For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Adbhutham Movie review : అద్భుతం అన్నారు కాదు కానీ.. ఎలా ఉందంటే?

  |

  2.5/5

  ఈమధ్య చిన్న సినిమాల్లోనే అద్భుతమైన కాన్సెప్టులు బయటకు వస్తున్నాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండా అత్యద్భుతమైన కథలను సింపుల్గా చెప్పేస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగానే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు హీరోగా మారిన

  తేజ సజ్జ, హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా.. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అద్భుతం'. అ, జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథను అందించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా క్రాస్ టైం కనెక్షన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? ప్రశాంత్ వర్మ కథ, మల్లిక్ రామ్ దర్శకత్వం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాయి అనేది రివ్యూ లో తెలుసుకుందాం.

   అద్బుతం కథ ఏంటంటే?

  అద్బుతం కథ ఏంటంటే?

  సూర్య(తేజ సజ్జ) వై టీవీ అనే చానెల్లో న్యూస్ రీడర్ గా పని చేస్తూ ఉంటాడు. తన తండ్రి మరణానికి తానే కారణం అని మధనపడుతూ, జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. చచ్చిపోవడానికి బిల్డింగ్ మీద నుంచి దూకే సమయానికి తనకు తన నంబర్ నుంచే మెసేజ్ వస్తుంది. ఉన్నట్లుండి వాతావరణం విచిత్రంగా ప్రవర్తిస్తూ సెల్‌ఫోన్ కాల్స్ జంప్ అవుతూ ఉండగా ఒక చిన్న ఎఫెక్ట్ కారణంగా అద్భుతం జరుగుతోంది. అలా తన నెంబర్ నుంచే అవతలి పక్క మెసేజ్ చేసేది వెన్నెల(శివాని రాజశేఖర్) అనే అమ్మాయి అని తెలుస్తుంది. కొన్నాళ్లు పరిచయం పెరిగాక సూర్య 2019లోనూ, వెన్నెల 2014లోనూ ఉన్నారని అర్థం అవుతోంది. అక్కడ నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? వాళ్ళు కలిశారా? అసలు వారి జీవితంలో జరిగిన అద్భుతాలు ఏమిటి? వారి జీవితం చివరికి ఏం అయింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడాల్సిందే..

  అద్భుతం సినిమాలో ట్విస్టులు:

  అద్భుతం సినిమాలో ట్విస్టులు:

  సినిమా మొదలయ్యాక ఎప్పుడైతే కాల్స్ రెండు కాలాలకు కనెక్ట్ అయ్యాయి అని తెలుస్తుందో ఆ వెంటనే మీకూ ఈ సంవత్సరమే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ప్లేబ్యాక్ సినిమా గుర్తు వస్తుంది. ఎందుకంటే కథ రాసుకున్న ప్రశాంత్ వర్మ అదే లైన్ తీసుకున్నారు. సూర్య, వెన్నెల ముందే కలుసుకోవడం కానీ ఒక్కటి కాలేక పోవడం, ఆ తరువాత ఫోన్ లో పరిచయం అయి ప్రేమించుకోవడం ఆసక్తి రేపుతాయి. చివరికి వెన్నెల, సూర్య కలిశారా? కలిస్తే ఎలాంటి పరిస్థితులలో కలిశారు? అసలు వీరిద్దరికీ ఒకే నంబర్ ఒకే సమయంలో ఎలా ఉంటుంది ? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.

   దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

  దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

  అద్భుతంలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను దర్శకులు మల్లిక్ రామ్ కొంచెం కొత్తగా తెరకెక్కించాడనీ చెప్పాలి. తెలిసిన కాన్సెప్ట్ అయినా స్క్రీన్ ప్లే తో పాటు హీరో ఫ్రెండ్‌గా సత్య కామెడీ వర్కవుట్ అయ్యింది. దీంతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తెలిసిన కథే అయినా చివరి వరకు పెద్దగా బోర్ కొట్టదు. అయితే ప్లే బ్యాక్ సినిమాలానే ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని పాయింట్లు యాడ్ చేశారు.

  తేజ సజ్జ- శివానీ నటన విషయానికి వస్తే

  తేజ సజ్జ- శివానీ నటన విషయానికి వస్తే

  నటీనటుల విషయానికి వస్తే.. సూర్యగా తేజ సజ్జ నటన ఆకట్టుకుంటుంది. ఎప్పటి లాగే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు, క్లైమ్యాక్స్‌ సీన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఇదే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాని రాజశేఖర్ కూడా నటనలో మంచి మార్కులే సంపాదించింది. మొదటి సినిమా అనే భావన ఎక్కడా కలగలేదు. ఇక దేవీ ప్రసాద్, అంజలి, శివాజీ రాజా, నవీనా రెడ్డి, ఆకట్టుకున్నారు సత్య తన కామెడీతో ఎప్పటిలాగే నవ్వించారు.. బిగ్ బాస్ అరియానా ఎందుకు సెకన్ల పాత్ర చేసిందో ఆమెకే తెలియాలి. మిగతా నటీనటులందరూ తమ పరిధిలో అద్భుతంగా నటించారు.

   సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే

  సాంకేతిక నిపుణుల్లో ముందుగా రచయిత ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన రాసుకున్న కథ, కథనం పాతదే అయినా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక తరువాత దర్శకుడి టేకింగ్ కూడా బాగుంది. కెమెరామెన్ విద్యా సాగర్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్ళాడు. రథన్ సంగీత దర్శకత్వం వహించగా వాటిలో పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాని నెక్ట్స్ లెవల్ కు తీసుకు వెళ్ళింది. ఎప్పటిలాగే లక్ష్మీ భూపాల రాసిన మాటలు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కాస్త మీద మరింత దృష్టి పెట్టాల్సింది.

   ఫైనల్ గా

  ఫైనల్ గా

  ఈ సినిమాను తాము ఎప్పుడో మొదలుపెట్టామని తేజ సజ్జ చెబుతూనే ఉన్నారు. అయినా సరే ముందు ప్లే బ్యాక్ వచ్చింది కాబట్టి దాంతో ముడి పెట్టీ పోలుస్తూ ఉంటారు. అయితే కథలు వేరయినా స్క్రీన్ ప్లే ప్లేబ్యాక్ తరహాలోనే ఉండటం కాస్త ఇబ్బంది కర అంశమే. మొత్తం మీద చూసుకుంటే.. ఈ అద్భుతం మరీ అద్భుతంగా లేకపోయినా ఆకట్టుకునేలానే ఉంది. కాన్సెప్ట్ ఇప్పటికే చూసేసిందే అయినప్పటికీ ఈ సినిమా విషయంలో కాస్త కొత్తదనం ఉంది. ఎలాంటి బూతు కంటెంట్ లేకపోవడంతో వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది.

  Allu Arjun, Sneha Reddy At TajMahal, Celebrates 10th Anniversary
  నటీనటులు:

  నటీనటులు:

  తేజ సజ్జ, శివాని రాజశేఖర్, సత్య, శివాజీ రాజా, దేవీ ప్రసాద్, ఐడ్రీమ్ అంజలి తదితరులు
  కథ: ప్రశాంత్ వర్మ
  దర్శకత్వం: మల్లిక్ రామ్
  సంగీతం: రథన్
  నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్ బ్యానర్
  విడుదల: 19-11-2021
  ఓటీటీ : డిస్నీ + హాట్ స్టార్

  English summary
  Teja Sajja and shivani rajasekhar starrer Adbhutam Movie review and rating in telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X