Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టెడ్డీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్: ఆర్య, సాయేషా కెమిస్ట్రీ ఎలా ఉందంటే!
Rating: 2.5/5
నటీనటులు: ఆర్య, సాయేషా, సాక్షి అగర్వాల్, సతీష్, కరుణాకరన్ తదితరులు
కథ, రచన, దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్
నిర్మాత: కేఈ జ్ఞాన వేల్ రాజా
మ్యూజిక్: డీ ఇబ్రహీం
సినిమాటోగ్రఫి: ఎస్ యువ
ఎడిటింగ్: టీ శివనందీశ్వరన్
బ్యానర్: స్టూడియో గ్రీన్
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్‌స్టార్
రిలీజ్ డేట్: 2021-03-12
కాలేజీ స్టూడెంట్ శ్రీ విద్య (సాయేషా) ప్రమాదానికి గురై హాస్పిటల్‌లో చేరుతుంది. హాస్పిటల్‌లో వైద్యులు ప్రమాదకరమైన డ్రగ్స్ ఇచ్చి ఆమెను కోమాలోకి వెళ్లేలా చేస్తారు. కోమాలోకి వెళ్లడంతో శ్రీ విద్య ఆత్మ ఓ టెడ్డీ బేర్‌లో చేరుతుంది. ఎవరికైనా ఆపద వస్తే తన ఇంటెలిజెన్స్‌తో సహాయ పడే శివ (ఆర్య)ను టెడ్డీ బేర్ కలిసి హెల్ప్ కోరుతుంది.

శ్రీ విద్యకు ఎందుకు ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి కోమాలోకి పంపారు? టెడ్డీ సహయం కోరడంతో శివ ఎలా రియాక్ట్ అయ్యారు. శ్రీ విద్యను కాపాడుకొనే ప్రయత్నంలో శివకు ఎలాంటి నిజాలు తెలిసాయి? ప్రమాదంలో ఉన్న శ్రీ విద్యతోపాటు మరికొందరిని శివ ఎలా కాపాడాడు? వైద్యుల అక్రమ వ్యాపారానికి ఎలా బుద్ది చెప్పాడనే ప్రశ్నలకు సమాధానం టెడ్డీ సినిమా కథ.
అక్రమంగా మానవుల అవయవాలను విదేశాలకు చేరవేసే వైద్యుల దందా కథగా టెడ్డి తెరకెక్కింది. ఇలాంటి భావోద్వేగమైన కథకు టెక్నాలజీని చేర్చి సరికొత్తగా మలిచే ప్రయత్నం చేశారు. తొలి భాగంలో సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే విదేశాలకు శ్రీ విద్య దేహం రవాణా కావడంతో ఆమె రక్షించడానికి శివ ఫారిన్ చేరడం, ఆ తర్వాత సినిమా రొటీన్‌గా మారిపోతుంది. శ్రీ విద్యను రక్షించి ఆమెకు ఎలా చేరువయ్యాడనే అంశంతో సినిమా ముగుస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ తరహా సాగే కథనం ఆసక్తిని రేపుతుంది. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ విభిన్నంగా, కొత్తగా కథను చెప్పే ప్రయత్నం చేశారు.
నిజ జీవితంలో భార్య భర్తలు అయిన ఆర్య, సాయేషా కలిసి ఈ చిత్రంలో లీడ్ రోల్స్ పోషించారు. ఆర్య, సాయేషా మధ్య పెద్దగా సీన్లు లేకపోవడంతో వారి మధ్య కెమిస్ట్రీ కనిపించదు. మెడికల్ అక్రమ దందాపై కథ సాగడంతో లవ్ సీన్లకు అవకాశం దక్కలేదు. శ్రీ విద్య క్యారెక్టర్ కోమాలో ఉండటం కారణంగా నటించడానికి అవకాశం చిక్కలేదు. ఆర్య ఒక్కడే సినిమా భారాన్ని మోయాల్సి వచ్చింది. టెడ్డీ బేర్ క్యారెక్టర్ ఆకట్టుకొనేలా ఉంటుంది.
మెడికల్ రంగంలో అక్రమాలు, మానవ అవయవాల దందాపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ టెడ్డీ మాత్రం ఓ డిఫరెంట్ సినిమా. ఇన్వెస్టిగేషన్, క్రైమ్, పగ, ప్రతీకారం లాంటి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. టెడ్డీ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వన్ టైమ్ వాచ్ అని చెప్పవచ్చు.