twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tees Maar Khan Review ట్విస్టులతో సాగే యాక్షన్ థ్రిల్లర్.. ఆది ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating: 2.75/5

    నటీనటులు: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, పూర్ణ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ తదితరులు
    బ్యానర్: విజన్ సినిమాస్
    డైరెక్టర్: కళ్యాణ్ జి గోగణ
    ప్రొడ్యూసర్: నాగం తిరుపతి రెడ్డి
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యాళ్ల తిర్మల్ రెడ్డి
    మ్యూజిక్: సాయి కార్తీక్
    ఎడిటర్: మణికాంత్
    సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
    పీఆర్వో: సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు
    రిలీజ్ డేట్: 2022-08-19

    తీస్ మార్ ఖాన్ కథ ఏమిటంటే?

    తీస్ మార్ ఖాన్ కథ ఏమిటంటే?

    అనాధలైన తీస్ మార్ ఖాన్ (ఆది)ని మరో అనాధ వసు (పూర్ణ) చేరదీస్తుంది. తల్లిలా ఆదరించిన ఆమెను అమ్మ అని ప్రేమగా పిలుచుకొంటాడు తీస్ మార్ ఖాన్. తన ప్రాణం కంటే మిన్మగా భావించే అమ్మకు చిన్న అపకారం కలిగిన తీస్ మార్ ఖాన్ సహించలేదు. అలాంటి తన అమ్మకు చక్రీ (సునీల్)తో పెళ్లి జరుగుతుంది. అనగా (పాయల్ రాజ్‌పుత్)‌తో ప్రేమలో తీస్ ‌మార్ ఖాన్ ప్రేమలో పడుతాడు. అందరూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో అమ్మ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది. ఆ మరణానికి జీజా (అనూప్ సింగ్ ఠాకూర్) అనే అనుమానం కలుగుతుంది.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు


    అమ్మను చంపింది జీజానా? లేదా అమ్మ మరణానికి కారణం ఎవరు? తీస్ మార్ ఖాన్‌తో హోం మినిస్టర్‌కు ఎలాంటి సంబంధం ఉంది? భార్య అమ్మ మరణం తర్వాత చక్రి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అమ్మ మరణం విషయంలో తీస్మార్ ఖాన్‌కు హోం మినిస్టర్ రంగ రాజన్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎలాంటి సహాయం చేశాడు. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా తిరిగే తీస్ మార్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ ఎందుకయ్యాడు? అమ్మ మరణానికి మాఫియాకు లింకు ఏమిటి? తన సోదరుడు జీజా మరణంతో తీస్ మార్ ఖాన్‌పై ముంబై మాఫియా డాన్ తల్వార్ (కబీర్ ఖాన్) ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకొంటాడు. అమ్మ మరణం వెనుక గుట్టును తీస్ మార్ ఖాన్ రట్టు చేశాడు? ఇలాంటి భావోద్వేగమైన ప్రశ్నలకు సమాధానమే తీస్ మార్ ఖాన్ సినిమా కథ.

    ఫస్టాఫ్‌లో హ్యుమన్ ఎమోషన్స్

    ఫస్టాఫ్‌లో హ్యుమన్ ఎమోషన్స్


    తీస్ మార్ ఖాన్, వసు బాల్యంలో ఎదురైన అనుభవాలు, కష్టాలతో సినిమా ఎమోషనల్‌గా మారుతుంది. చైల్డ్ ఎపిసోడ్ కాస్త ఎక్కువగానే సాగదీసినట్టు అనిపించినా.. కథలోకి సమయం తీసుకోకుండా వెళ్లడంతో తీస్ మార్ ఖాన్ ఆసక్తికరంగా మారుతుంది. పాయల్ రాజ్‌పుత్, ఆది మధ్య లవ్ ట్రాక్ సరదాగా సాగిపోతుంది. పూర్ణ మరణం తర్వాత చోటుచేసుకొన్న సంఘటనలు కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. తీస్ మార్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ కావడమనే ట్విస్టుతో ఓ క్రేజీ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో తొలి భాగం ముగుస్తుంది. ఫస్టాఫ్ విషయానికి వస్తే.. కమర్షియల్ వ్యాల్యూస్ బేస్‌గా రొటీన్ లవ్, అండ్ యాక్షన్ డ్రామాగా సాగుతుంది.

    సెకండాఫ్‌లో ట్విస్టులు

    సెకండాఫ్‌లో ట్విస్టులు


    ఇక తీస్ మార్ ఖాన్ సెకండాఫ్‌లో రకరకాల ట్విస్టులు సినిమా వేగాన్ని పెంచుతుంది. తెలుగు సినిమాపై అవగాహన కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే.. కథలోని ట్విస్టులు ఊహించడం చాలా తేలికే. కానీ కథను, సన్నివేశాలను, ట్విస్టులను లింక్ చేయడం సినిమా ఎలాంటి గందరగోళం లేకుండా సాగిపోతుంది. ఆది సాయి కుమార్ టాలెంట్‌, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ డిజైన్ చేసుకోవడం సానుకూలంగా మారింది. అయితే కథపై కాస్త కసరత్తు చేసి.. స్క్రీన్ ప్లే కాస్త షార్ప్‌గా ఉండి ఉంటే ఇంకా బెటర్ అవుట్‌పుట్ వచ్చి ఉండేదనిపిస్తుంది. ఓవరాల్‌గా మాస్ ఆడియెన్స్‌ టార్గెట్‌గా ఈ సినిమాను రూపొందించారనే విషయం సెకండాఫ్ తెలియచెబుతుంది.

    ఆది సాయికుమార్ ఫెర్ఫార్మెన్స్

    ఆది సాయికుమార్ ఫెర్ఫార్మెన్స్


    ఆది సాయి కుమార్ లవర్ బాయ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువైన హీరో అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఆ ఇమేజ్‌కు కాస్త దూరంగా మాస్, కమర్షియల్ అంశాలతో తీస్ మార్ ఖాన్ ద్వారా ఓ ప్రయత్నం చేశాడనిపిస్తుంది. యాక్షన్ సీన్లలో ఆది మెప్పించడానే చెప్పవచ్చు. పాయల్ రాజ్‌పుత్‌తో కెమిస్ట్రీ బాగా కుదిరింది. అమ్మ అనే సెంటిమెంట్‌ ఎపిసోడ్స్‌లో ఆది మెచ్యురిటీ కనిపించింది. తన పాత్ర పరంగా, కథ పరంగా మరికాస్త జాగ్రత్త పడి ఉంటే... ఆది కెరీర్‌లో బెటర్ అయి ఉండేదనిపిస్తుంది.

    పాయల్ గ్లామర్, ఇతర నటీనటుల గురించి

    పాయల్ గ్లామర్, ఇతర నటీనటుల గురించి


    పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ తీస్ మార్ ఖాన్‌కు అసెట్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా కథకు ఎలాంటి ఉపయోగపడని పాత్రలో కనిపించింది. కథ మొత్తం పూర్ణ, సునీల్, ఆది మధ్య జరగడం వల్ల పాయల్‌కు ఫెర్ఫార్మెన్స్ విషయంలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదనిపిస్తుంంది. సునీల్ మరోసారి ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించారు. సెకండాఫ్‌లో సునీల్ కొన్ని సీన్లలో అదరగొట్టడంతో నిదానంగా సాగుతున్న కథలో జోష్ పుట్టిస్తారు. కబీర్ ఖాన్, అనూప్ సింగ్ ఠాకూర్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలకు కథకు బలంగా మారాయి. నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఓ కీలకమైన పాత్రలో ఆకట్టుకొన్నాడు. నటనపరంగా ఆయన మంచి ఈజ్‌ను తెరపైన ప్రదర్శించారు.

    సాంకేతిక నిపుణుల పనితీరు

    సాంకేతిక నిపుణుల పనితీరు


    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే. సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. రొమాంటిక్ పాటలు బాగున్నాయి. యాక్షన్ సీన్లు, పాటలు, రొమాంటిక్ ట్రాక్స్‌ను సినిమాటోగ్రాఫర్ బాల్‌రెడ్డి బాగా చిత్రీకరించాడు. ఎడిటర్ మణికాంత్ పనితనం బాగుంది. కథను, సన్నివేశాలను సాగదీయకుండా చక్కటి ప్రతిభను చాటుకొన్నాడు. దర్శకుడు కల్యాణ్ జీ గోగణ పాయింట్ బాగుంది. కానీ ఎమోషనల్ పాయింట్స్‌ను విస్తరించకుండా.. యాక్షన్ పార్ట్‌పైనే ఎక్కువగా కేంద్రీకరించడం వల్ల కథలోని ఎమోషన్స్ తగ్గిందనే ఫీలింగ్ కలుగుతుంది. డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రల ఎంపిక విషయంలో అనుసరించిన విజన్ సినిమాను హై బడ్జెట్ మూవీగా మార్చిందనిపిస్తుంది.

     ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?


    పోలీస్ కథా నేపథ్యంగా ఫ్యామిలీ, ఎమోషన్స్, లవ్, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం తీస్ మార్ ఖాన్. కథ, సన్నివేశాలపై మరింత జాగ్రత్త పడి ఉంటే బెటర్ థ్రిల్లర్ అయి ఉండేది. సెకండాఫ్‌లోని మర్డర్ ట్విస్టు బేస్‌గా కథను విస్తరించి ఉంటే కథలో వైవిధ్యం కనిపించేది. ఓవరాల్‌గా ఈ సినిమా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా కమర్షియల్ స్ట్రెంత్ ఏమిటో తెలుస్తుంది. కమర్షియల్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌కు స్కోప్ ఉన్న చిత్రమని చెప్పుకోవచ్చు.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లస్ పాయింట్స్
    ఆది, ఇతర నటీనటులు పెర్ఫార్మెన్స్
    పాయల్ రాజ్‌పుత్ గ్లామర్
    మ్యూజిక్
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్స్
    ఎమోషనల్ కంటెంట్ ఎలివేట్ కాకపోవడం
    కథ ఇంటెన్సిటీ కొరవడటం

    English summary
    Aadi Saikumar's Tees Maar Khan movie hits the screens on August 19th. Here is the exclusive review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X