయింట్‌‌తో సినిమాను ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా మలచడంతో సఫలమయ్యాడని చెప్పవచ్చు. ప్రతీ క్యారెక్టర్‌ను మీనింగ్ ఫుల్‌గా తెరకెక్కించాడు. రెగ్యులర్ ఫార్మాట్‌ జోలికి వెళ్లకుండా తన మదిలో ఉన్న పాయింట్‌ను చక్కగా తెరకెక్కించాడు. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ గానీ, మాళవిక నాయర్ పాత్ర చిత్రీకరణ, బాబాయ్, అన్న, వదిన పాత్రలను సమతూల్యంగా వండి వర్చారు. సెకండాఫ్‌లో కథను చెప్పడం ఎలాంటి దర్శకుడికైనా కత్తి మీద సామే. ఎంతో అనుభవం ఉంటే తప్ప సాధ్యం కానిది.. పరిణితి ఉన్న దర్శకుడిగా కథను హ్యాండిల్ చేశాడని చెప్పవచ్చు.

     విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

    విజయ్ దేవరకొండ నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. గొప్ప ఫెర్ఫార్మర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. శివ పాత్రను తన నటన, హావభావాలతో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగమైన, సహజమైన నటనను ప్రదర్శించాడు. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సీన్లలో అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ కొట్టినట్టే అనిచెప్పవచ్చు.

    హీరోయిన్ ప్రియాంక్ జువాల్కర్ గ్లామర్

    హీరోయిన్ ప్రియాంక్ జువాల్కర్ గ్లామర్

    ప్రియాంక జవాల్కర్‌ది పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర. కానీ కథకు సపోర్ట్‌గా నిలిచే రోల్ అని చెప్పవచ్చు. తెరపై చాలా ఫ్రెష్‌గా కనిపించింది. నటించడానికి పెద్దగా స్కోప్ లేని పాత్ర కావడంతో ఆమె ప్రతిభను సమీక్షించాల్సిన అవసరం లేకపోయింది. కానీ అందంతో ఆకట్టుకొన్నదనే మాట ఈ సందర్భంగా చెప్పడం తప్పదు.

    మాళవిక నాయర్ పాత్ర గురించి

    మాళవిక నాయర్ పాత్ర గురించి

    ప్రతిభావంతురాలైన యువ హీరోయిన్లలో మాళవిక నాయర్ ఒకరు. ఆమెకు ఉన్నవి కేవలం నాలుగైదు సీన్లే అయినప్పటికీ.. గుర్తుండి పోయే పాత్రే. అంత గొప్పగా ప్రభావం చూపే పాత్రలో నటించి మెప్పించింది. సెకండాఫ్‌లో కనిపించినా.. కనిపించకపోయినా ఆమె ఉన్నట్టు ఫీల్ కలుగు జేయడం పాజిటివ్ అంశంగా మారింది.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    టాక్సీవాలాలో మిగితా నటుల విషయానికి వస్తే.. సిజ్టూ, ఉత్తేజ్ విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్లలో కనిపించారు. కానీ పెద్దగా విలనిజం కనిపించదు. సాఫ్ట్‌గా కనిపించే విలన్లుగా మెప్పించారు. ఇక బాబాయ్ మధు నందన్, మరో కమెడియన్ సినిమాకు ఎంగేజింగ్ ఫ్యాక్టర్‌గా మారారు. రవి ప్రకాశ్, కల్యాణి పాత్రలు సెంటిమెంట్‌ను గుప్పించాయి. యమున పాత్ర నిడివి చిన్నదైనా సానుభూతి కలిగేలా నటించింది. ఇక జబరస్త్ కమెడియన్ కనిపించినంత సేపు నవ్వించాడు.

    జేక్స్ బిజోయ్ సంగీతం

    జేక్స్ బిజోయ్ సంగీతం

    టాక్సీవాలాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ. పాటలు అంత గొప్పగా లేవు. కానీ రీరికార్డింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ప్రతీ సన్నివేశాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోస్థాయికి తీసుకెళ్లింది. కథలో లీనమయ్యే విధంగా మ్యూజిక్‌ను అందించాడు. భవిష్యత్‌లో మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ అంత ప్రతిభ తన సంగీతంలో కనిపించింది.

    స్పెషల్ అట్రాక్షన్‌గా సినిమాటోగ్రఫి

    స్పెషల్ అట్రాక్షన్‌గా సినిమాటోగ్రఫి

    టాక్సీవాలా సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ సినిమాటోగ్రఫి. చేజింగ్ సీన్లు గానీ, నైట్ ఎఫెక్ట్ సన్నివేశాలు గానీ బాగా ఆకట్టుకొన్నాయి. ప్రీ క్లైమాక్స్‌లో ప్రతీ సన్నివేశాన్ని హృదయానికి హత్తుకొనేలా, కడుపుబ్బ నవ్వించేలా సీన్లు ఎలివేట్ కావడానికి సంగీత దర్శకుడు సుజిత్ నారంగ్ ప్రతిభ బాగా తోడ్పడింది. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ పనితీరు బాగుంది. క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు కొంత ల్యాగ్ అనిపించాయి. చివరగా సాయికుమార్ రెడ్డి అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు ప్రాణంగా నిలిచింది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలకు ఏ మాత్రం తీసిపోనట్టుగా టాక్సీవాలా రూపొందింది. ఈ సినిమా ద్వారా జర్నలిస్టు, పీఆర్‌వో ఎస్‌కేఎన్ నిర్మాతగా మారారు. మంచి కథను ఎన్నుకోవడంలో నిర్మాతగా తొలి విజయం సాధించారు. నమ్మిన కథను ఫీల్‌గుడ్‌తో అందించి సక్సెస్‌ను సొంతం చేసుకొన్నారనే చెప్పవచ్చు. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అనేది రెండు మూడు రోజులు ఆగితే తెలుస్తుంది.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    విభిన్నమైన కథ, విలక్షణమైన నటన కలిసిన ఫీల్‌గుడ్ చిత్రం టాక్సీవాలా. ఆద్యంతం వినోదంగా సాగుతూ.. మధ్యలో అక్కడక్కడ భావోద్వేగాన్ని పండిస్తూ సాగే చిత్రం ఇది. రొటీన్ సినిమాల మధ్య నావెల్టీ, మంచి సస్సెన్స్ థ్రిలర్ అని చెప్పవచ్చు. సెంటిమెంట్, కమర్షియల్ హంగులు కలిసి ఉండటంతో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాగా మారింది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    డైరెక్టర్ రాహుల్ కథ, టేకింగ్
    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్
    డీసెంట్ స్క్రీన్ ప్లే
    సినిమాటోగ్రఫి
    మ్యూజిక్
    సెంటిమెంట్

    మైనస్ పాయింట్స్
    క్లైమాక్స్ కొంత సాగదీత
    అక్కడక్కడ ఎడిటింగ్ లోపాలు
    దిగువ తరగతి ప్రేక్షకులకు దూరంగా ఉండే కాన్సెప్ట్

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళివిక నాయర్, సిజ్జు, మధునందన్, ఉత్తేజ్, యమున, కల్యాణి, రవిప్రకాశ్ తదితరులు
    దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యన్
    స్క్రిన్ ప్లే: సాయికుమార్ రెడ్డి
    సినిమాటోగ్రఫి: సుజిత్ సారంగ్
    మ్యూజిక్: జేక్స్ బిజోయ్
    ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
    బ్యానర్: గీతా ఆర్ట్స్2
    రిలీజ్: 2018-11-17

    English summary
    Vijay Deverakonda's Taxiwaala set to release on November 17th. As promotion programme, Vijay speak to Filmibeat Telugu. He revealed behind movie Shoot and pain about their hard work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X